ప్రధాన మెనూను తెరువు

అనంతపురం

ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా లోని నగరం

అనంతపురం, ఆంధ్రప్రదేశ్ లోని నగరాల్లో ఒకటి. ఇది అనంతపురం జిల్లాకు ముఖ్య పట్టణం.

అనంతపురం
Clock tower at Anantapur
Clock tower at Anantapur
దేశంభారత దేశము
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం
విస్తీర్ణం
 • మొత్తం15.98 కి.మీ2 (6.17 చ. మై)
సముద్రమట్టము నుండి ఎత్తు
335 మీ (1 అ.)
జనాభా
(2011)[1]
 • మొత్తం2,61,004
 • సాంద్రత16,000/కి.మీ2 (42,000/చ. మై.)
Languages
 • OfficialTelugu
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
PIN
515001
Telephone code08554
వాహనాల నమోదు కోడ్AP-02

విజయవాడకు నైఋతి దిశలో 485 కి.మీ దూరంలో, జాతీయ రహదారి 7 పై ఉంది.ఇది 1799లో దత్త మండలానికి (రాయలసీమతో కూడిన బళ్ళారి) కేంద్రంగా ఉండేది. అనంతపురానికి సర్ థామస్ మన్రో మొదటి కలెక్టరు.రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీషు భారత సైన్యానికి అనంతపురం వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది.ఇప్పటి జె ఎన్ టి యు ప్రాంగణం అప్పట్లో ఆయుధ బంకరుగా వాడేవారు.వాటి అవశేషాలను ఈ ప్రాంగణంలో ఇప్పటికీ చూడవచ్చును.

భౌగోళికంసవరించు

అనంతపురం 14°41′N 77°36′E / 14.68°N 77.6°E / 14.68; 77.6 న ఉంది. దీని సరాసరి ఎత్తు 335 మీ (1099 అడుగులు)

గ్రామ నామ వివరణసవరించు

అనంతపురం అన్న గ్రామనామాలు వ్యక్తి నామసూచిగా పరిశోధకులు వర్గీకరిస్తున్నారు.[2]

ప్రముఖులుసవరించు

అనంతపురం నగరపాలక సంస్థసవరించు

అనంతపురం నగరపాలక సంస్థ అనంతపురం జిల్లా లోని ఏకైక నగరపాలక సంస్థ.రాయలసీమ ప్రాంతంలో ఒక కుగ్రామంగా పురుడు పోసుకున్న 'అనంతపురం' అంచెలంచెలుగా ఎదుగుతూ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందింది. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో 'స్థానిక' పాలన హోదాను దక్కించుకుని అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అనాటి నుంచి 145 ఏళ్లు 'స్థానిక' పాలన సాగింది. 2014 దాకా 38 మంది ఛైర్మన్లు, ప్రత్యేక అధికారులు పాలించారు. వీరిలో 15 మంది ఛైర్మన్లు, 23 మంది ప్రత్యేక అధికారులు ఉన్నారు. 1869లో బ్రిటీష్ ప్రభుత్వం అనంతపురానికి మున్సిపాల్టీ హోదా కల్పించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో ఛైర్మన్ల వ్యవస్థ ఆరంభమైంది. 'ఎన్నిక' విధానం అమల్లోకి వచ్చింది

వాతావరణంసవరించు

అనంతపురం శుష్క వాతావరణం కలిగిన ప్రదేశం. ఏడాదిలో అధికభాగం పొడిగా, వేడిమితో కూడి ఉంటుంది. ఫిబ్రవరి ద్వితీయార్థం నుండి వేసవి మొదలయి మేలో అత్యధిక ఉష్ణోగ్రత 40-42 డిగ్రీల సెంటీగ్రేడు (104 - 107.6 డిగ్రీల ఫారెన్ హీట్) సరాసరిగా నమోదవుతుంది. నైఋతి రుతుపవనాల వలన మార్చి లోనే తొలకరి జల్లులు పడతాయి. ఋతుపవనాలు సెప్టెంబరులో మొదలయి నవంబరులో ముగుస్తుంది. వీటివలన 250 ఎం. ఎం. (9.8 ఇంచి) ల వర్షం నమోదవుతుంది. పొడిగా ఉండే తేలికపాటి శీతాకాలం నవంబరు ద్వితీయార్థంలో మొదలయి ఫిబ్రవరి ప్రథమార్థం వరకూ కొనసాగుతుంది. ఈ వాతావరణంలో ఉష్టోగ్రత యొక్క సరాసరి 30 నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడు (86 నుండి 89.6 డిగ్రీల ఫారెన్ హీట్) గా నమోదవుతుంది. సాలీన వర్షపాతం 22 అంగుళాలు (560 ఎం ఎం).

చిత్రమాలికసవరించు

రవాణాసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Municipalities, Municipal Corporations and UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Retrieved 23 June 2016.
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. Retrieved 10 March 2015.

మూసలు, వర్గాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అనంతపురం&oldid=2776930" నుండి వెలికితీశారు