పల్లె ప్రకృతి వనం

పల్లె ప్రకృతి వనం అనేది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక ప్రకృతి వనం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో 19,472 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్నారు.[1]

పల్లె ప్రకృతి వనం
ఖమ్మం జిల్లా సింగరాయపాలెం గ్రామంలోని పల్లె ప్రకృతి వనం
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వం

ప్రణాళిక మార్చు

తెలంగాణకు హరితహారంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడానికి రాష్ట్రంలో రూ.116 కోట్ల వ్యయంతో 19,472 పల్లె ప్రకృతి వనాలు నిర్మించబడ్డాయి. గ్రామాల్లో స్థలం అందుబాటులో ఉన్న వేర్వేరు ప్రదేశాల్లో చిన్న చిన్న వనాలను ఏర్పాటుచేయడానికి వీలుగా భూమిని గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసాయి.[2]

నిబంధనలు మార్చు

పల్లె ప్రకృతి వనాలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలు తయారుచేసింది.[3]

 • ఎకరం విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటుచేయాలి
 • 4-5 వేల మొక్కలు నాటాలి
 • చిట్టడివి మాదిరిగా ఉండాలి
 • ఆహ్లాదాన్ని నింపేలా, సేద తీరేలా పండ్లు, సుందరీకరణ మొక్కలు, నీడనిచ్చే చెట్లు మొదలైన నాలుగు రకాల మొక్కలను పెంచాలి
 • పంచాయతీరాజ్ నిధులతో పల్లె ప్రకృతి వనం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి
 • రూ.3 లక్షల వరకు ఖర్చుతో గ్రామ పంచాయతీ నిధులతో ద్వారం, నామఫలకం ఏర్పాటు చేసుకోవాలి
 • నడకకు ప్రత్యేక దారి ఏర్పాటుచేయాలి

పెంచాల్సిన మొక్కలు మార్చు

మూడు వరుసలలో (హద్దు వెంట ఎత్తుగా పెరిగే చెట్లు, లోపలి భాగంలో ఎత్తుగా పెరిగే చెట్లు, ఇంకా లోపలి భాగంలో చిన్నగా పెరిగే చెట్ల) పెంచాలి. వేప, రావి, మర్రి, కానుగ, బాదం వంటి భారీ వృక్షాలను హద్దు ప్రదేశంలో పెంచాలి. గన్నేరు, మందార తదితర చెట్లను లోపల పెంచాలి. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఔషధ మొక్కలు, నిత్యావసర మొక్కలైన ఉసిరి, నేరేడు, సీమ చింత, కరివేపాకు, జామ ఇలా అన్ని రకాలను నాటాలి.

ఫలితాలు మార్చు

 • రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో పచ్చని చెట్లు, మొక్కలతోపాటు ఎరువులు వంటివి వాడకుండా కూరగాయలు, ఆకుకూరలు కూడా పండిస్తున్నారు.[4]

మూలాలు మార్చు

 1. Avadhani, R. (2021-07-17). "Palle Prakruthi Vanams changing the face of villages". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2021-07-24. Retrieved 2021-11-18.
 2. "పల్లె పులకరించేలా ప్రకృతి వనాలు". andhrajyothy. 2020-07-07. Archived from the original on 2021-11-18. Retrieved 2021-11-18.
 3. "పల్లె వనం.. కళ కనం!". EENADU. Archived from the original on 2021-11-18. Retrieved 2021-11-18.
 4. "పల్లె ప్రకృతి వనం: చక్కని వాతావరణంతో పాటు తాజా కూరగాయలు!". ETV Bharat News. 2021-01-08. Archived from the original on 2021-11-18. Retrieved 2021-11-18.