తెలంగాణకు హరితహారం

తెలంగాణ కు హరిత హరమ్

తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 2016లోనే 46 కోట్ల మొక్కలు నాటబడ్డాయి.[1]

తెలంగాణకు హరితహారం
Haritha Haram Logo.jpeg
తెలంగాణకు హరితహారం లోగో
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణకు హరితహారం ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు

కార్యక్రమాలుసవరించు

హైదరాబాదు నగరంలో ఒక్కరోజులోనే 25 లక్షల మొక్కలు, ఒకేరోజు లక్షమంది 163 కిలోమీటర్ల పొడవునా నిలబడి మొక్కలు నాటి రికార్డు సృష్టించారు.ప్రతీ రెండు గ్రామాలకు ఒక నర్సరీ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,213 నర్సరీలు ఏర్పాటుచేశారు. కేవలం ఒకే రకం చెట్లు కాకుండా నీడనిచ్చే చెట్లు, పండ్ల చెట్లు, పూల చెట్లు, ఔషధ మొక్కలను కూడా నాటారు. 2016లో నాటిన 46 కోట్ల మొక్కల్లో నీడ నిచ్చే వేప, మర్రి, రావి లాంటివి 36.81 కోట్ల మొక్కలు... టేకు, మద్ది లాంటి లాభదాయక చెట్లు మరో 8.5 కోట్ల మొక్కలు...పండ్ల చెట్లు కోటి దాకా ఉన్నాయి. అంతేకాకుండా పూలచెట్లు, ఈత మొక్కలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలోనే కాకుండా అన్ని రహదారులకు ఇరువైపులా, విద్యాలయాల్లో, పోలీస్ ప్రాంగణాల్లో, మార్కెట్ యార్డుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, శ్మశాన వాటికలు, గ్రేవ్ యార్డుల్లో, పరిశ్రమల్లో, పారిశ్రామిక వాడల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో మొక్కలు నాటారు.

ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ శాఖలు, పాఠశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, డ్వాక్రా మహిళలతో సహా అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్విజయవాడ, హైదరాబాద్ - ముంబాయి, హైదరాబాద్వరంగల్, హైదరాబాద్బెంగుళూరు, హైదరాబాద్నాగపూర్ వంటి జాతీయ రహదారులకిరువైపులా పెద్ద పూల చెట్లు నాటారు.

లక్ష్యాలుసవరించు

తెలంగాణ రాష్ట్ర భూభాగం 1,12,101 కిలోమీటర్లు ఉండగా అడవులు 26,903.70 కిలోమీటర్లమేర (24శాతం) ఉన్నాయి. హరితహారం ద్వారా అటవీ ప్రాంతాన్ని 33శాతానికి పెరిగేలా చేయడం.తద్వారా వానలు వాపస్‌ వచ్చేలా చూడటం. అడవిలో, రోడ్లకిరువైపులా పండ్ల చెట్లను నాటటంద్వారా నివాసాలు, పంటపొలాలపై దాడిచేస్తున్న కోతులకు ప్రత్యామ్నాయం చూపటం. వాతావరణంలో ప్రాణవాయువును పెంచటం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం, ఇతర పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడం నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను నాటి సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అటవీ ప్రాంతంలో 100కోట్ల మొక్కలు, అటవీ ప్రాంతం వెలుపల 120 కోట్ల మొక్కలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 10కోట్ల మొక్కలు పెంచడం

 1. తెలంగాణలో ఉన్న 24 శాతం అటవీ ప్రాంతంలో నూటికి నూరు శాతం అడవులు పెంచడం
 2. పట్టణాలు, గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున సామాజిక అడవుల పెంపకం
 3. తెలంగాణ వ్యాప్తంగా ఐదేళ్ల కాలంలో 230 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం
 4. అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలు, హైదరాబాద్ నగర పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటడం
 5. సహజసిద్ధమైన అడవులను పరిరక్షించడం, పునరుజ్జీవింపచేయడం
 6. అటవీ భూముల దురాక్రమణను అడ్డుకోవడం
 7. పెద్ద ఎత్తున సాగే వృక్షాల నరికివేతను నిలువరించడం
 8. సామాజిక అడవుల పెంపకానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టడం
 9. ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టడం[2]

హరిత హారం నినాదాలుసవరించు

హరిత హారం లక్ష్యాలను విస్త్రుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వివిధ నినాధాలను ఉపయోగిస్తున్నారు.

 • తెలంగాణ 'పచ్చ'ల పేరు.. హరిత హారం జోరు
 • వనాలు పెంచు-వానలు వచ్చు
 • చెట్లను పెంచు-ఆక్సిజన్‌ పీల్చు
 • పచ్చని అడవులు-సహజ సౌందర్యములు
 • వనాలు-మానవాళి వరాలు
 • పచ్చని వనములు-ఆర్థిక వనరులు
 • అడవులు-మనకు అండదండలు
 • అడవి ఉంటే లాభం-అడవి లేకుంటే నష్టం
 • అడవిని కాపాడు-మనిషికి ఉపయోగపడు
 • అటవీ సంపద-అందరి సంపద
 • చెట్లు నరుకుట వద్దు-చెట్లు పెంచుట ముద్దు
 • అడవులు-వణ్యప్రాముల గృహములు
 • పచ్చని వనాలు-రోడ్డునకు అందములు
 • సతతం-హరితం
 • మొక్కలు ఉంటే ప్రగతి-మొక్కలు లేకుంటే వెలితి
 • చెట్టుకింద చేరు-సేదను తీరు
 • అడవులు ఉంటే కలిమి-అడవులు లేకుంటే లేమి
 • అడవులు అంతరించడం అంటే-మనిషి పతనం అయినట్టే
 • మొక్కను పట్టు-భూమిలో నాటు
 • దోసిలిలోకి తీసుకోమొక్కు -ఏదోస్థలమున నాటుము మొక్క

మొక్కల ఎంపికసవరించు

హరిత హారం కార్యక్రమంలో మొక్కుబడిగా ఏదో ఒక మొక్కలు నాటకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా మొక్కలను నాటి వాటిని నిబద్ధతతో సంరక్షించి వాటి ప్రయోజనాలను సమాజానికి అందేలా చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి మొక్కలు నాటాలి...

పొలంగట్ల మీద:సవరించు

టేకు, వెదురు, గచ్చకాయ, గోరింట, సుబాబుల్, పండ్ల మొక్కలు

ఇంటి పరిసరాల్లోసవరించు

కరివేపాకు, మునగ, బొప్పాయి, జామ, ఉసిరి, దానిమ్మ, కానుగ, వేప, బాదం

పాఠశాలలు, కార్యాలయాలుసవరించు

కానుగ, వేప, బాదం, రావి, జువ్వి, మర్రి, నేరేడు, ఉసిరి

రహదారుల పక్కనసవరించు

ఎర్రతురాయి, పచ్చతురాయి, బాహీనియా, కానుగ, నేరేడు, దిరిశిన, సిస్సు

చెరువుగట్లుసవరించు

ఈత, తాటి, ఖర్జూర, కొబ్బరి, తెల్లమద్ది, నల్లతుమ్మ

బోడిగుట్టలుసవరించు

ఉసిరి, సీతాఫలం, మర్రి, రావి, వేప తదితర మొక్కలు నాటుకోవచ్చు.

మొదటి విడత హరిత హారంసవరించు

హరిత హారం మొదటి విడతను 2015 జులై 3న చిలుకూరులో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తొలి ఏడాది 15.96 కోట్ల మొక్కలు నాటారు.

రెండవ విడత హరిత హారంసవరించు

రెండో విడతను 2016 జులైన 8న చిట్యాలలో ప్రారంభించారు. రెండో విడత హరితహారాన్ని నల్లగొండ జిల్లా గుండ్రంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించటం జరిగింది. ఆ దఫాలో 31.67 కోట్ల మొక్కలు నాటారు.

మూడవ విడత హరిత హారంసవరించు

మూడో విడతను 2017 జులైలో కరీంనగర్‌లో ప్రారంభించారు. 34 కోట్లకుపైగా మొక్కలు నాటారు. మూడో విడత హరితహారాన్ని కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు డ్యామ్ వద్ద మొక్క నాటి ప్రారంభిచటం జరిగింది.

నాల్గవ విడత హరిత హారంసవరించు

2018 ఆగస్టు 1న మెదక్ జిల్లాలోని గజ్వేల్‌లో నాలుగో విడత హరిత హారం ప్రారంభం కాగా.. 32 కోట్ల మొక్కలు నాటారు.

అయిదవ విడత హరిత హారంసవరించు

ఐదో విడతను కూడా గజ్వేల్‌లోనే ప్రారంభించగా 38 కోట్ల మొక్కలు నాటారు.


ఆరోవిడత హరిత హారంలో మియావాకి పద్దతి అమలుసవరించు

ఆరో విడత హరితహారం కార్యక్రమం 2020, జూన్ 25న మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌ గ్రామంలో ముఖ్యమంత్రి కెసీఆర్ అల్లనేరేడు మొక్కను నాటి ప్రారంభించాడు. ఈ విడత హరితహారం కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు.[3]

రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా హరిత హారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఆరో దశలో 30 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువగా మొక్కలు నాటగా.. ఈసారి అడవుల్లో ఎక్కువ మొక్కలు నాటే ప్రణాళికలు రూపొందించారు. హెచ్ఎండీఏ పరిధిలో 5 కోట్ల మొక్కలు.. జీహెచ్ఎంసీ పరిధిలో 2.5 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు. అటవీ శాఖ అధ్వర్యంలో 2.61 కోట్ల మొక్కలు నాటనున్నారు. హరితహారం కోసం రాష్ట్రంలోని 12,50 నర్సరీల్లో మొక్కలు సిద్దపరిచారు. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అడవుల్లా పెంచే జపాన్‌ పద్ధతి మియావాకీ పద్దతి అంటారు. ఈ విధానంలో పెంపకం వల్ల మొక్కలు అత్యంత త్వరితంగా పెరగడమే కాక దట్టంగా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుంది. ఆరవ దశ హరిత హారంలో ఈ పద్దతిని అనుసరిస్తున్నారు. "స్వదేశీ చెట్ల ద్వారా దేశీయ అడవులను" పునర్నిర్మించే మియావాకి పద్ధతి 20 నుండి 30 సంవత్సరాలలో గొప్ప, దట్టమైన, సమర్థవంతమైన రక్షిత మార్గదర్శక అడవిని ఉత్పత్తి చేస్తుంది,

మూలాలుసవరించు

 1. గౌడ్స్ న్యూస్.కాం. "'తెలంగాణకు హరితహారం' మరో కొత్త రికార్డు సృష్టించబోతున్నది". goudsnewstv.com. Archived from the original on 30 మార్చి 2017. Retrieved 5 January 2017.
 2. తెలంగాణ మాస పత్రిక. "తెలంగాణకు హరితహారం". magazine.telangana.gov.in. Archived from the original on 23 జనవరి 2017. Retrieved 6 January 2017.
 3. నమస్తే తెలంగాణ, తెలంగాణ (25 June 2020). "హరితహారం : అల్లనేరేడు మొక్క నాటిన సీఎం కేసీఆర్‌". ntnews. Archived from the original on 25 June 2020. Retrieved 25 June 2020.