పశువులలో వంధ్యత్వం
పశువులలో గొడ్డు మోతుతనం అనేది సాధారణమైన పరిణమం. దీనివలన విపరీతమైన ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. అలాగే భారతదేశంలోని పాడి పరిశ్రమ కుంటుపడుతోంది. గొడ్డుపోయిన పశువులను పోషించడం ఆర్థికంగా భారమౌతుంది. చాలా దేశాలలో అలాంటి పశువులను కబేళాలకు తరలిస్తారు.[1]
పశువులలో గొడ్డు మోతుతనం వలన, ఇతర పునరోత్పత్తి సమస్యల వల్ల పాలఉత్పత్తి 10-30 శాతం వరకూ తగ్గిపోతోంది. పశువులలో సంతానోత్పత్తి పెరగడానికి ఆడ పశువులకు, మగ పశువులకు మేతను బాగా ఇచ్చి, రోగాలేవీ లేకుండా చూసుకోవాలి.
పశువులలో వంధ్యతకు గల కారణాలు
మార్చుపశువవులలో గొడ్డు మోతుతనానికి గల కారణాలు అనేకం, సంక్లిష్టమైనవి. సంతానోత్పత్తి జరుగకపోవడానికి పోషకాహార లోపం, అంటువ్యాధులు, పుట్టుకతో వచ్చిన జన్యుపరమైన లోపాలు, యాజమాన్య దోషాలు, ఆడ పశువులలో అండోత్సర్గం లేక హార్మోను సమతుల్యత లేకపోవడం కారణాలు కావచ్చు.
ఋతు చక్రం
మార్చుఆవులు, గేదెలు కూడా 18 నుండి 21 రోజులకొకసారి 18 నుండి 24 గంటల పాటు ఎదకు వస్తాయి. కాని, గేదెలలో మూగ ఎద ఉంటుంది కాబట్టి, ఆ సమయాన్ని తెలుసుకోవటం రైతులకు పెద్ద సమస్యగా మారుతుంది. తెల్లవారుఝాము నుండి రాత్రి పొద్దుపోయేంత వరకూ 4 నుండి 5 సార్లు పశువులను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. పశువులు ఎదకు రావడాన్ని పసికట్టలేక పోయినట్లయితే వంధ్యత్వం పెరుగే అవకాశంవుంది. కంటికి కనిపించే లక్షణాలను బట్టి ఎదలో ఉన్న పశువులను గుర్తించడానికి మంచి నైపుణ్యం కావాలి. రికార్డులను సరిగా పెట్టుకుని పశువులను పరీక్షించడంలో ఎక్కువ సమయం గడిపిన రైతులు మరిన్ని ఎక్కువ ఫలితాలు సాధించగలిగారు.
గొడ్డు మోతుతనం నివారించడానికి చిట్కాలు
మార్చు- గర్భధారణ, ఎద సమయంలో జరిగేటట్లు చూసుకోవాలి.
- పశువులు ఎదకు రాకపోయినా లేదా ఋతుచక్రం సరిగా లేకపోయినా వాటికి పరీక్ష చేయించి, చికిత్స ఇప్పించాలి.
- పశువులను ఆరోగ్యంగా ఉంచడానికి ఆరు నెలలకొకసారి కడుపులోని ఏలికపాములను అరికట్టడానికి మందు ఇప్పించాలి. క్రమం తప్పకుండా కడుపులోని ఏలికపాములను నివారించడం మీద పెట్టిన చిన్న పెట్టుబడి, పాల సరఫరాలో పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జించి పెడుతుంది.
- పశువులకు శక్తి నిచ్చే, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమిన్ అనుబంధంతో కూడుకున్న సమతుల్యమైన ఆహారం ఇవ్వాలి. దీని వలన గర్భధారణ శాతం పెరిగి, గర్భం ఆరోగ్యకరంగా నిలిచి, ప్రసవం సురక్షితంగా జరిగి, అంటువ్యాధులు రాకుండా ఉండి దూడ ఆరోగ్యంగా ఉంటుంది.
- దూడలకు / పెయ్యలకు మంచి పోషణ ఇచ్చి సంరక్షిస్తే 230 నుండి 250 కిలోల వరకూ బరువు పెరిగి, సకాలంలో యుక్త వయస్సుకు వచ్చి, గర్భధారణకు అనువుగా తయారై సంతానోత్పత్తికి అవకాశాలు మెరుగుపడతాయి.
- చూడి పశువులకు సరిపడినంత పచ్చి మేత మేపితే, పుట్టిన దూడలకి అంధత్వం రాకుండా ఉంటుంది. దూడ పుట్టగానే మాయ కూడా సులభంగా పడిపోతుంది.
- సహజంగా జరిగే గర్బాధారణలో, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన లోపాలు, అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే ఆబోతు (లేక దున్నపోతు) యొక్క పునరుత్పత్తి చరిత్ర తెలిసి ఉండడం చాలా ముఖ్యం.
- పశువుల పునరుత్ర్పత్తి ప్రక్రియ, ప్రసవం పరిశుభ్రమైన పరిస్థితులలో జరిపించినట్లయితే చాలావరకూ గర్భసంచికి అంటువ్యాధులు సోకకుండా నివారించుకోవచ్చు.
- కృత్రిమ సంపర్కం జరిపించిన 60 నుండి 90 రోజులకు, పశువులు చూలు కట్టిందీ లేనిదీ పశు వైద్యులతో పరీక్ష చేయించి ధ్రువపరచుకోవాలి.
- చూలు కట్టిన పక్షంలో ఇంక ఆవు (లేక గేదె) గర్భధారణ కాలంలో ఎదకు రాదు. ఆవుకి గర్భావధి కాలం 285 రోజులు, మరి గేదెలకు 300 రోజులు.
- గర్భధారణ చివరి దశలలో అనవసరమైన ఆందోళన కలిగించ కూడదు, అనవసరంగా ఎక్కడికీ తీసుకొని వెళ్ళరాదు.
- మెరుగైన పోషణకు, ప్రసవ సమయంలో సంరక్షణ కొరకు చూడి పశువును మిగతా పశువులతో బాటు కాకుండా దూరంగా ఉంచాలి.
- ప్రసవానికి రెండు నెలల ముందు చూడి పశువులను ఎండ గట్టి, తగినంత పోషణ, వ్యాయామం ఇవ్వాలి. దీని వలన తల్లి పశువుకు ఆరోగ్యం మెరుగుపడి సగటు బరువు కలిగిన ఆరోగ్యవంతమైన దూడను ప్రసవిస్తుంది. అంతే కాకుండా వ్యాధులు సోకకుండా ఉండి తొందరగా ఋతు చక్రం తిరిగి మొదలౌతుంది.
- డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ టెన్షన్, TANUVAS ప్రకారము ఈనిన నాలుగు నెలలలోపు లేక 120 రోజుల తరువాత మళ్ళీ గర్భధారణ మొదలైతే ఏడాదికి ఒక దూడ అన్న లక్ష్యం నెరవేరి పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది.