పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం

పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ లోని వికారాబాదు జిల్లా యందలి కుల్కచర్ల సమీపంలోని లోని హిందూ దేవాలయం. ఇందలి ప్రధాన దైవం శివుడు.

పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం
పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం is located in Telangana
పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం
పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం
తెలంగాణలో ప్రదేశం
భౌగోళికాంశాలు:17°19′48″N 77°54′00″E / 17.33000°N 77.90000°E / 17.33000; 77.90000
స్థానం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తెలంగాణ
ప్రదేశం:పాంబండ, వికారాబాదు జిల్లా, తెలంగాణ
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శివుడు
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం

ఆలయ విశేషాలు

మార్చు

పాంబండ దేవాలయానికి ఘనమైన చరిత్ర ఉంది. సూమారు కిలోమీటరు విస్తీర్ణంలో వెలసిన ఏకశిల పాము ఆకారంలో మెలితిరిగి ఉంటుంది. ఈ పాము-బండనే క్రమంగా పాంబండగా పిలువబడుతోంది. ఈ ఆలయానికి సంబంధించి స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో రావణ సంహారం తరువాత బ్రహ్మ హత్యాపాపం నుంచి విముక్తి కోసం కోటి లింగాలను స్థాపించాలని శ్రీరాముడికి మహర్షులు సూచిస్తారు. అందులో భాగంగానే పాంబండపైన శ్రీరాముడు స్వయంగా లింగాన్ని స్థాపించి పూజించాడని అంటారు. అందుకే ఇక్కడ శివుడిని రామలింగేశ్వరుడని పిలుస్తారు. ఆలయం పక్కనే రామలక్ష్మణుల దేవాలయం ఉంది. మొదట్లో పాంబండ ఒక పెద్ద ఏకశిల. కానీ కాలక్రమంలో అది రెండుగా చీలిపోయింది. ఒక పెద్ద పాము బండ మధ్యలో నుంచి వెళ్లడంతో అది చీలిపోయిందని చెప్పుకుంటారు. ఈ బండ వెనుక భాగంలో పుట్టు లింగం ఉంది. ఇది ప్రతీ సంవత్సరం కొద్దికొద్దిగా పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయం పక్కనే భ్రమరాంబదేవీ ఆలయం ఉంటుంది. దానికి ముందుభాగంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. ఈ బండకు వెనుక ఉన్న చర్ల అనే ఊరు క్రమంగా బండవెనుక చర్లగా పిలువబడేదని, క్రమంగా అది బండవెల్కిచర్లగా రూపాంతరం చెందిందని తెలుస్తోంది. ఈ ఆలయం సమీపంలో ఇటీవల కొత్తగా కల్యాణ మండపాన్ని నిర్మించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, శకటోత్సవం, రథోత్సవం, అగ్నిగుండాలు, జాతర నిర్వహిస్తారు.

గుండం విశిష్టత

మార్చు

పాంబండపై ఉన్న గుండంలో నీటికి చాలా విశిష్టత ఉందని భక్తులు విశ్వశిస్తారు. అంతపెద్ద బండ మధ్యలో వెలసిన ఈ కోనేరులో ఎల్లప్పుడూ నీరుంటుంది. శ్రీరాముడు లింగాన్ని స్థాపించిన సమయంలో పూజ చేయడానికి పుణ్య జలాల కోసం శ్రీరాముడు బాణాన్ని సందించి బండ మధ్యలో కోనేరును సృష్టించాడనీ, ఆ నీటితోనే అభిషేకం చేశాడని భక్తులు పేర్కొంటారు. అందుకే ఈ గుండం ఎప్పుడూ ఎండిపోదు. అన్ని కాలాల్లో స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఈ గుండంలో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, పొలాల్లో, పశువులపై, ఇళ్లపై ఈ నీటిని చల్లితే ఎలాంటి అరిష్టాలైనా తొలగిపోతాయని ప్రజల నమ్మకం. ఇక్కడికి వచ్చిన భక్తులు గుండంలో నీటిని తమతో తీసుకుపోయి పొలాల్లో చల్లుతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉగాదికి రెండు రోజుల ముందు పాంబండపై వీరశైవులు అగ్నిగుండాలు తొక్కే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఎర్రటి నిప్పుపైన నడుస్తూ అగ్నిగుండాలు తొక్కడం ఇక్కడ ప్రత్యేకత.

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు