పాడెద నీ నామమే గోపాలా

<poem>

సాహిత్యందాశరథి కృష్ణమాచార్య
భాషతెలుగు
రూపంపాట

పాడెద నీ నామమే గోపాలా హృదయములోన పదిలముగా నిలిపెద నీ రూపమేరా...

మమతలతోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా ఆశలతోనే హారతి చేసి పదములు పూజింతురారా

నీ మురళీ గానమే పిలిచెరా కన్నుల నీ మోము కదలెనులేరా పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునా తటిపై నీ సన్నిధిలో జీవితమంతా కానుక చేసేను రారా