పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) అనేది ఒక భారతీయ ముస్లిం రాజకీయ సంస్థ. ఇది ముస్లిం మైనారిటీ రాజకీయాల, ప్రత్యేకవాద శైలిలో నిమగ్నమై ఉంటుంది. తరచుగా ఇది చేసే సంఘవ్యతిరేక కార్యకలాపాల కారణంగా దీనిని భారత హోం మంత్రిత్వ శాఖ చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద 28 సెప్టెంబర్ 2022న ఐదు సంవత్సరాల పాటు నిషేధించింది.[5][6][7][8][9]

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా
సంకేతాక్షరంPFI
ఆశయంనయా కారవాన్: నయా హిందుస్థాన్
ముందువారునేషనల్ డెవలప్‌మెంట్ ఫ్రంట్
స్థాపన22 నవంబరు 2006; 17 సంవత్సరాల క్రితం (2006-11-22)
Merger ofకర్ణాటక ఫోరమ్ ఫర్ డిగ్నిటీ
రకంఇస్లామిక్ కార్యకర్త సంస్థ[1][2]
కేంద్రీకరణముస్లిం రాజకీయ సమీకరణ[3]
హిందుత్వాన్ని ప్రతిఘటించడం[4]
ప్రధాన
కార్యాలయాలు
న్యూ ఢిల్లీ
సేవా ప్రాంతాలుభారతదేశం
అధ్యక్షుడుOMA అబ్దుల్ సలామ్
ఉపాధ్యక్షుడుE.M. అబ్దుల్ రహిమాన్
జనరల్ సెక్రటరీఅనిస్ అహ్మద్
రిమార్కులు28 సెప్టెంబర్ 2022 నుండి ఐదేళ్ల పాటు నిషేధించబడింది

స్థాపన

మార్చు

కర్ణాటక ఫోరమ్ ఫర్ డిగ్నిటీ (KFD), నేషనల్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ (NDF) విలీనంతో 2006లో PFI స్థాపించబడింది. ఈ సంస్థ తనను తాను "న్యాయం, స్వేచ్ఛ, భద్రతను నిర్ధారించడానికి ప్రజలను శక్తివంతం చేయడానికి కట్టుబడి ఉన్న నయా-సామాజిక ఉద్యమం"గా పేర్కొంది. ఇది ముస్లిం రిజర్వేషన్ల కోసం వాదిస్తుంది. 2012లో, అమాయక పౌరులను నిర్బంధించడానికి UAPA చట్టాన్ని ఉపయోగించారని ఆరోపిస్తూ సంస్థ నిరసనలు నిర్వహించింది.[7][10][11][12][13][14]

ముస్లిం దేశంగా మార్చడం

మార్చు

2017లో, ఇండియా టుడే, అండర్‌కవర్ ఆపరేషన్‌లో, PFI వ్యవస్థాపక సభ్యుడు, PFI మౌత్‌పీస్ తేజస్ మేనేజింగ్ ఎడిటర్ అహ్మద్ షరీఫ్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో, "భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడమే PFI ఉద్దేశ్యమా?" అని ప్రశ్నించగా, అతను "ప్రపంచమంతా. భారతదేశం మాత్రమే ఎందుకు? భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా చేసిన తర్వాత ఇతర దేశాలకు వెళతాము" అని అన్నాడు. PFI గతంలో మధ్యప్రాచ్యం నుండి నిధులను సేకరించి హవాలా మార్గాల ద్వారా భారతదేశంలోకి బదిలీ చేసిందని కూడా అతను అంగీకరించాడు.[15]

సంఘ వ్యతిరేక కార్యకలాపాలు

మార్చు

PFI తరచుగా దేశవ్యతిరేక, సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. 2012లో, కేరళ ప్రభుత్వం ఈ సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌కు అనుబంధంగా ఉన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (SIMI) పునరుత్థానమని పేర్కొంది.

మారణాయుధాలు

మార్చు

కేరళ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో PFI తరచుగా హింసాత్మక ఘర్షణలకు పాల్పడుతోంది. పిఎఫ్ఐ కార్యకర్తల వద్ద మారణాయుధాలు, బాంబులు, గన్‌పౌడర్లు, కత్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తాలిబాన్, అల్-ఖైదా వంటి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నందుకు సంస్థపై అనేక ఆరోపణలు వచ్చాయి.[16][17][18]

నిషేధం

మార్చు

పిఎఫ్ఐ చేస్తున్న సంఘ వ్యతిరేక కార్యపాలను ఆపేందుకు, దీని అనుబంధ సంస్థలైన నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్ (NWF), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (CFI)తో సహా సమాజంలోని వివిధ విభాగాలలో వివిధ శాఖలను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022 సెప్టెంబర్ 22న ఐదు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం PFI 8 అనుబంధ సంస్థలకువర్తించింది.[19]

మూలాలు

మార్చు
  1. Emmerich 2019.
  2. Santhosh & Paleri 2021, p. 574: "Contrary to its claims of being non-religious in character, the PFI is often found to deploy radical Islamic identity for grassroot mobilization and has been accused of engaging in a series of violent incidents with specific religious motifs.".
  3. సంతోష్ & పలేరి 2021, p. 565.
  4. Santhosh & Paleri 2021, pp. 573–574.
  5. Santhosh, R; Paleri, Dayal (6 డిసెంబరు 2020). "Ethnicization of religion in practice? Recasting competing communal mobilizations in coastal Karnataka, South India". Ethnicities. 21 (3). SAGE Publications: 574. doi:10.1177/1468796820974502. ISSN 1468-7968.
  6. Emmerich, A.W. (2019). Islamic Movements in India: Moderation and its Discontents. Royal Asiatic Society Books. Taylor & Francis. p. 46. ISBN 978-1-000-70672-7. Retrieved 30 సెప్టెంబరు 2022.
  7. 7.0 7.1 Santhosh, R; Paleri, Dayal (6 డిసెంబరు 2020). "Ethnicization of religion in practice? Recasting competing communal mobilizations in coastal Karnataka, South India". Ethnicities. 21 (3). SAGE Publications: 563–588. doi:10.1177/1468796820974502. ISSN 1468-7968.
  8. Das, Krishna N. (28 సెప్టెంబరు 2022). "India bans Islamic group PFI, accuses it of 'terrorism'". Reuters (in ఇంగ్లీష్). Retrieved 28 సెప్టెంబరు 2022.
  9. "Centre declares PFI 'unlawful association' for 5 years". ANI News. 28 సెప్టెంబరు 2022. Archived from the original on 30 సెప్టెంబరు 2022. Retrieved 30 సెప్టెంబరు 2022.
  10. Kumar, Narender (2019). Politics and Religion in India (in ఇంగ్లీష్). Taylor & Francis. p. 114. ISBN 978-1-000-69147-4.
  11. "Popular Front of India denies role in terror attacks". The Times of India. 28 మార్చి 2015. Archived from the original on 19 సెప్టెంబరు 2019. Retrieved 18 నవంబరు 2019.
  12. "National campaign for Muslim reservation launched in Pune". Newswala. 3 ఫిబ్రవరి 2010. Archived from the original on 18 జనవరి 2016.
  13. "Popular Front of India plans month-long campaign to highlight plight of jailed Muslims". The Times of India. 11 జూలై 2012. Archived from the original on 29 అక్టోబరు 2013.
  14. "Popular Front's campaign starts". The Times of India. 13 అక్టోబరు 2012. Archived from the original on 29 అక్టోబరు 2013.
  15. Sushant Pathak Jamshed Adil Khan Calicut | Manjeri | (2 నవంబరు 2017). "Operation Conversion Mafia: Kerala's conversion factories unmasked". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 4 ఏప్రిల్ 2022. Retrieved 4 ఏప్రిల్ 2022.
  16. * "popular front of india: Latest News, Videos and Photos of popular front of india | Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2 మార్చి 2022. Retrieved 2 మార్చి 2022. Over the past years, Kerala and Karnataka have often witnessed violent clashes between workers of the Popular Front of India and the Sangh Parivar.
  17. Khurshid, Salman; Luthra, Sidharth; Malik, Lokendra; Bedi, Shruti (11 జూన్ 2020). Judicial Review: Process, Powers and Problems: Process, Powers, and Problems (Essays in Honour of Upendra Baxi) (in ఇంగ్లీష్). Cambridge University Press. ISBN 978-1-108-83603-6.
  18. "Cops manhandled women during PFI raids: NWF". The New Indian Express. 16 మే 2012. Archived from the original on 30 జూన్ 2015. Retrieved 20 మే 2015.