పాయల్ కపాడియా
పాయల్ కపాడియా ఒక భారతీయ చిత్రనిర్మాత. ఆమె ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్ చిత్రానికి గాను 2021 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా గోల్డెన్ ఐ అవార్డు (L'Œil d'or)ను గెలుచుకున్నందుకు ఆమె బాగా ప్రసిద్ది చెందింది.[1][2][3][4] 2017లో, ఆమె చిత్రం ఆఫ్టర్‌నూన్ క్లౌడ్స్ 70వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం.[5]
పాయల్ కపాడియా | |
---|---|
జననం | ముంబై, భారతదేశం |
విద్యాసంస్థ | ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా |
వృత్తి | ఫిల్మ్ మేకర్ |
మే 2024లో పాయల్ కపాడియా రూపొందించిన చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పోటీ పడనుంది.[6] అలాగే, బ్రిటిష్-భారతీయ దర్శకురాలు సంధ్య సూరి చిత్రం సంతోష్ కూడా ప్రదర్శించడానికి ఎంపిక చేసారు.[7]
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుముంబైలో జన్మించిన ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని రిషి వ్యాలీ స్కూల్‌లో చదివింది. ఆమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుండి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.[8] ఆమె సోఫియా కాలేజీలో ఒక సంవత్సరం మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ తర్వాత, ఆమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్సుని అభ్యసించింది.[9][10]
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | షార్ట్ ఫిల్మ్ / డాక్యుమెంటరీ | క్రెడిట్ | మూలాలు | ||
---|---|---|---|---|---|
డైరక్టర్ | రైటర్ | ఎడిటర్ | |||
2014 | వాటర్మిలన్, ఫిష్ అండ్ హాఫ్ ఘోస్ట్ | అవును | - | - | [11] |
2015 | ఆఫ్టర్నూన్ క్లౌడ్స్ | అవును | అవును | - | |
2017 | ది లాస్ట్ మ్యాంగో బిఫోర్ ది మాన్సూన్ | అవును | - | అవును | |
2018 | అండ్ వాట్ ఈజ్ ది సమ్మర్ సేయింగ్ | అవును | - | - | |
2021 | ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్ | అవును | అవును | - | |
2024 | ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ | అవును | అవును | - | [12] |
మూలాలు
మార్చు- ↑ "Payal Kapadia wins best documentary award in Cannes". India Today (in ఇంగ్లీష్). 18 July 2021. Retrieved 2021-07-20.
- ↑ "Mumbai-based film-maker Payal Kapadia wins Best Documentary Award at Cannes". The Economic Times. IANS. 19 July 2021. Retrieved 2022-09-13.
- ↑ "Cannes 2021: India's Payal Kapadia wins best documentary award". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-07-18. Retrieved 2021-07-20.
- ↑ Entertainment, Quint (2021-07-18). "Cannes 2021: Payal Kapadia's A Night of Knowing Nothing Wins Best Documentary". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2021-07-20.
- ↑ "Meet FTII student Payal Kapadia, whose film Afternoon Clouds, was selected for Cannes 2017". Firstpost. 2017-06-10. Retrieved 2021-07-20.
- ↑ "30 ఏళ్ల తరవాత... కేన్స్‌లో ఆమె |". web.archive.org. 2024-04-14. Archived from the original on 2024-04-14. Retrieved 2024-04-14.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Cannes Film Festival to screen Indian directors Payal Kapadia and Sandhya Suri at this year's ceremony - The Hindu". web.archive.org. 2024-05-20. Archived from the original on 2024-05-20. Retrieved 2024-05-20.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Dore, Bhavya (7 June 2017). "Payal Kapadia: Over the Clouds". Open: The Magazine.
- ↑ "Who Is Payal Kapadia? The Director Wins Best Documentary Award In Cannes" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-07-20. Retrieved 2021-07-20.
- ↑ Dore, Bhavya (7 June 2017). "Payal Kapadia: Over the Clouds". Open: The Magazine.
- ↑ "Watermelon, Fish and Half Ghost (Student Film) – Urban Lens" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2021-07-20. Retrieved 2021-07-20.
- ↑ Eenadu (21 November 2024). "రానా మాటల్లోనే మా విజయం కనిపించింది". Archived from the original on 21 November 2024. Retrieved 21 November 2024.