కేన్స్ ఫిలిం ఫెస్టివల్

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (ఆంగ్లం: Cannes Film Festival) (ఫ్రెంచ్: Festival de Cannes) ఫ్రాన్స్ లోని కేన్స్ లో ప్రతీ ఏడాది ఈ చలన చిత్రోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ ప్రదర్శితమయ్యే చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఎయిర్‌స్క్రీన్

చరిత్రసవరించు

1946లో స్థాపించబడినది. ప్రతి సంవత్సరం మేలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తారు.[1] ఈ ఉత్సవం 1951లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్స్ (FIAPF)చే అధికారికంగా గుర్తింపు పొందింది.[2] 2003 వరకు దీన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని పిలిచేవారు. ప్రపంచం నలుమూలల నుండి డాక్యుమెంటరీలతో సహా అన్ని రకాల కొత్త చిత్రాలను ఇక్కడ ప్రివ్యూ వేస్తారు.

డైమండ్ వార్షికోత్సవంసవరించు

2022లో మే నెల 17 నుంచి నుంచి 28వ తేదీ వరకు కేన్స్ చలనచిత్రోత్సవం జరగనుంది. ఇది 75 వసంతాల వేడుక. ఇక అలాగే 75 వసంతాల స్వతంత్ర భారతదేశానికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అరుదైన ఘనత దక్కింది. భారత్ కు కేన్స్ చిత్రోత్సవ విపణిలో గౌరవనీయ అధికారిక దేశం హోదా కల్పించారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కాంపిటీషన్ జ్యూరీలో సభ్యురాలిగా బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణే నియమితులవ్వడం మరో విశేషం.[3] అయితే 2003లో జ్యూరీ మెంబర్ గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ నటి ఐశ్వర్య.రాయ్. కాగా పూజా హెగ్డే కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కు భార‌త ప్ర‌తినిధిగా ఈ యేడాది హాజ‌రు కానున్నారు. ఈ వేడుక‌ల‌కు తొలిసారి హాజ‌రవుతున్న స‌మ‌యంలోనే భార‌త దేశ ప్ర‌తినిధిగా ఆమె ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నారు.

ఈసారి కేన్స్ లో సత్యజిత్ రే తెరకెక్కించిన 'ప్రతిధ్వని' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. ఈ చిత్రం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 4కే టెక్నాలజీలో రూపోందించారు. అలాగే హాలీవుడ్ క్లాసిక్ గా పేరుగాంచిన 'సింగిన్ ద రెయిన్', అరవిందన్ గోవిందన్ దర్శకత్వంలో వచ్చిన 'థాంప్' చిత్రాలు కూడా ఇక్కడ ప్రదర్శనకు నోచుకున్నాయి. ఇలా 21 చిత్రాలు పోటీ పడే ప్రతిష్టాత్మక ‘గోల్డెన్‌ పామ్‌’ పురస్కారం ఏ చిత్రానికి వరిస్తుందో వేచిచూడాలి,

మూలాలుసవరించు

  1. "Presentation of the Palais". palaisdesfestivals.com. Retrieved 31 May 2017.
  2. Moeran, Brian; Jesper, Strandgaard Pedersen (2011). Negotiating Values in the Creative Industries: Fairs, Festivals and Competitive Events. Cambridge: Cambridge University Press. p. 173. ISBN 978-1-107-00450-4.
  3. "Cannes Jury: దీపిక కంటే ముందు ఇంకెవరు?". web.archive.org. 2022-05-04. Archived from the original on 2022-05-04. Retrieved 2022-05-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బాహ్య లంకెలుసవరించు