పార
తవ్వడానికి ఉపయోగించే పనిముట్టు
మట్టి త్రవ్వడానికి లేదా లాగడానికి ఉపయోగించే ప్రతి పనిముట్టును మనం పార అనే పదాన్ని ఉపయోగించినప్పటికి ఏ పనికి ఏ పారో కచ్చితంగా చెప్ప వలసినప్పుడు పార అనే పదానికి ముందు మరియొక పదాన్ని చేరుస్తుంటారు.
- గడ్డపార - దీనిని గుంతలు లోతుగా త్రవ్వడానికి ఉపయోగిస్తారు.
- పలుగుపార - దీనిని చిన్న చిన్న గుంతలు త్రవ్వడానికి ఉపయోగిస్తారు.
- చలగపార - వదులుగా ఉన్న మట్టిని తీయడానికి లేదా త్రవ్విన మట్టిని తీయడానికి దీనిని ఉపయోగిస్తారు.
- దోకురుపార - పొలాలలో కలుపు తీయడానికి దీనిని ఉపయోగిస్తారు.
- దంతిపార - వేరుశనగ కాయల వంటి కాయలను, విత్తనాలను ఎండ బెట్టడానికి లేదా ఆరబెట్టడానికి పలుచగా నెరపడానికి దీనిని ఉపయోగిస్తారు.
- తోపుడుపార - ఈ పారను వస్తువుతో నింపడానికి తోస్తారు అందువలన దీనిని తోపుడు పార అంటారు.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుLook up పార in Wiktionary, the free dictionary.