పార్కింగ్
పార్కింగ్ 2023లో తమిళంలో విడుదలైన డ్రామా థ్రిల్లర్ సినిమా.[2] ప్యాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై సుధన్ సుందరం, కెఎస్ సినీష్ నిర్మించిన ఈ సినిమాకు రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించాడు. హరీష్ కళ్యాణ్, ఎంఎస్ భాస్కర్, ఇంధూజ రవిచంద్రన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా 1 డిసెంబర్ 2023న థియేటర్‌లలో విడుదలై[3], డిసెంబర్ 30 నుండి డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, మళయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4][5]
పార్కింగ్ | |
---|---|
దర్శకత్వం | రామ్‌కుమార్ బాలకృష్ణన్ |
రచన | రామ్‌కుమార్ బాలకృష్ణన్ |
కథ | రామ్‌కుమార్ బాలకృష్ణన్ |
నిర్మాత | సుధన్ సుందరం కె. ఎస్. సినీష్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జిజు సన్నీ |
కూర్పు | ఫిలోమిన్ రాజ్ |
సంగీతం | సామ్ సి.ఎస్ |
నిర్మాణ సంస్థలు | ప్యాషన్ స్టూడియోస్ అండ్ సోల్జర్స్ సోల్జర్స్ ఫ్యాక్టరీ |
విడుదల తేదీ | 1 డిసెంబర్ 2023 |
దేశం | భారతదేశం |
భాష | తమిళం |
బాక్సాఫీసు | ₹ 1.92 కోట్లు[1] |
నటీనటులు
మార్చు- హరీష్ కళ్యాణ్ - ఈశ్వర్[6]
- ఎంఎస్ భాస్కర్ - ఎస్ ఇలంపరుతి
- ఇంధూజ - ఆదిక
- రామ రాజేంద్ర - సెల్వి
- ప్రార్థన నాథన్ - అపర్ణ
- ఇళవరసు - హౌస్ ఓనర్
- విజయ్ సత్య - పోలీస్ ఇన్‌స్పెక్టర్
కథ
మార్చుసాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఈశ్వర్ (హరీష్ కళ్యాణ్) ఆతిక (ఇందూజ)ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ ఇంట్లో అద్దెకు దిగుతారు. గర్భవతిగా ఉన్న ఆతికను హాస్పిటల్‌కు రెగ్యులర్ చెకప్‌కు తీసుకువెళ్లే క్రమంలో ఈశ్వర్ ఆటో, క్యాబ్‌లు దొరక్క ఇబ్బంది పడతాడు. ఈ క్రమంలో వ్యక్తిగత పనులతో పాటు ఆఫీస్ అవసరాలకు ఉపయోగపడుతుందని కొత్త కార్ కొంటాడు. కింది వాటాలో నిజాయితీపరుడైన ప్రభుత్వ ఉద్యోగి ఏకరాజ్ (ఎంఎస్‌భాస్కర్) తన భార్య, కూతురు అపర్ణతో (పార్థనా నాథన్) కలిసి పదేళ్లుగా అద్దెకు ఉంటుంటాడు. ఈ క్రమంలో కారు పార్కింగ్ విషయంలో ఈశ్వర్‌కు భాస్కర్‌తో తరుచూ గొడవలు జరుగుతూ ఒకరిని ఒకరు తీవ్రంగా కొట్టుకుని, కేసులు పెట్టుకునే స్థాయికి వెళతారు. కారు పార్కింగ్ స్థలం కారణంగా చెలరేగిన వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[7]
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ప్యాషన్ స్టూడియోస్ అండ్ సోల్జర్స్ ఫ్యాక్టరీ
- నిర్మాత: సుధన్ సుందరం, కెఎస్ సినీష్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌కుమార్ బాలకృష్ణన్
- సంగీతం: సామ్ సి.ఎస్
- సినిమాటోగ్రఫీ: జిజు సన్నీ
- ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
మూలాలు
మార్చు- ↑ "Parking Box Office Collection Day 4 Prediction: Harish Kalyan's Film Set To Maintain Steady Growth". 2023-12-04. Archived from the original on 2023-12-05. Retrieved 2023-12-04.
- ↑ Andhrajyothy (16 November 2023). "అద్దె ఇంటిలో నివసించే వారు.. కారు 'పార్కింగ్' ఎక్కడ చేయాలి?". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
- ↑ Sakshi (16 November 2023). "36 రోజుల్లో పూర్తయిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
- ↑ Andhrajyothy (29 December 2023). "పార్కింగ్ విషయంలో ఇగో ఫైటింగ్.. ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ డ్రామా!". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
- ↑ TV9 Telugu (30 December 2023). "ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సెన్సేషన్ 'పార్కింగ్'.. తెలుగులోనూ చూడొచ్చు." Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (28 November 2023). "విలన్‌గా నటించాలనే కోరిక నెరవేరింది: యంగ్ హీరో". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
- ↑ Eenadu (2 January 2024). "రివ్యూ పార్కింగ్.. తమిళ సూపర్‌హిట్ మూవీ ఎలా ఉంది?". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.