పార్శ్వగూని
పార్శ్వగూని లేదా స్కోలియోసిస్ అంటే ఒక వ్యక్తి వెన్నెముక ఒక పక్కకు వక్రంగా తిరిగి ఉండే ఒక వైద్య పరిస్థితి. ఈ వక్రరేఖ సాధారణంగా "S"- లేదా "C"-ఆకారంలో మూడు కోణాలలో ఉంటుంది. [2] [3] కొంత మందిలో, వక్రరేఖ డిగ్రీ స్థిరంగా ఉంటుంది, మరికొంత మందిలో, వక్రం కాలక్రమేణా పెరుగుతుంది. తేలికపాటిగా ఉన్న పార్శ్వగూని సాధారణంగా సమస్యలను కలిగించదు, కానీ తీవ్రమైన సందర్భాల్లో వ్యక్తి శ్వాస తీసుకోవడంలో సమస్య కలగవచ్చు. [4] [5] సాధారణంగా, ఈ పరిస్థితిలో నొప్పి ఉండదు.[6]
పార్శ్వగూని | |
---|---|
ఇతర పేర్లు | స్కోలియోసిస్ |
పార్శ్వగూని | |
ఉచ్చారణ | |
ప్రత్యేకత | ఆర్థోపెడిక్స్ |
లక్షణాలు | వెన్నెముక ఒక పక్కకు వక్రంగా తిరిగి ఉంటుంది |
సంక్లిష్టతలు | తీవ్రమైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో సమస్య ఉంటుంది |
సాధారణ ప్రారంభం | 10–20 సంవత్సరాలు |
కారణాలు | జన్యుపర్యావరణ కారణాలు కావచ్చు |
రోగనిర్ధారణ పద్ధతి | ఎక్స్-కిరణాలు |
చికిత్స | బ్రేసింగ్, నిర్దిష్ట వ్యాయామాలు శస్త్రచికిత్స |
తరుచుదనము | 3% |
కారణాలు
మార్చుఈ శరీర పరిస్థితికి చాలా సందర్భాలలో కారణం తెలియదు, కానీ ఇది జన్యు పర్యావరణ కారణాలు కలిసి కూడా ఉంటాయని భావిస్తారు.[4] కుటుంబం లో ప్రభావితమైన ఇతరులు కూడా ప్రమాద కారకాలు. కండరాల నొప్పులు, మస్తిష్క పక్షవాతం, మార్ఫాన్ సిండ్రోమ్, న్యూరోఫైబ్రోమాటోసిస్ వంటి కణితులు వంటి పరిస్థితుల కారణంగా కూడా ఇది సంభవించవచ్చు. రోగ నిర్ధారణ ఎక్స్-కిరణాలతో నిర్ధారించబడింది. పార్శ్వగూని సాధారణంగా నిర్మాణాత్మక సమస్య గా పరిగణిస్తారు, దీనిలో వక్రరేఖ స్థిరంగా ఉంటుంది అయితే అంతర్లీన వెన్నెముక సాధారణమైనదిగా ఉంటుంది. [2]
చికిత్స
మార్చుచికిత్స వక్రత డిగ్రీ, స్థానం పై ఆధారపడి ఉంటుంది. చిన్న వక్రతలు క్రమానుగతంగా చూడవచ్చు. చికిత్సలలో బ్రేసింగ్, నిర్దిష్ట వ్యాయామాలు, శస్త్రచికిత్స ఉండవచ్చు. [2] [7] బ్రేస్ ను తప్పనిసరిగా వ్యక్తికి అమర్చాలి. దీనిని పెరుగుదల ఆగిపోయే వరకు ప్రతిరోజూ ఉపయోగించాలి. [2] తీవ్రతరం అయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి నిర్దిష్ట వ్యాయామాలు సిఫారసు చేస్తారు, ఉపయోగిస్తారు . [7] వారు వ్యాయామాలు చేయవచ్చు లేదా బ్రేసింగ్ వంటి ఇతర చికిత్సలతో పాటు చేయవచ్చు. [8] [9] అయితే ఖైరోప్రాక్టిక్ మానిప్యులేషన్, ఆరోగ్యకరమైన ఆహారం లేదా వ్యాయామాలు పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించగలవనే విషయాలకు ఆధారాలు తక్కువ ఉన్నాయి. [2] [10] అయినప్పటికీ, ఇతర ఆరోగ్య ప్రయోజనాల కారణంగా వ్యాయామం ఇప్పటికీ సిఫార్సు చేస్తారు.[2]
పార్శ్వగూని దాదాపు 3% మందిలో సంభవిస్తుంది.[11] ఇది సాధారణంగా 10 నుండి 20 సంవత్సరాల మధ్య సంభవిస్తుంది. మగవారి కంటే ఆడవారు సాధారణంగా ఎక్కువగా ప్రభావితమవుతారు. [2] [4] ఈ పదం ప్రాచీన గ్రీక్ భాష (σκολίωσις) నుండి వచ్చింది. ''skoliosis'' అంటే "వంగడం". [12]
ప్రస్తావనలు
మార్చు- ↑ "scoliosis". Merriam Webster. Archived from the original on 11 August 2016. Retrieved 12 August 2016.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "Questions and Answers about Scoliosis in Children and Adolescents". NIAMS. December 2015. Archived from the original on 25 August 2016. Retrieved 12 August 2016.
- ↑ Illés TS, Lavaste F, Dubousset JF (April 2019). "The third dimension of scoliosis: The forgotten axial plane". Orthopaedics & Traumatology, Surgery & Research. 105 (2): 351–59. doi:10.1016/j.otsr.2018.10.021. PMID 30665877.
- ↑ 4.0 4.1 4.2 "adolescent idiopathic scoliosis". Genetics Home Reference. September 2013. Archived from the original on 16 August 2016. Retrieved 12 August 2016.
- ↑ Yang S, Andras LM, Redding GJ, Skaggs DL (January 2016). "Early-Onset Scoliosis: A Review of History, Current Treatment, and Future Directions". Pediatrics. 137 (1): e20150709. doi:10.1542/peds.2015-0709. PMID 26644484.
- ↑ Agabegi SS, Kazemi N, Sturm PF, Mehlman CT (December 2015). "Natural History of Adolescent Idiopathic Scoliosis in Skeletally Mature Patients: A Critical Review". The Journal of the American Academy of Orthopaedic Surgeons. 23 (12): 714–23. doi:10.5435/jaaos-d-14-00037. PMID 26510624.
- ↑ 7.0 7.1 (2018). "2016 SOSORT guidelines: orthopaedic and rehabilitation treatment of idiopathic scoliosis during growth".
- ↑ (2016). "Physiotherapy scoliosis-specific exercises – a comprehensive review of seven major schools".
- ↑ (June 2018). "Effects of the Schroth exercise on idiopathic scoliosis: a meta-analysis".
- ↑ (27 October 2018). "Effectiveness of scoliosis-specific exercises for adolescent idiopathic scoliosis compared with other non-surgical interventions: a systematic review and meta-analysis.".
- ↑ Shakil H, Iqbal ZA, Al-Ghadir AH (2014). "Scoliosis: review of types of curves, etiological theories and conservative treatment". Journal of Back and Musculoskeletal Rehabilitation. 27 (2): 111–15. doi:10.3233/bmr-130438. PMID 24284269.
- ↑ "scoliosis". Dictionary.com. Archived from the original on 16 August 2016. Retrieved 12 August 2016.