పార్శ్వనాథుడు 24 మంది జైన తీర్థంకరులలో 23వ వాడు. కలికాల కల్పతరు అనే బిరుదు పొందిన ఏకైక తీర్థంకరుడు ఈయన.

పార్శ్వనాథుడు
పద్మాసనంలో కూర్చున్న పార్శ్వనాథుడు
పార్శ్వనాథ తీర్థంకరుడు: గుజరాత్, పటాన్ జిల్లాలోని శంకేశ్వర్ పట్టణంలో శంకేశ్వర్ జైనమందిరం
23వ జైన తీర్థంకరుడు
ఇతర పేర్లుపార్శ్వ, పరస్
గుర్తుపాము[1]
Colorపచ్చరంగు
తండ్రివిశ్వసేన
తల్లివామదేవి
తరువాతి వారుమహావీరుడు
అంతకు ముందు వారునేమినాథుడు

చారిత్రక పురుషుడుగా పేరుగాంచిన తీర్థంకరుల్లో మొట్టమొదటి వాడు ఈయన. లిఖిత చరిత్రలో కర్మ సిద్ధాంతాన్ని గురించి ప్రతిపాదించిన మొదటివాడు. జైన మూలాలు ఈయన సా.శ.పూ 9 నుంచి 8 శతాబ్దాల మధ్యలో జీవించాడు అని సూచిస్తున్నాయి. చరిత్ర కారులు మాత్రం ఈయన సా.శ.పూ 7 లేదా 8 వశతాబ్దంలో జీవించి ఉండవచ్చని భావిస్తున్నారు.[2]

పార్శ్వనాథుడు వర్ధమాన మహావీరుడి కన్నా 273 ఏళ్ళ ముందు వాడు. 22వ తీర్థంకరుడైన నేమినాథుడికి ఈయన ఆధ్యాత్మిక వారసుడు. ఈయన కాశీలో జన్మించాడు. ప్రాపంచిక జీవితాన్ని విడిచి ఒక సన్యాసి సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. జైనమతాన్ని పునరుద్ధరించడంలోను, ప్రచారం చేయడంలోనూ ప్రముఖ పాత్ర పోషించాడు. ఈయన ప్రస్తుతం మధుబన్, జార్ఖండ్ లో ఉన్న సమ్మెద పర్వతం పైన మోక్షం పొందాడు. ఇది పార్శ్వనాథ పర్వతం అనే పేరుతో పిలవబడుతూ జైనులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కొనసాగుతోంది.

జైనమతంలో రెండు ప్రధాన శాఖలైన శ్వేతాంబరులు, దిగంబరుల గ్రంథాల్లో పార్శ్వనాథుడు, మహావీరుడి బోధనల్లో తేడాలు కనిపిస్తాయి. ఈ రెండు శాఖల మధ్య వివాదాలకు ఇదే మూలకారణం. దిగంబరులు పార్శ్వనాథుడు, మహావీరుడి బోధనల సారం అంతా ఒకటే అని భావిస్తారు. శ్వేతాంబరుల ప్రకారం మహావీరుడు పార్శ్వనాథుడు బోధించిన నాలుగు నియమాలకు, అహింస గురించి తనదైన ప్రతిపాదనలతో మెరుగు పరచడమే కాక బ్రహ్మచర్యమనే ఐదో నియమాన్ని కూడా చేర్చాడు.

మూలాలు మార్చు

  1. Tandon 2002, p. 45.
  2. "Rude Travel: Down The Sages Vir Sanghavi". 13 September 2013.