పార్సీ ఫైర్ టెంపుల్ (సికింద్రాబాద్)

తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లోని మహాత్మా గాంధీ రోడ్డులో ఉన్న పార్సీ దేవాలయం.

పార్సీ ఫైర్ టెంపుల్, తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లోని మహాత్మా గాంధీ రోడ్డులో ఉన్న పార్సీ దేవాలయం. 1847, సెప్టెంబరులో ఈ దేవాలయం నిర్మాణం చేయబడిందని భావిస్తున్నారు.[1] సికింద్రాబాద్‌ ప్రాంతంలో వ్యాపారరంగంలో స్థిరపడిన పెస్టోంజి మెహెర్జీ, విక్కాజీ మెహెర్జీ అనే ఇద్దరు సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంగణంలో దేవాలయంతోపాటు నివాస, వాణిజ్య భవనాలు కూడా ఉన్నాయి.[2] భారతదేశంలోని పార్సీ జనాభాలో ముంబై తరువాత స్థానంలో హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలు ఉన్నాయి.[3] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

సికింద్రాబాద్‌లోని పార్సీ ఆలయం

చరిత్ర

మార్చు

దీనిని దార్-ఎ-మిహర్, అతిష్ కదా, ఆగియారి అని పిలిచేవారు. ఈ పదాలకు "ఫైర్ టెంపుల్" అని అర్ధం. నిజాం పాలనలో 1847లో పార్సీ సోదరులైన సేథ్ విక్కాజీ మెహెర్జీ, సేథ్ పెస్టోంజి మెహెర్జీ అనే వ్యక్తులు సికింద్రాబాదులో దేవాలయం నిర్మించారు. దీని ముందుభాగంలో అషో ఫరావహర్ ఫోటో ఉంది.

జషన్, ఇతర ప్రార్థనల కోసం విశాలమైన గదిలోకి ప్రవేశించే ముందు చేతులు, కాళ్ళు, ముఖం కడగడం కోసం ఇతర పార్సీ దేవాలయాలలో ఉన్నట్టే ఈ భవనంలో కూడా వరండా ఉంది. భవనం మధ్యలో రెండు గదులు ఉన్నాయి. ఒకటి మధ్యలో ఉండగా, మరొకటి ఖిబ్లా అని పిలువబడే వాల్ట్ గోపురం కింద ఉంది. పవిత్రమైన అగ్ని ఒక స్టీల్ కంటైనర్ 'అఫర్గాన్' పై వేదికపై అమర్చబడింది. బెరడు లేని ఎండిన కలపతో ఆ అగ్నిని వెలిగిస్తారు.1847లో వెలిగించిన మంటలు ఇప్పటివరకు నిరంతరాయంగా వెలుగుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఖిబ్లా లోపలికి పార్సీ మతాధికారులకు మాత్రమే అనుమతి ఉంటుంది. పార్సీ ఆరాధనను ముస్లింల మాదిరిగానే నమాజ్ అని అంటారు.

సికింద్రాబాద్, హైదరాబాద్‌లోని పార్సీ కమ్యూనిటీకి చెందిన సుమారు 1,000 మంది సభ్యులు (430 కుటుంబాలు) ఇక్కడికి వస్తుంటారు.[4]

ఉత్సవాలు

మార్చు

జొరాస్ట్రియన్ షహెన్‌షై క్యాలెండర్ ప్రకారం జూలై 14న (గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారం సంబంధిత తేదీ ఆగస్టు 8) శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, నిర్వహణ కమిటీలో భాగమైన 15 మంది సభ్యులు మాత్రమే ఈసారి ఉత్సవాలలో పాల్గొన్నారు.[5][6]

మూలాలు

మార్చు
  1. Dharmendra Prasad (1986), Social and Cultural Geography of Hyderabad City: A Historical Perspective, Inter-India Publications, p. 86, ISBN 8121000459
  2. "The oldest fire temple in city". 19 Aug 2013. Retrieved 11 Nov 2014.
  3. "Saal Mubarak". 19 Aug 2008. Retrieved 11 Nov 2014.
  4. "Hyderabad's youngest Parsi fire temple turns 100; community numbers only 1000". The Siasat Daily (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-07-15. Retrieved 2021-08-10.
  5. Venu, T. P. (2020-07-11). "Secunderabad: Sacred fire temple turns 100". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-10.
  6. Jul 13, Sunil Mungara / TNN / Updated:; 2020; Ist, 13:49. "Only Parsi Fire Temple in Telangana gears up for centenary celebrations | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-10. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)