పాలం జిల్లా (జార్ఖండ్)

ఝార్ఖండ్ లోని జిల్లా

జార్ఖండ్ రాష్ట్రం 24 జిల్లాలలో పాలము జిల్లా ఒకటి. ఈ జిల్లా 1928లో రఒందించబడింది.

పాలము జిల్లా
पलामू जिला
జార్ఖండ్ పటంలో పాలము జిల్లా స్థానం
జార్ఖండ్ పటంలో పాలము జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుపాలము
ముఖ్య పట్టణండ్ల్టన్‌గంజ్
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. పాలము 2. ఛత్రా
 • శాసనసభ నియోజకవర్గాలు5
విస్తీర్ణం
 • మొత్తం5,044 కి.మీ2 (1,947 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం19,36,319
 • జనసాంద్రత380/కి.మీ2 (990/చ. మై.)
 • Urban
06.44
జనాభా వివరాలు
 • అక్షరాస్యత65.5 %
 • లింగ నిష్పత్తి929
Websiteఅధికారిక జాలస్థలి
పాలము ఫోర్ట్

భౌగోళికం

మార్చు

పాలము జిల్లా 23°50, 24°8 ఉత్తర అక్షాంశాలు, 83°55, 84°30 తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో రవినది, బీహార్ నది, తూర్పు సరిహద్దులో చత్రా జిల్లా, హజారీబాగ్ జిల్లా, దక్షిణ సరిహద్దులో లతెహర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో గర్వా జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యంజ్ 5043 చ.కి.మీ, జనసంఖ్య 1,533,176 ఉంది. ఉత్తర కోయల్ నదీతీరంలో ఉన్న దల్తాంగంజ్ జిల్లకేంద్రంగా ఉంది.

జాతీయ సంరక్షణాలయం

మార్చు
  • బెట్లా జాతీయ పార్క్.

ఆర్ధికం

మార్చు

2011 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో పాలము జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[1]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,936,319,[2]
ఇది దాదాపు. లెసెతొ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. వెస్ట్ వర్జీనియా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 243వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 381 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 25.94%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 928:1000,[2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 65.5%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు

మార్చు

జిల్లాలో అసురీ (ఆస్ట్రోఆసియాటిక్) దాదాపు 17,000 మంది ప్రజలకు భాషవాడుకలో ఉంది. అధికంగా పాలము జిల్లా దక్షిణ ప్రాంతంలో ఉంది.[5] భోజపురి బీహారి ప్రజలో వాడుకగా ఉంది. ఈ భాషను దేవనాగరి, కైథి లిపిలో వ్రాస్తుంటారు. [6]

వృక్షజాలం , జంతుజాలం

మార్చు

1932లో పాలము ఆరణ్యాలలో పులుల గణాంకాలు నిర్వహించారు. పులుల పాదముద్రల ఆధారంగా ఈ సర్వే నిర్వహించబడింది. చివరి సర్వేలో 44 పులులు ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో చిరుత, చింకారా, కామన్ లంగూర్, ధోలే (అడవి కుక్కలు), ఏనుగులు, గౌర్, హేర్స్, ఇండియన్ పొర్క్యూపైన్, నీల్గాయ్, కోతి, మౌస్ డీర్, పంగొలిన్, పాంథర్, సాంబార్ డీర్, సోల్త్‌బీర్, విల్డ్‌బోర్, తోడేళ్ళు వంటి పలు వన్యమృగాలు ఉన్నాయి. అలాగే పీఫౌల్, రెడ్ జంగిల్‌ఫౌల్, పాట్రిడ్జ్ వంటి పక్షులు కూడా ఉన్నాయి.

  • పర్యాటకులు దట్టమైన సాల వృక్షాలు, వెదురు పొదల మద్య విహరిస్తుంటారు. వనసంరక్షణ శాఖ అద్దెకు కార్లను, డ్రైవర్లను ఏర్పాటు చేస్తారు. పర్యాటకుల రక్షణ దృష్టిలో ఉంచుకుని అక్కడక్కడా వాచ్ టవర్స్ ఏర్పాటు చేయబడ్డాయి. పర్యాటకులు బస చేయడామికి 3 వసతి గృహాలు ఉన్నాయి. అలాగే అవసరమైన వారికి భోజనసదుపాయం చేయబడుతుంది

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Lesotho 1,924,886
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. West Virginia 1,852,994
  5. M. Paul Lewis, ed. (2009). "Asuri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  6. M. Paul Lewis, ed. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.

వెలుపలి లింకులు

మార్చు