పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
జనగాం జిల్లాలోని పాలకుర్తి గ్రామానికి దగ్గరలో ఉన్న కొండ మీద శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రముఖ శైవ క్షేత్రం. శివారాధకులకు,వీరశైవులకు దర్శనీయ క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రాచీన కాలానికి చెందిన సోమేశ్వరాలయం, లక్ష్మీనర్సింహాలయాలు ఉన్నాయి. శివ కేశవులిద్దరూ పక్కపక్కనే ఉన్న రెండు పర్వత గుహల్లో సహజసిద్ధంగా వెలిశారు. ఈ రెండు గుహలను కలుపుతూ ప్రకృతిసిద్ధంగా ఏర్పడ్డ ప్రదక్షిణా మార్గం ఉన్నది. .ప్రతియేటా మహాశివరాత్రి నుండి అయిదు రోజులపాటు ఇక్కడ పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.యాత్రికుల వసతికి గదులు,మంచినీటి సౌకయం ఉన్నది.
పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం | |
---|---|
పేరు | |
ప్రధాన పేరు : | పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | జనగాం |
ప్రదేశం: | పాలకుర్తి మండలంలోని, పాలకుర్తి గ్రామం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | సోమేశ్వరస్వామి, లక్ష్మీనరసింహస్వామి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | కాకతీయ, చాళుక్య; హిందూ |