జనగాం
తెలంగాణ, జనగామ జిల్లా, జనగాం మండలం లోని పట్టణం
?జనగామ తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17°43′N 79°11′E / 17.72°N 79.18°ECoordinates: 17°43′N 79°11′E / 17.72°N 79.18°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 16.04 కి.మీ² (6 చ.మై) |
జిల్లా (లు) | జనగామ జిల్లా |
జనాభా • జనసాంద్రత |
92,394 (2011 నాటికి) • 5,760/కి.మీ² (14,918/చ.మై) |
భాష (లు) | తెలుగు |
జనగాం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, జనగామ మండలానికి చెందిన పట్టణం.[1] ఇది ఇంతకుముందు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వరంగల్ జిల్లాలో ఉండేది. ఇది హైదరాబాదు నుండి వరంగల్ వెళ్ళే 202 జాతీయ రహదారిపై ఉంది. హైదరాబాద్ నుండి జనగామ జిల్లాకు 89 కిలోమీటర్ల దూరం.
రవాణా వ్యవస్థసవరించు
జనగాంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక బస్టాండ్ ఉంది. ఈ బస్టాండ్ నుండి చుట్టుపక్కల గ్రామాలకు, హైదరాబాద్, హన్మకొండ, సిద్ధిపేట, సూర్యాపేట, చుట్టూ పక్కల ఉన్న 13 మండలాలకు బస్ సౌకర్యం ఉంది. జనగామ రైల్వేస్టేషన్ హైదరాబాద్ - కాజీపేట మధ్యలో ఉంది. ఇక్కడి నుండి దేశంలోని ఇతర పట్టణాలకు వెళ్ళే సౌకర్యం ఉంది.
గణాంకాలుసవరించు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 92,446 - పురుషులు 46,807 - స్త్రీలు 45,639
మండలంలోని పట్టణాలుసవరించు
- జనగాం