పాలు నీళ్ళు
పాలు నీళ్ళు 1981 జూన్ 12 న విడుదలైన తెలుగు చిత్రం.దాసరి నారాయణ రావు దర్శకత్వంలో మంచు మోహన్ బాబు, జయప్రద జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం చేళ్ళపిళ్ళ సత్యం సమకూర్చారు.హిందీ గాయని ఆశాబోస్లె ఈ చిత్రంలో ''ఇది మౌనగీతం' అనే పాట చిత్రానికి హైలెట్.
పాలు నీళ్ళు (1981 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
తారాగణం | దాసరి నారాయణరావు , జయప్రద , రాజా |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | చిత్ర ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుమంచు మోహన్ బాబు
జయప్రద
దాసరి నారాయణరావు
రాజా
చలం
రమాప్రభ
నిర్మలమ్మ
సూర్యకాంతం .
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: దాసరి నారాయణరావు
నిర్మాత: రామినేని
నిర్మాణ సంస్థ: తెలుగు చిత్ర ఇంటర్నేషనల్
సంగీతం: చేళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, దాసరి నారాయణరావు
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఆశాబోస్లే
విడుదల:12:06:1981.
పాటల జాబితా
మార్చు1.ఆశా నూరేళ్లు పాశం మున్నాళ్లూ, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పులపాక సుశీల
2.ఇది మౌనగీతం ఒక మూగరాగం పాడింది, రచన: దాసరి నారాయణరావు, గానం.ఆశాబోస్లె
3.తెలుగుదేలయన్న దేశంబు తెలుగు(పద్యం)
4.నాదం వేదం కాలం దైవం మూలాధారం, రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
5.నేనే నేనే నేనే స్త్రీమూర్తినీ భక్తికి ముక్తిని , రచన: వేటూరి, గానం.పి సుశీల
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.