పాలేరు నది, ఖమ్మం జిల్లాలో ప్రవహించే ఒక నది. ఇది కృష్ణానదికి ఉపనది.

పాలేరు జలాశయం

పాలేరు గ్రామంలో పాలేరు నదిపై నిజాం ప్రభుత్వ కాలంలో ఒక చిన్న/మధ్య తరహా ఆనకట్ట నిర్మించి రిజర్వాయరు ఏర్పాటు చేశారు. దీని క్రింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాల గ్రామాల్లో కొన్ని వందల ఎకరాల భూములకు నీటి వసతి కలుగుతుంది. ఇటీవలి కాలంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వను ఈ రిజర్వాయరు గుండా త్రవ్వటంవలన కరవు కాలంలో కూడా నీటికి ఎద్దడి కలగటంలేదు. నాగార్జునసాగరు ఎడమ కాల్వపై ఒక మైక్రో విద్యుత్కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ అది పూర్తిగా విజయవంతం కాలేదు. హైదరాబాదు నుండి భద్రాచలం వెళ్ళేటప్పుడు ఈ రిజర్వాయరు కట్టపై చేసే ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.ఎవరైనా కాసేపు ఆగినట్లయితే నీటి స్కూటర్లు బోట్లు విహరించటానికి దొరుకుతాయి. ప్రభుత్వం పాలేరు గ్రామంలో జవహర్ నవోదయ విద్యాలయం నెలకొల్పింది.

ఇవికూడా చూడండి

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు