పావురానికి పంజరానికి పెళ్లిచేసే పాడు లోకం
పావురానికి పంజరానికి పెళ్లిచేసే పాడు లోకం అనే ఈ పాట 1991లో విడుదలైన చంటి చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రాసినందుకు వేటూరి సుందరరామమూర్తి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానం చేసింది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సంగీతం అందించింది ఇళయరాజా.
పాట నేపథ్యం
మార్చుపాటలోని సాహిత్యం
మార్చుపల్లవి
పావురానికి పంజరానికి పెళ్ళి చేసె పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం
పావురానికి పంజరానికి పెళ్ళి చేసె పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం
ఒడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా ఓ ఓ ఓ ఓ ఓ
పావురానికి పంజరానికి పెళ్ళి చేసె పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం
తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్న తల్లీ
లాలించు పాటలో వీతంత తెలిపి పెంచింది నాలోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు కలనైన అపకారి కాను
చేసిన పాపములా ఇది ఆ విధి శాపములా
మారని జాతకమా ఇది దేవుని శాసనమా ఇది తీరేదే కాదా…
తాళంటె తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు
ఆ తాళి పెళ్ళికే రుజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము
ఏమైన ఏదైన జరిగింది ఘోరం నా మీద నాకేలె కోపం
నా తొలి నేరమున ఇది తీరని వేదననా
నా మది లోపములా ఇవి ఆరని శోకములా ఇక ఈ బాధే పోదా…
పురస్కారాలు
మార్చు- వేటూరి సుందరరామ్మూర్తి - ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం - 1991.