పింకీ కౌశిక్ సింగ్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ మహిళా లాన్‌ బౌల్స్‌ క్రీడాకారిణి. ఆమె 2022లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో లాన్‌బౌల్స్‌లో భారత మహిళల జట్టు తరపున ప్రాతినిధ్యం వహించి, స్వర్ణ పతకం గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది.[2][3]

పింకీ సింగ్
వ్యక్తిగత సమాచారం
జాతీయత భారతీయురాలు
జననం (1980-08-14) 1980 ఆగస్టు 14 (వయసు 44)[1]
ఢిల్లీ, భారతదేశం

క్రీడా జీవితం

మార్చు

పింకీ ఢిల్లీ యూనివర్సిటీ తరఫున క్రికెట్‌ ఆడింది. ఆమె తను పనిచేస్తున్న పాఠశాలలో నేషనల్‌ లాన్‌ బౌల్స్‌కు వేదికైంది. ఆ సమయంలో ఆమె ఆ ఆటను చూసి కొద్ది రోజుల్లోనే దానిని నేర్చుకోవడంతో పాటు జాతీయ శిబిరానికి అర్హత సాధించింది.[4] ఆమె 2007లో మొదటి లాన్ బౌల్స్ నేషనల్స్‌లో పాల్గొంది. పింకీ కామన్వెల్త్ గేమ్స్ లో 2014లో గ్లాస్గో, 2018 గోల్డ్ కోస్ట్, 2022 బర్మింగ్‌హామ్ ట్రిపుల్స్ అండ్ ఫోర్స్ ఈవెంట్‌లలో భారతదేశం తరపున మూడుసార్లు ప్రాతినిధ్యం వహించింది.

మూలాలు

మార్చు
  1. "Athlete profile". Commonwealth Games federation. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 30 May 2021.
  2. Namasthe Telangana (3 August 2022). "బంతులాటలో బంగారం". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  3. Sakshi (3 August 2022). "ఊహించని ఫలితం.. 'ఆనందం నాలుగింతలు'". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  4. "Rolling her arm under". 7 April 2010. Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.