పిఎస్‌ఎల్‌వి-C2 ఉపగ్రహ వాహకనౌక
పిఎస్ఎల్వి-C2 ఉపగ్రహ వాహకనౌక ను భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)నిర్మించి ,ప్రయోగించినది.ఈ వాహకనౌక పిఎస్ఎల్‌వి శ్రేణికి చెందిన రెండవ ఆపరేసనల్ ప్రయోగం.ఈ ఉపగ్రహ వాహకం ద్వారా ఒకేసమయంలో మూడు ఉపగ్రహాలను/అంతరిక్షనౌకలను అంతరిక్షము లో సుర్యానువర్త ధ్రువకక్ష్యలో ప్రవేశపెట్టారు.[1] కక్ష్యలొ ప్రవేశపెట్టిన మూడుఉపగ్రహాలలో భారతదేశానికి చెందిన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఓసెన్‌శాట్ /(IRS-P4)ప్రధాన మొదటి ఉపగ్రహం కాగా,కొరియాకు చెందిన కిట్‌శాట్-3(KITSAT-3), జర్మనీ కి చెందిన DLR-TUBSAT అనునవి మిగిలిన రెండు ఉపగ్రహాలు.[2] [3] ఇందులో ఓసెన్‌శాట్ ఉపగ్రహం బరువు 1050 కిలోలు.కొరియాకు చెందిన కిట్‌శాట్-3(KITSAT-3) బరువు 107 కిలోలు, జర్మనికి చెందిన డిఎల్ఆర్-టుబ్‌శాట్ బరువు 45 కిలోలు.
విధి | Medium lift launch system | ||
---|---|---|---|
తయారీదారు | ఇస్రో | ||
దేశము | ఇండియా | ||
పరిమాణము | |||
ఎత్తు | 44.4 మీటర్లు (146 అ.) | ||
వ్యాసము | 2.8 మీటర్లు (9 అ. 2 అం.) | ||
ద్రవ్యరాశి | PSLV: 295,000 కి.గ్రా. (650,000 పౌ.) PSLV-CA: 230,000 కి.గ్రా. (510,000 పౌ.) PSLV-XL: 320,000 కి.గ్రా. (710,000 పౌ.) | ||
దశలు | 4 | ||
సామర్థ్యము | |||
ప్రయోగ చరిత్ర | |||
స్థితి | Active | ||
ప్రయోగ స్థలాలు | సతిష్ ధావన్ అంతరిక్ష కేంద్రం | బూస్టర్లు (PSLV-G) - S12 | |
బూస్టర్ల సంఖ్య | 6 | ||
ఇంజన్లు | off | ||
థ్రస్టు | 662 కి.N (149,000 lbf) | ||
Specific impulse | 262 s (2.57 km/s) | ||
మండే సమయం | 45 seconds | ||
ఇంధనం | HTPB | ||
First దశ | |||
ఇంజన్లు | S139 | ||
థ్రస్టు | 4,628 కి.N (1,040,000 lbf) | ||
Specific impulse | 237 s (2.32 km/s) (sea level) 269 s (2.64 km/s) (vacuum) | ||
మండే సమయం | 107.4 seconds | ||
ఇంధనం | HTPB | ||
Second దశ | |||
ఇంజన్లు | 1 Vikas | ||
థ్రస్టు | 725 కి.N (163,000 lbf) | ||
Specific impulse | 293 s (2.87 km/s) | ||
మండే సమయం | 163 seconds | ||
ఇంధనం | N2O4/UDMH | ||
Third దశ | |||
ఇంజన్లు | S7 | ||
థ్రస్టు | 340 కి.N (76,000 lbf) | ||
మండే సమయం | 76 seconds | ||
ఇంధనం | solid HTPB | ||
Fourth దశ | |||
ఇంజన్లు | 2 x L-2-5 | ||
థ్రస్టు | [convert: invalid number] | ||
మండే సమయం | 415 seconds | ||
ఇంధనం | MMH/MON |
ఉపగ్రహ వాహకనౌక యొక్క పైభాగాన పరికారాలపెట్టె(equipment bay)పైభాగాన ఓసెన్‌శాట్ ను అమర్చగా, మిగిలిన రెండు ఉపగ్రహాలను పరికారాలపెట్టె(equipment bay) మీద ఒకదానికి ఒకటి వ్యతిరేఖం దిశలో ఎదురుగా గా అమర్చారు.కక్ష్యలొ మొదట ఓసెన్‌శాట్ /(IRS-P4) ఉపగ్రహం ప్రవేశపెట్టబడినది.తరువాత కిట్‌శాట్-3, దాని తరువాత డిఎల్ఆర్-టుబ్‌శాట్ ఉపగ్రహాలు కక్ష్యలొ ప్రవేశించాయి. ఉపగ్రహ వాహకనౌక ,ఉపగ్రహాలను 727 కిలోమీటర్ల ఎత్తులో సుర్యానువర్త ధ్రువకక్ష్యలో ప్రవేశపెట్టినది[2][3].
పిఎస్‌ఎల్‌వి-C2 ఉపగ్రహ వాహకనౌక నిర్మాణవివరాలు
మార్చుఉపగ్రహ వాహకనౌక పొడవు44.4మీటర్లు. ప్రయోగసమయంలో వాహకం యొక్క మొత్తం బరువు 294 టన్నులు.ఉపగ్రహ వాహకం మొత్తం నాలుగు చోదకదశలను కలిగిఉన్నది.మొదటి, మూడవ దశలో ఘనచోదకాన్ని ఉపయోగించగా, రెండవ, నాల్గవ చోదకదశలలో ద్రవచోదక ఇంధనాన్ని ఉపయోగించారు.మొదటి దశచోదక మోటారుకు అదనంగా ఆరుస్ట్రాపాన్ బూస్టరు మోటరులను అమర్చారు. ఈ స్ట్రాపాన్ మోటరులలో కూడా మొదటి చోదకదశలో ఉపయోగించిన ఘనఇంధనాన్నే ఉపయోగించారు[2][3].
మొదటిదశ | స్ట్రాపాన్ | రెండవ దశ | మూడవదశ | నాల్గవదశ | |
పేరు | కోర్PSI | PSOM 6Nos | PS2 | PS3 | PS4 |
చోదకం | ఘనHTPB | ఘనHTPB | ద్రవUDMH+ N2O4 | ఘనHTPB | MMH + N2O4 |
చోదకం బరువు,టన్నులు | 138.0 | 6X9.0 | 40.6 | 7.2 | 2.0 |
దశ/అంచె బరువు,టన్నులు | 229 | 46 | 8.4 | 2.89 | |
త్రోపుడు శక్తి KN | 4628 | 662 x 6 | 725 | 340 | 7.4 x 2 |
దహన సమయం,సెకన్లు | 107.4 | 45 | 163 | 76 | 415 |
దశ వ్యాసం,మీటర్లు | 2.8 | 1.0 | 2.8 | 2.0 | 1.3 |
దశపొడవు,మీటర్లు | 20 | 10 | 12.5 | 3.6 | 2.1 |
ప్రయోగం
మార్చుపిఎస్ఎల్వి –C2 ఉపగ్రహ వాహకనౌకను ఆంధ్రప్రదేశ్రాష్టంలోని నెల్లూరు జిల్లా లోనిశ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్షప్రయోగ వేదికనుండి మే నెల 26 తేది,1999 న ప్రయోగించారు.మొదటి పిఎస్ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌకను సెప్టెంబరు 29,1997 లో ప్రయోగించారు. ఈ ఉపగ్రహ వాహకనౌక ద్వారా IRS-1D ఉపగ్రహాన్ని అంతరిక్షకక్ష్యలో ప్రవేశపెట్టారు.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు/ఆధారాలు
మార్చు- ↑ "PSLV SUCCESSFULLY LAUNCHES THREE SATELLITES". pib.nic.in. Retrieved 2015-10-01.
- ↑ 2.0 2.1 2.2 "PSLV-C2". isro.gov.in. Archived from the original on 2016-04-02. Retrieved 2015-10-01.
- ↑ 3.0 3.1 3.2 "PSLV-C2 MISSION" (PDF). isro.gov.in. Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2015-10-01.