పిట్‌కెయిర్న్ దీవులు (పిట్‌కెర్న్ : Pitkern Ailen), అధికారికముగా పిట్‌కెయిర్న్, హెండర్సన్, డూచీ, మరియు ఓయెనో దీవులుగా నామకరణం చేయబడినది. ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో నాలుగు చిన్నదీవుల సముదాయం. ఈ దీవులు బ్రిటీషు ఓవర్సీస్ టెర్రిటరీకి చెందుతాయి (ఇది పూర్వపు బ్రిటీషు సామ్రాజ్యములో భాగం). ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రములో బ్రిటీషు పాలనలో ఉన్న ఏకైక ప్రాంతం. ఈ సముదాయంలో రెండవ పెద్ద దీవైన పిట్‌కెయిర్న్ దీవిలో మాత్రమే జనవాసం కలదు.