పిఠాపురం సంస్థానం జమీందారుల వంశవృక్షము
ఆంధ్ర సంస్థానాలలో సాహిత్యపోషణలోను, సంగీతనాట్యాది కళాపోషణలోను పిఠాఫురం సంస్థానం పేరెన్నికగన్నది. ప్రాచీన శాసనాల ఆధారంగా ఈ ప్రాంతం సా.శ.1444 వరకు రెడ్డిరాజుల పరిపాలనలోను, తరువాత గజపతుల ఆధీనంలోను, 16వ శతాబ్దంలో గోలకొండ నవాబుల పాలనములోను ఉన్నదని తెలుస్తోంది. రావు వంశస్థులు గోలకొండ నవాబులతో చెలిమి చేసుకుని ఉండుటచే రావు తెనుగురావును పిఠాపురమును రాజధానిగా చేసికొని ఆ ప్రాంతాన్ని పరిపాలించమని నవాబు ఆదేశించాడు. ఈ విధంగా తెనుగురావు కాలంలో పిఠాపురం సంస్థానం ఏర్పడింది.ఈ రావు వంశస్థులు వెలమ కులమువారు. 1948లో ఈ సంస్థానము రద్దు కాబడింది.
పిఠాపురం సంస్థానం జమీందారుల వంశవృక్షం |
---|
అనపోతమనీడు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
మాధవరాయలు | సర్వజ్ఞ సింగమనీడు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||
రంగరాయలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
ధర్మారాయుడు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
లచ్చారావు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
ధర్మారాయలు | మాధవరాయలు | వేమారాయలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||
గుర్వారావు | తెనుగురావు | నరసింహారావు | రంగశాయి | ||||||||||||||||||||||||||||||||||||||||||||
మాధవరావు | చిన్నారావు | జగ్గారావు (1671-75) | రంగశాయిరావు | ||||||||||||||||||||||||||||||||||||||||||||
వెంకటపతిరావు | రామచంద్రరావు (1647-71) తిమ్మాంబ | కృష్ణారావు (1675-79) | పుత్రుడు (పేరు తెలియదు) | ||||||||||||||||||||||||||||||||||||||||||||
రావు జనార్ధనరావు | రావు పెదమాధవరావు (1679-1704) రమణాంబ | రావు నరసింహారావు (1704-21) | పుత్రుడు (పేరు తెలియదు) | రావు నరసారావు | |||||||||||||||||||||||||||||||||||||||||||
రావు వేంకటకృష్ణారావు (1728-59) | రావు వేంకటరావు (1721-28) | రావు చినమాధవరావు (1759-62) | రావు నీలాద్రిరావు (1765-70) జగ్గమాంబ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
రావుపెదమహీపతిరావు (1762-65) | రావు పెదవేంకటరావు (1770-76) వెంగమాంబ | రావు బుచ్చివేంకటరావు (1776-86) | |||||||||||||||||||||||||||||||||||||||||||||
రావు వేంకట కుమారమహీపతిరావు (1786-93) | రావు వేంకటనీలాద్రిరావు (1793-1828) భావయమ్మ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||
రావు వేంకటసూర్యారావు (1844-50) వెంకమాంబ | రావు కుమార మహీపతిరావు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||
రావు వేంకటనీలాద్రిరావు | రావు వేంకట మహీపతి గంగాధర రామారావు (1862-90) మంగయమ్మ | రావు సూర్యనారాయణ ప్రకాశరావు | రావు వేంకటరావు | ||||||||||||||||||||||||||||||||||||||||||||
రావు వేంకట సూర్య మహీపతి రామకృష్ణారావు (దత్తపుత్రుడు) | రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు (1906-48) చిన్నమాంబ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||
రావు వేంకట గంగాధర రామారావు | రావువేంకట గంగాధరరామారావు వేదవతీదేవి | రావు వేంకట సూర్యారావు | |||||||||||||||||||||||||||||||||||||||||||||
రావు వేంకట సూర్యారావు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
గమనిక: సా.శ.1828-సా.శ.1844 మధ్యకాలంతో పాటుగా సా.శ.1850 నుండి సా.శ.1862వరకు, సా.శ.1890 నుండి సా.శ.1906 వరకు పిఠాపురం సంస్థానం Court of Wards ఆధీనంలో ఉంది.
మూలాలు
మార్చు- రావు వంశముక్తావళి
- శ్రీ పీఠికాపుర సంస్థాన చరిత్రము - శ్రీరాం వీరబ్రహ్మకవి
- పిఠాపురం కైఫీయత్తు
- రావు వంశచరిత్ర తిలక
- The History of the family of Honourable Rajah of Pithapuram
- పిఠాపుర సంస్థానము - కవిపండిత పోషణ - సి.కమలా అనార్కలి - 1973
- కథలు గాథలు - చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి