పిన్ వేల్లీ జాతీయ ఉద్యానవనం
పిన్ వేల్లీ జాతీయ ఉద్యానవనం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లహుల్, స్పితి జిల్లాలోని కాజా నగరానికి చేరువలో ఉంది.[1]
పిన్ వేల్లీ జాతీయ ఉద్యానవనం | |
---|---|
Nearest town | కాజా |
Coordinates | 32°00′N 77°53′E / 32.00°N 77.88°E |
Established | 1987 |
చరిత్ర
మార్చుఈ ఉద్యానవనం జనవరి 9, 1987 న స్థాపించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా బుద్దుని సంస్కృతి ఉండేది.
జంతు, వృక్ష సంపద
మార్చుఈ ఉద్యానవనం అధిక ఎత్తు, అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ప్రాంతంలో వృక్షసంపద తక్కువగా ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఆల్పైన్ చెట్లు, హిమాలయ దేవదారు (సెడ్రస్ డియోడారా) తోటలు ఉంటాయి. అవేకాక హిమాలయన్ స్నోకాక్, చుకర్ పార్ట్రిడ్జ్, స్నో పార్ట్రిడ్జ్, స్నోఫిన్చ్ వంటి అరుదైన పక్షులు ఈ ఉద్యానవనంలో ఉంటాయి.[2]
మరిన్ని విశేషాలు
మార్చుటిబెటన్ సరిహద్దు సమీపంలో ధంకర్ గోంపాకు దక్షిణాన విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం హిమాలయ ప్రాంతంలోని కోల్డ్ ఎడారి బయోస్పియర్ రిజర్వ్ లోపల స్పితి లోయ ఎడారి ప్రాంతంలో ఉంది. ఈ ఉద్యానవనంలో మంచుతో నిండిన గోడలు అధికంగా ఉంటాయి. ఇందులో అంతరించిపోతున్న హిమ ప్రదేశంలో నివసించే మంచు చిరుత, సైబీరియన్ ఐబెక్స్ తో అనేక జంతువులకు సహజ నివాసంగా ఈ ప్రాంతం ఉంది.
మూలాలు
మార్చు- ↑ https://hplahaulspiti.nic.in/pin-valley-national-park/
- ↑ Kala, Chandra Prakash 2005; Indigenous uses, population density, and conservation of threatened medicinal plants in protected areas of the India. Conservation Biology, 19 (2): 368-378.