Regular-based right pyramids
చతురస్ర పిరమిడ్
కాన్వే పాలిహెడ్రాన్ సంజ్ఞామానం Yn
ష్లాఫ్లి చిహ్నం ( ) ∨ {n}
తలాలు n-gon]]
అంచులు 2n
శీర్షాలు n + 1
సౌష్టవ వర్గం Cnv, [1, n], (*nn), order 2n
భ్రమణ వర్గం Cn, [1, n]+, (nn), order n
ధర్మములు కుంభాకార

పిరమిడ్ అనేది గణితంలో ఒక ప్రత్యేకమైన ఆకారము. ఈ ఆకారంలోని కట్టడాలను కూడా పిరమిడ్లు అనే పిలుస్తారు. ఉదాహరణ: ఈజిప్టు పిరమిడ్లు.

జ్యామితిలో, పిరమిడ్ అనగా భూమి ఒక బహుభుజిగా కలిగి ఉండి బహుభుజి శీర్షాలను ఒక బిందువుకు అనుసంధానించబడే ఆకారం. దీని ప్రతీ ప్రక్క తలం ఒక త్రిభుజాకారాన్ని ఏర్పరుస్తుంది. n-భుజాలుగా కలిగిన భూమి కలిగిన ఒక పిరమిడ్ లో శీర్షాలు n+1, అంచులు 2n ఉంటాయి.

ఒక సమ పిరమిడ్ శీర్షం దాని భూమి గురుత్వ కేంద్రానికి పైన ఉంటుంది. అసమ పిరమిడ్లను ఆబ్లిక్ పిరమిడ్స్ అంటారు. సమ పిరమిడ్ లో భూమి సమ బహుభుజి ఆకారాన్ని కలిగి ఉంటుంది.[1][2]

సాధారణంగా పిరమిడ్ నిర్మాణాల మాదిరిగా పిరమిడ్ ను చతురస్ర భూమి కల పిరమిడ్ గానే భావిస్తారు. త్రిభుజాకారం ఆధారం గల పిరమిడ్ ను టెట్రాహైద్రన్ అని పిలుస్తారు.

అల్పకోణ, అధిక కోణ త్రిభుజాల మాదిరిగానే పిరమిడ్ లో దాని భూమికి పైన లోపల భాగంలో శీర్షం ఉంటే దానిని 'అక్యూట్" పిరమిడ్ అనీ, పిరమిడ్‌లో దాని భూమిపైన వెలుపల దాని శీర్షం ఉంటే దానిని "అబ్స్‌ట్యూజ్" అని అంటారు.

లంబ కోణ పిరమిడ్ దాని శిఖరం అంచు లేదా భూమి యొక్క శీర్షం పైన ఉంటుంది. టెట్రాహైడ్రన్‌లో ఈ పిరమిడ్లో ఏ ముఖాన్ని బేస్ గా పరిగణిస్తాయో దాని ఆధారంగా మారుతాయి.


మూలాలుసవరించు

  1. William F. Kern, James R Bland,Solid Mensuration with proofs, 1938, p. 46
  2. Civil Engineers' Pocket Book: A Reference-book for Engineers Archived 2018-02-25 at the Wayback Machine


"https://te.wikipedia.org/w/index.php?title=పిరమిడ్&oldid=3048705" నుండి వెలికితీశారు