పిల్ల రాక్షసి
పిల్ల రాక్షసి 2016 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రము.[1]
పిల్ల రాక్షసి | |
---|---|
దర్శకత్వం | మిథున్ మాన్యుల్ థామస్ |
రచన | మిథున్ మాన్యుల్ థామస్ జాన్ మంత్రిచల్ |
స్క్రీన్ ప్లే | మిథున్ మాన్యుల్ థామస్ జాన్ మంత్రిచల్ |
నిర్మాత | శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ |
తారాగణం | సారా అర్జున్ సన్నివాయ్‌నే అజువర్గీస్ |
ఛాయాగ్రహణం | విష్ణుశర్మ |
కూర్పు | లిజో పాల్ |
సంగీతం | పాటలు : షాన్ రహమాన్ నేపథ్య సంగీతం: సూరజ్ ఎస్ కురుప్ |
విడుదల తేదీ | 4 నవంబరు 2016 |
సినిమా నిడివి | 127 నిమిషాలు |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
కథ
మార్చునాలుగో తరగతి చదివే అనన్య(సారా అర్జున్)కు తన తండ్రి అంటే చాలా ఇష్టం. తన తండ్రి చెప్పాడనే కారణంగా లాంగ్ జంప్‌లో గోల్డ్ మెడల్ సాధించాలనుకుంటుంది. అందుకోసం స్కూల్‌లో జరిగే ఇంటర్ స్పోర్ట్స్‌లో పాల్గొనాలనుకుంటుంది. పీటీ మాస్టర్ డేవిడ్(జాన్ కైప్పాల్లి) కావాలనే అనన్యను ఫౌల్ చేసిందని చెప్పేస్తాడు. దాంతో అనన్యకు డేవిడ్ అంటే కోపం వస్తుంది. ఎలాగైనా డేవిడ్‌ను కిరాయి రౌడీలతో కొట్టించాలనుకుని తన స్నేహితుడిని హెల్ప్ అడుగుతుంది. అతని సలహా వల్ల గొంగలిపురుగు గిరీష్(సన్ని వాయ్‌నే), అంబ్రోస్(అజు వర్గీస్)ను కలుస్తుంది. డేవిడ్‌ను కొట్టమని చెప్పి, తన తండ్రి ప్రేమగా ఇచ్చిన ఐఫోన్‌ను ఇచ్చేస్తుంది. అప్పుడేం జరుగుతుంది? డేవిడ్‌ను గిరీష్, అంబ్రోస్‌లు కొట్టారా? అసలు అనన్యకు డేవిడ్ కొట్టేంత అవసరమెమోచ్చింది? అనే విషయాలు మిగిలిన కథలో భాగం.[2][3]
నటవర్గం
మార్చు- బేబి సారా అర్జున్
- దుల్కర్ సల్మాన్(అతిథి పాత్ర)
- సన్నివాయ్‌నే
- లియోనా లిషాయ్
- జాన్ కైప్పాల్లి
- సిద్ధికీ
- అజు వర్గీస్
- శరణ్య శశి
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాణ సంస్థ: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్
- సంగీతం: షాన్ రెహమాన్
- సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ
- ఎడిటింగ్: లిజో పాల్
- మాటలు, పాటలు: భాషాశ్రీ
- నిర్మాత: చదలవాడ పద్మావతి
- దర్శకత్వం: మిథున్ మాన్యుల్ థామస్
మూలాలు
మార్చు- ↑ "పిల్ల రాక్షసి". Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.
- ↑ http://www.123telugu.com/reviews/pilla-rakshasi-telugu-movie-review.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-11-08. Retrieved 2016-11-05.