ప్రధాన మెనూను తెరువు

పి.ఆర్.రాజు ప్రముఖ చిత్రకారుడు.[1] ఈయన జాతీయ పురస్కారాన్నిపొందడంతో పాటు పలు అవార్డులు కూడా పొందారు. ఇరవై సంవత్సరాలు జాతీయ సెంట్రల్ లలిత కళా అకాడమీకి సభ్యుడిగా ఉన్నారు. తెలుగువారు గర్వపడేలా పీఆర్ రాజు చిత్రకళలో అద్భుతంగా రాణిస్తూ పెయింటింగ్‌లో 50 రకాల శైలులను సృష్టించాడు.

పి.ఆర్.రాజు
P.r.raju,artist,andhrapradesh.jpg
పి.ఆర్.రాజు చిత్రం
జననంపి.ఆర్.రాజు
1928
చిత్తూరు జిల్లా
మరణంజనవరి 10 2016
బేగంపేట, హైదరాబాదు
నివాసంహైదరాబాదు
ఇతర పేర్లుపి.ఆర్.రాజు
వృత్తిచిత్రకారుడు
క్రియాశీలక సంవత్సరాలు1956 నుండి
ప్రసిద్ధులుచిత్రకారుడు
మతంహిందూ

జీవిత విశేషాలుసవరించు

ఆయన 1928లో జన్మించారు. వారి స్వగ్రామం ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో నల్లతూరు గ్రామం. ఆయన 1956 మద్రాస్‌లో తన విద్యాభ్యాసం తర్వాత హైదరాబాదు కు వచ్చారు. ఈయన విద్యాభ్యాసం మద్రాస్‌లో జరిగింది. ఆయన సహజత్వంలో ఉండే చిత్రాలు వేయడంలో సిద్ధహస్తుడు. ఆయన దేశవిదేశాలలొ అధ్బుతమైన చిత్ర ప్రదర్శనలిచ్చారు. ఆయన తన యింటినే ఆర్ట్ గ్యాలరీగా మార్చుకున్నారు. ఆయన ఎందరో సుప్రసిద్ధ చిత్రకారులకు గురువు.[2] పీఆర్ రాజు గారికి ప్రఖ్యాత చిత్రకారుడు దేవీప్రసాద్ రాయ్ చౌదరి, అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రి రాజగోపాలాచారి కుమార్తె నామగిరి అమ్మాళ్ సహా విద్యార్థులు. ఆయన 40 సంవత్సరాలుగా ప్రముఖ చిత్రకారునిగా గుర్తింపు పొందారు. ఆయనకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయి. ఆయన 20 సంవత్సరాలుగా జాతీయ లలిత కళా అకాడమి లో సభ్యులుగా ఉన్నారు. ఆయన కుమారుడు నరేంద్రనాథ్ పాలాల కూడా ప్రసిద్ధ చిత్రకారుడు. ఆయన 6 నుండి 16 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలకు తన సంస్థలో వివిధ రకాల చిత్రకళా నైపుణ్యాలను బోధిస్తుంటారు.[3]

పి.ఆర్.రాజు చిత్ర పాఠశాలసవరించు

ఆయన తన చిత్రకళను విద్యార్థులకు అందించాలనే తపనతో ఒక పాఠశాలను స్థాపించారు. ఆయన రేఖలు, వక్రాలతో బోధనలు ప్రారంభించి వాటర్ కలర్స్ వేయుటలో మెళుకువలను తన వృద్ధాప్యంలో కూడా బోధించేవారు. ఆయనకు సహకారాన్ని ఆయన కుమారుడు నరేంద్రనాథ్ పాలాల కూడా అందుస్తుంటారు. ఆయన 50 రకాల చిత్ర నైపుణ్యాలను తెలిసిన ప్రసిద్ధ కళాకారుడు.[4]

మరణంసవరించు

ఆయన జనవరి 10 2016 న బేగంపేటలో తన స్వగృహమందు మరణించారు.

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు