పి.ఎ.సంగ్మా

భారతీయ రాజకీయవేత్త

పి.ఎ.సంగ్మా (1947 సెప్టెంబరు 1 – 2016 మార్చి 4) భారతదేశ లోక్ సభా స్పీకరుగా 1996 నుండి 1998 వరకు పనిచేసారు. ఆయన మేఘాలయ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 1988 నుండి 1990 వరకు పనిచేసారు. 1996 నుంచి 1998 వరకు లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించిన సంగ్మా, ప్రస్తుతం తురా (మేఘాలయ) ఎంపీగానూ కొనసాగుతున్నారు. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ)కి ఆయన అధ్యక్షుడు కూడా. .

పి.ఎ.సంగ్మా
పి.ఎ.సంగ్మా


లోక్‌సభ స్పీకరు
పదవీ కాలం
25 మే 1996 – 23 మార్చి 1998
పదవీ కాలం
6 ఫిబ్రవరి 1988 – 25 మార్చి 1990
ముందు Williamson Sangma
తరువాత Brington Buhai Lyngdoh
పదవీ కాలం
1991 – 20 మార్చి 2008
ముందు సన్ఫోర్డ్ మారక్
పదవీ కాలం
మే 2014 – M

వ్యక్తిగత వివరాలు

జననం 1 సెప్టెంబరు 1947
Chapahathi, Garo Hills District, Assam, India (now in West Garo Hills District, Meghalaya)
మరణం 2016 మార్చి 4(2016-03-04) (వయసు 68)
న్యూఢిల్లీ
ఇతర రాజకీయ పార్టీలు Independent (2012—2013)
Nationalist Congress Party

(1999—2004; 2005—2012)
All India Trinamool Congress (2004—2005)
Indian National Congress (before 1999)

పూర్వ విద్యార్థి National Institute of Technolog Patna
మతం Christianity

జీవిత విశేషాలు

మార్చు

పి.ఎ.సంగ్మా పూర్తిపేరు పూర్ణో అజితోక్ సంగ్మా. ఆయన 1947, సెప్టెంబరు 1న మేఘాలయ పశ్చిమ గారో పర్వత ప్రాంతంలోని ఛాపతి గ్రామంలో మరక్ సంగ్మా, చింగ్మీ సంగ్మా దంపతులకు జన్మించారు. షిల్లాంగ్ లోని ఆంటోనీ కాలేజీలో బీఏ (హానర్స్) పూర్తిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంలో పనిచేశారు. కాలేజీ చదువుల అనంతరం పూర్తికాలం రాజకీయనేతగా కెరీర్ ప్రారంభించిన సంగ్మా. 1973లో మేఘాలయ యూత్ కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షుడయ్యారు. తర్వాతి ఏడాది ఆ విభాగానికి జనరల్ సెక్రటరీ అయ్యారు. 1975-1980 మధ్య కాలంలో మేఘాలయ పీసీసీ సెక్రటరీగా వ్యవహరించారు.

తురా ఎస్టీ నియోజకవర్గం నుంచి 1977లో (6వ లోక్ సభకు) పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సంగ్మా ఇప్పటికీ (14వ లోక్ సభ వరకు) ఎంపీగానే కొనసాగుతుండటం విశేషం. 1996 మే 25 నుంచి 1998 మార్చి 23 వరకు (11వ లోక్ సభకు) లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించారు. కేంద్రమంత్రి వర్గంలోనూ పలు శాఖలు నిర్వహించిన సంగ్మా. 1988 నుంచి 1990 వరకు మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటుపై మళ్లీ కేంద్ర పదవులు చేపట్టారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు

మార్చు

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై 1999లో తిరుగుబావుటా ఎగరేసిన పీఏ సంగ్మా. శరద్ పవార్, తారీఖ్ అన్వర్ లతో కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని ఏర్పాటుచేశారు. అయితే 2011లో రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలవాలనుకున్న ఆయన నిర్ణయాన్ని ఎన్సీపీ సమర్థించకపోవడంతో ఆ పార్టీని వీడి సొంతగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ)ని స్థాపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీపై పోటీచేసి ఓటమిపాలయినప్పటికీ గిరిజన నేతగా ఆయన చేసిన రాజకీయపోరాటం చరిత్రలో నిలుస్తుంది.[1]

వ్యక్తిగత జీవితం

మార్చు

సుదీర్ఘ రాజకీయ జీవితంలో అజాత శత్రువుగా పేరుపొందిన ఆయన గిరిజనుల అభ్యున్నతికోసం కృషిచేశారు. సంగ్మాకు భార్య, కుమార్తె అగాథా, కుమారులు కొన్రాడ్, జేమ్స్ సంగ్మాలు ఉన్నారు. ఆయన ముగ్గురు పిల్లలు కూడా రాజకీయరంగంలో రాణిస్తుండటం గమనార్హం. అగాథా సంగ్మాకు పార్లమెంట్ కు ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా రికార్డుఉంది.

కొద్దికాలంగా గుండెపోటుతో బాధపడుతున్న ఆయన 2016 మార్చి 4 న ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.[2]

మూలాలు

మార్చు
  1. పీఏ సంగ్మా కన్నుమూత
  2. "Former Lok Sabha Speaker PA Sangma Passes Away at 68". The Quint. Archived from the original on 2016-03-05. Retrieved 2016-03-04.

ఇతర లింకులు

మార్చు