పి. చిదంబరం

(పి.చిదంబరం నుండి దారిమార్పు చెందింది)

పి. చిదంబరం తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు.[1]

పి. చిదంబరం
పి. చిదంబరం


రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2016 జులై 5
ముందు విజయ్ జె. దర్దా
నియోజకవర్గం మహారాష్ట్ర

ఆర్ధిక శాఖ మంత్రి
పదవీ కాలం
2012 జులై 31 – 2014 మే 26
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు ప్రణబ్ ముఖర్జీ
తరువాత అరుణ్ జైట్లీ
పదవీ కాలం
2004 మే 22 – 2008 నవంబరు 30
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు జస్వంత్ సింగ్
తరువాత ప్రణబ్ ముఖర్జీ
పదవీ కాలం
1997 మే 1 – 1998 మార్చి 19
ప్రధాన మంత్రి ఐ.కె. గుజ్రాల్
ముందు ఐ.కె. గుజ్రాల్
తరువాత యశ్వంత్ సిన్హా
పదవీ కాలం
1996 జూన్ 1 – 1997 ఏప్రిల్ 21
ప్రధాన మంత్రి హెచ్.డి. దేవే గౌడ
ముందు జస్వంత్ సింగ్
తరువాత ఐ.కె. గుజ్రాల్

కేంద్ర హోం శాఖ మంత్రి
పదవీ కాలం
2008 నవంబరు 29 – 2012 జులై 31
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు శివరాజ్ పాటిల్
తరువాత సుశీల్ కుమార్ షిండే

ప్రజా మనోవేదనలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ‌ల మంత్రి
పదవీ కాలం
2009 నవంబర్ 30 – 2012 జులై 31
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు శివరాజ్ పాటిల్
తరువాత సుశీల్ కుమార్ షిండే
పదవీ కాలం
1985 డిసెంబర్ 26 – 1989 డిసెంబర్ 2
ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ
ముందు కామాఖ్య ప్రసాద్ సింగ్ దేవ్
తరువాత మార్గరెట్ ఆళ్వా

లోక్ సభ సభ్యుడు
పదవీ కాలం
1984 – 1999
ముందు ఆర్. స్వామినాథన్

వ్యక్తిగత వివరాలు

జననం (1945-09-16) 1945 సెప్టెంబరు 16 (వయసు 78)
కందనూర్, మద్రాస్, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (2004–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు తమిళ మానిల కాంగ్రెస్ (1996–2001)
కాంగ్రెస్ జననాయక పేరవై (2001–2004)
జీవిత భాగస్వామి నళిని చిదంబరం
సంతానం కార్తీ చిదంబరం (కొడుకు)
పూర్వ విద్యార్థి మద్రాస్ యూనివర్సిటీ (ఎల్‌ఎల్‌బీ)
హార్వార్డ్ బిజినెస్ స్కూల్‌ -ఏమ్‌బీఏ
లయోలా కాలేజ్‌, చెన్నై - న్యాయశాస్త్రంలో పీజీ
వృత్తి సీనియర్ న్యాయవాది

జననం, విద్యాభాస్యం

మార్చు

చిదంబరం తమిళనాడు రాష్ట్రం, కందనూరులో పళనియప్పన్, లక్ష్మి ఆచి దంపతులకు 1945 సెప్టెంబరు 16న జన్మించాడు. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఏమ్‌బీఏ పూర్తి చేశాడు. మద్రాస్ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ, చెన్నై లయోలా కాలేజ్‌లో న్యాయశాస్త్రంలో పీజీ, చెన్నై ప్రెసిడెన్సీ కళాశాల నుంచి స్టాటిస్టిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

మార్చు

చిదంబరం 1972లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆ తరువాత తమిళనాడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మూడేళ్ల పాటు పని చేశాడు. ఆయన 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో శివగంగై లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికై 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రిగా పని చేశాడు.

తమిళనాడులో అన్నాడీఎంకే, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్‌లోని కొందరు నేతలు తమను అన్నాడీఎంకే నిర్లక్ష్యం చేస్తుందని 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో అన్నాడీఎంకే ఉండరాదని కొందరు తమిళ కాంగ్రెస్ నేతలు వాదించారు. కానీ, పార్టీ అధిష్ఠానం అందుకు అంగీకరించలేదు. అప్పుడు జీకే మూపనార్, చిదంబరం మరికొందరితో కలిసి తమిళ మానిల కాంగ్రెస్ ఏర్పాటు చేసి ఆ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఈ పార్టీలన్నీ కూటమి కట్టి యునైటెడ్ ఫ్రంట్‌గా ఏర్పడి 1996లో దేవెగౌడ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా చిదంబరం ఆర్థిక మంత్రిగా పని చేశాడు.

చిదంబరం అన్నాడీఎంకేతో కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తూ ఏర్పడిన తమిళ మానిల కాంగ్రెస్ మళ్లీ అదే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడంతో బయటకు వచ్చి 'కాంగ్రెస్ జననాయక పెరవాయి' పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ నుండి లోక్‌సభకు ఎన్నికై 2004లో ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. ఆయన 2004లో ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికై కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన యూపీఏ తొలి ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పని చేసి 2009లోనూ యూపీఏ రెండో ప్రభుత్వమే ఏర్పడడంతో ఆయన హోం, ఆర్థిక శాఖలతో పాటు పలు ఇతర శాఖల బాధ్యతలూ నిర్వహించాడు.

ఆయన 2016లో మహారాష్ట్ర తరపున రాజ్యసభకు ఎన్నికయ్యాడు. చిదంబరం మే 2022లో కాంగ్రెస్ పార్టీ తరపున తమిళనాడు నుండి రాజ్యసభ అభ్యర్థిగా ఖరారయ్యాడు.[3][4]

ఐఎన్ఎక్స్ మీడియా కేసు

మార్చు

ఐఎన్ఎక్స్ మీడియాకు అక్రమ మార్గంలో విదేశాలనుంచి భారీగా నిధులు రావడంపై మనీలాండరింగ్ కేసులో చిదంబరాన్ని 2019 అక్టోబరు 21న సీబీఐ అరెస్ట్ చేసింది. [5]అక్టోబరు 21న అరెస్ట్ చేయగా సుమారు 105 రోజుల జైలు జీవితం తర్వాత 2019 డిసెంబరులో విడుదలయ్యాడు.


మూలాలు

మార్చు
  1. Elections in India (9 July 2020). "P Chidambaram Biography - About family, political life, awards won, history". Archived from the original on 1 May 2021. Retrieved 1 May 2021.
  2. Andhrajyothy (1 May 2021). "ఈ పది మంది నేతలు.. దేశ రాజకీయాల్లో వెరీ స్పెషల్.. విద్యార్హతలో టాప్..!". Archived from the original on 1 May 2021. Retrieved 1 May 2021.
  3. V6 Velugu (30 May 2022). "రాజ్యసభకు చిదంబరం.. ఆజాద్‌‌కు నో ఛాన్స్!" (in ఇంగ్లీష్). Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Eenadu (30 May 2022). "కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులుగా చిదంబరం, జైరామ్‌ రమేశ్‌". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  5. TV9 Telugu (22 August 2019). "కాసేపట్లో సీబీఐ కోర్టుకు చిదంబరం.. - P Chidambaram In Court Today.. Kept At CBI Office After Dramatic Arrest". Archived from the original on 1 May 2021. Retrieved 1 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)