పి. వి. ఆర్. కె ప్రసాద్ ఒక మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో అధికారి. ఇతడు ఐ.ఎ.ఎస్. అధికారిగా పలుచోట్ల పనిచేశాడు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశాడు. సాహిత్యాభిమాని. ఆధ్యాత్మిక, ధార్మికవేత్త. సాహితీవేత్తలను, కళాకారులను ఎంతో ప్రోత్సహించాడు. తన ఉద్యోగప్రస్థానంలో సంభవించిన, తారసపడిన అనుభవాలను పుస్తకరూపంలో అందించాడు. తిరుపతి తిరుమల దేవస్థానముల కార్యనిర్వహణాధికారిగా ఇతడు అందించిన సేవలకు రాష్ట్రరత్న, శ్రీ కృష్ణ అనుగ్రహ, రాజర్షి వంటి ఎన్నో పురస్కారాలను అందుకొన్నాడు.

పత్రి వేంకట రామకృష్ణ ప్రసాద్
Pvrk prasad.jpg
జననం(1940-08-22)ఆగస్టు 22, 1940
మరణం2017 [[ఆగస్టు 21]]
హైదరాబాదు
వృత్తిమాజీ ఐ. ఎ. ఎస్ అధికారి
జీవిత భాగస్వాములుగోపిక
పిల్లలుసంజీవ్, మాధవి

పదవులుసవరించు

ఇతడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో వివిధ పదవులు నిర్వహించాడు. ఇతడు నిర్వహించిన కొన్ని పదవులు[1]:

  • ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ : తిరుమల తిరుపతి దేవస్థానములు (1980-1981)
  • కమీషనర్, సాంస్కృతిక శాఖ (1984-1985)
  • కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ (1985)
  • కమీషనర్, ఎక్సైజ్ శాఖ (1986-87)
  • ఛైర్మన్, విశాఖపట్నం పోర్టు ట్రస్టు (1988-1992)
  • ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ (1996)
  • ఛైర్మన్: హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్ (2015-2017)

మరణంసవరించు

ఇతనికి గుండెపోటు రావడంతో హైదరాబాదు బంజారా హిల్స్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2017, ఆగస్టు 21, సోమవారం తెల్లవారు జామున మరణించాడు[2].

రచనలుసవరించు

  1. తిరుమల లీలామృతం
  2. తిరుమల చరితామృతం[3]
  3. సర్వసంభవామ్‌ (నాహం కర్తాః హరిః కర్తాః)
  4. అసలేం జరిగిందంటే...
  5. When I Saw Tirupati Balaji[4]
  6. Wheels Behind The Veil

మూలాలుసవరించు

  1. జి, వల్లీశ్వర్ (22 August 2017). "నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దం". సాక్షి దినపత్రిక. Retrieved 22 August 2017.
  2. రిటైర్డ్ ఐఏఎస్‌ పీవీఆర్‌కే ప్రసాద్‌ ఇకలేరు
  3. పుస్తక సమీక్ష[permanent dead link]
  4. గూగుల్ బుక్స్‌లో When I Saw Tirupati Balaji