ప్రధాన మెనూను తెరువు

ఆకాశవాణి డైరక్టరేట్ జనరల్ కార్యాలయం కొత్త ఢిల్లీలోని పార్లమెంటు వీధిలోని ఆకాశవాణి భవనంలో ఉంది. ఈ కార్యాలయంలో ఎందరో ఆంధ్ర ప్రముఖులు పనిచేశారు. ఆకాశవాణి మాన్యువల్ రూపొందించిన ఘనత ఆంధ్రులకే దక్కింది. అకౌంటెంట్ జనరల్ గా పనిచేసి డెప్యుటేషన్ మీద ఆకాశవాణి డిప్యూటీ డైరక్టర్ జనరల్ (అడ్మినిస్ట్రేషన్) గా పనిచేసిన పి.వి. రాఘవరావు ప్రాతఃస్మరణీయులు. వీరు 1956 లో మనుస్మృతి వంటి మాన్యువల్ తయారుచేశారు. 1989 వరకు దానినే అనుసరించారు. 1989 లో మాన్యువల్ కు కొత్తరూపం యిచ్చారు. రాఘవరావుగారు పదవీ విరమణానంతరం హైదరాబాదులో 1992 లో పరమపదించారు. వీరి కుమారులు రాష్ట్రప్రభుత్వ కార్యదర్శిగా పనిచేస్తున్న పి.వి. రావు.

మూలాలుసవరించు

  • ప్రసార ప్రముఖులు, డా. ఆర్. అనంత పద్మనాభరావు, విజయవాడ, 1996.