పి.శ్రీసుధ
పెరుగు శ్రీసుధ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆమె 2021 అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైంది.[1][2]ఆమె అక్టోబరు 15న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసింది.[3]
పి.శ్రీసుధ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 13 అక్టోబర్ 2021 - ప్రస్తుతం | |||
నియమించిన వారు | రామ్నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నెల్లూరు, నెల్లూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1962 జూన్ 6||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ |
జననం, విద్యాభాస్యం
మార్చుపి.శ్రీసుధ 1962 జూన్ 6లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరులో జన్మించింది. ఆమె 1992లో ఎల్ఎల్బీ పూర్తి చేసింది.[4]
వృత్తి జీవితం
మార్చుపి.శ్రీసుధ ఎల్ఎల్బీ పూర్తి చేసి 1992లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి 2002లో జిల్జా జడ్జిగా ఎంపికై, నిజామాబాద్ అడిషనల్ జిల్లా జడ్జిగా ఆమె మొదటి నియామకం జరిగింది. పి.శ్రీసుధ తరువాత విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, వరంగల్, విజయవాడ, కరీంనగర్, విశాఖపట్నం, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా, నిజామాబాద్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా పనిచేసి, వ్యాట్ అప్పీలెట్ ట్రిబ్యునల్ గా హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2021 సెప్టెంబరు 16న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సభ్యులు ఉదయ్ యూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు వారి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైంది.[5][6]
మూలాలు
మార్చు- ↑ Sakshi (13 October 2021). "తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు". Sakshi. Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ Namasthe Telangana (13 October 2021). "ఏడుగురు కొత్త న్యాయమూర్తులకు రాష్ట్రపతి ఆమోదం". Archived from the original on 14 October 2021. Retrieved 15 October 2021.
- ↑ ETV Bharat News (15 October 2021). "హైకోర్టు నూతన న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
- ↑ Eenadu (14 October 2021). "తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకం". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ V6 Velugu (13 October 2021). "తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andrajyothy (19 August 2021). "సైన్యంలో..న్యాయంలో మహిళలకు జస్టిస్". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.