పి. రవీంద్రనాథ్ రెడ్డి

పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 , 2019లో కమలాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

పి. రవీంద్రనాథ్ రెడ్డి
ఎమ్మెల్యే
Assumed office
2014 - ప్రస్తుతం
నియోజకవర్గంకమలాపురం నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం
పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి

20 ఆగష్టు 1958
పోచిమరెడ్డిపల్లె , వీరపునాయునిపల్లె మండలం , వైఎస్‌ఆర్ జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామిఅరుణమ్మ
సంతానంరమ్యతారెడ్డి( కుమార్తె), నరేన్‌రెడ్డి (కుమారుడు)
తల్లిదండ్రులుపి.రామాంజులరెడ్డి, తులసమ్మ
బంధువులువై.యస్. రాజశేఖరరెడ్డి (బావ) , వై. ఎస్. విజయమ్మ (అక్క) వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (మేనల్లుడు)
నివాసంకమలాపురం

జననం, విద్యాభాస్యం మార్చు

పి. రవీంద్రనాథ్ రెడ్డి 20 ఆగష్టు 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్‌ఆర్ జిల్లా , వీరపునాయునిపల్లె మండలం , పోచిమరెడ్డిపల్లె గ్రామంలో పి.రామాంజులరెడ్డి, తులసమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన బి.కాం వరకు చదివాడు.[1]

రాజకీయ జీవితం మార్చు

పి. రవీంద్రనాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో చింతకొమ్మదిన్నె జెడ్పీటీసీగా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో జరిగిన కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచి కడప తొలి మేయర్‌గా పని చేశాడు. పి. రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాంతరం ఆయన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుండి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పుట్ట నరసింహారెడ్డి పై 5345 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్ట నరసింహారెడ్డి పై 27,333 ఓట్ల మెజారిటీతో రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2]

మూలాలు మార్చు

  1. Sakshi (18 March 2019). "కడప బరిలో..వైఎస్సార్‌ సీపీ దళం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  2. Sakshi (2019). "Kamalapuram Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.