వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (జగన్) వ్యాపారవేత్త, రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్(నవ్యాంధ్ర) రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. 2009 మే నెలలో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. తన తండ్రియైన వై.ఎస్.రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత, భారత జాతీయ కాంగ్రెసుతో విభేదాల కారణంగా పార్టీ కి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. 2014 ఎన్నికలలో పార్టీ ఓటమి పాలైనా, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు. భారతీ సిమెంట్స్, సాక్షి ప్రసార మాధ్యమం, సండూరు జలవిద్యుత్ కేంద్రము వ్యవస్థాపకుడు.

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి .

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 మే 30

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 మే 30
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్
ముందు చంద్రబాబు నాయుడు
నియోజకవర్గం పులివెందుల

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనాయకుడు
పదవీ కాలం
26 మే 2014 – 2019 మే 29
ముందు చంద్రబాబు నాయుడు
తరువాత చంద్రబాబు నాయుడు

శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 మే 2014
ముందు వై. ఎస్. విజయమ్మ
నియోజకవర్గం పులివెందుల

లోకసభ సభ్యుడు
పదవీ కాలం
26 మే 2009 – 26 మే 2014
ముందు వై.ఎస్.వివేకానందరెడ్డి
తరువాత వై ఎస్ అవినాష్ రెడ్డి
నియోజకవర్గం కడప లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1972-12-21) 1972 డిసెంబరు 21 (వయసు 50)
జమ్మలమడుగు గ్రామం, వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ YSR కాంగ్రెస్
జీవిత భాగస్వామి భారతీ రెడ్డి
సంతానం ఇద్దరు కుమార్తెలు (హర్ష, వర్ష)
నివాసం విశాఖపట్నం, హైదరాబాదు, బెంగలూరు,

వ్యాపార జీవితం

సాక్షి ప్రసార మాధ్యమం, భారతీ సిమెంట్స్,[ఆధారం చూపాలి] సండూరు జలవిద్యుత్ కేంద్రము[ఆధారం చూపాలి] స్థాపించాడు.

రాజకీయ జీవితం

విద్యుత్ ప్రాజెక్టులు, వ్యాపారాలు నిర్వహిస్తున్న వై.యస్. జగన్ 2009 మేలో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు.[1] తన తండ్రి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 9 న ఆకస్మిక మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను కలుసుకోవడానికి తలపెట్టిన ఓదార్పుయాత్రకు అనుమతి ఇవ్వని కారణంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, పార్టీని వీడాడు. 2011 మార్చి 11 న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఈ పార్టీకి ఆయన తల్లి, వై.యస్.విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు.

రాజీనామా ఫలితంగా 2011 మేలో జరిగిన ఉపఎన్నికలలో మరల కడప లోకసభ సభ్యునిగా 5.45 లక్షల ఆధిక్యతతో గెలుపొందాడు.

2011 లో యువజన శ్రామిక రైతు (వై.యస్.ఆర్) కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేయాలని నిర్ణయించినపుడు దాని వలన ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోతుందని తీవ్రంగా విభేదించి దీక్షలు చేశాడు. 2014 సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ చేతిలో అతిస్వల్ప ఓట్ల శాతం (1.25) తో పరాజయం పొంది ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు.

రాష్ట్ర విభజనకు సంబంధించిన విభజన హామీలను నెరవేర్చకపోవడం, ప్రత్యేకహోదాను ఇవ్వకపోవడం వంటి విషయాలలో తీవ్రంగా విభేదించి, 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడి, ప్రజలలో ప్రత్యేకహోదాపై అవగాహన కల్పించాడు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఇడుపులపాయలో 2017 నవంబరు 16 న ప్రారంభించి 2019 జనవరి 19న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగించాడు. 14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు దగ్గర అయ్యాడు.

ప్రత్యేకహోదా సాధించాలనే తపనతో, ప్రత్యేకహోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 18వ తారీఖున పార్లమెంటులో తన ఎంపీలతో ఎన్డీయే ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడమే కాకుండా, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో తన ఎంపీల చేత ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేయించి వారిచేత ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నిరాహార దీక్షను చేపట్టించి ప్రజల మనోగతం ప్రపంచానికి తెలిసేలా చేశాడు. తాను చేసే ప్రత్యేకహోదా పోరాటాన్ని మెచ్చి రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు, ప్రత్యేకహోదా సాధన సమితి లాంటి అనేక ప్రజా సంఘాలు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాయి.

2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 శాసన సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.[2]2019 సాధారణ ఎన్నికల్లో ఆయనే ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మెజారిటీ (90000) సాధించిన శాసన సభ్యుడు.

2022 జులైలో 8, 9 తేదీల్లో గుంటూరులో జరిగిన వైఎస్‌ఆర్‌సిపి ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించారు.[3]

అభియోగాలు

2012 మే 25న అక్రమాస్తుల అభియోగంపై సిబిఐ చేత అరెస్ట్ చేయబడ్డారు.[4] 16 నెలల పాటు జగన్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబరు 23 న నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఇవికూడా చూడండి

మూలాలు

  1. "తండ్రిని మించిన విజేతగా." ఈనాడు. 2019-06-24. Archived from the original on 2019-05-24. Retrieved 13 June 2019.
  2. "ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. మోదీ, రాహుల్ గాంధీ శుభాకాంక్షలు". 2019-05-30. Archived from the original on 2019-06-09.
  3. "Cm Jagan: వైకాపా జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ ఎన్నిక". web.archive.org. 2022-07-09. Archived from the original on 2022-07-09. Retrieved 2022-07-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Jagan Mohan Reddy arrested by CBI after three days of questioning in assets case". NDTV. 2012-05-27. Retrieved 2019-07-31.

బయటి లింకులు

అంతకు ముందువారు
నారా చంద్రబాబునాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
2019 మే 30 నుండి
Incumbent