పి. రామచంద్రారెడ్డి

పి. రామచంద్రా రెడ్డి తొమ్మిదవ శాసనసభ (1989-1994) స్పీకరుగా 1990వ సంవత్సరం జనవరి 4వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1990వ సంవత్సరం డిసెంబరు 22వ తేదీ వరకు ఆ పదవిని నిర్వహించాడు. ఈయన స్పీకరుగా ఉన్నపుడే లైబ్రరీ కమిటీకి కొంతకాలం ఛైర్మన్ గా పనిచేసాడు.[2][3][4]

పి. రామచంద్రారెడ్డి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి
పదవీ కాలం
4 January 1990 – 22 December 1990
ముందు జి. నారాయణరావు
తరువాత డి.శ్రీపాదరావు

వ్యక్తిగత వివరాలు

జననం 3 December 1929
మారేపల్లి గ్రామం, కొండాపూర్‌ మండలం , సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం 30 ఏప్రిల్ 2018 [1]
ఎస్‌ఆర్ నగర్‌, హైదరాబాద్
జాతీయత భారత దేశం
సంతానం పి. నిరూప్‌ రెడ్డి

జననం, విద్య మార్చు

ఈయన 1929వ సంవత్సరము డిసెంబరు 3వ తేదీన మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో జన్మించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో బి.ఎ., ఎల్.ఎల్.బి., వరకు విద్యాభ్యాసం చేసాడు. ఈయన కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీసు చేసాడు.

రాజకీయ జీవితం మార్చు

ఇతను పటాన్ చెరు పంచాయతీ సమితి అధ్యక్షునిగా, ఎ.పి. ఇండస్ట్రీస్ డెవలపమెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా, ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. పాలకవర్గ సభ్యులుగా పనిచేశాడు. 1962వ సంవత్సరములో మూడవ శాసనసభకు, 1972వ సంవత్సరములో ఐదవ శాసనసభకు, 1983వ సంవత్సరములో ఏడవ శాసనసభకు, 1985వ సంవత్సరములో ఎనిమిదవ శాసనసభకు, 1989వ సంవత్సరములో తొమ్మిదవ శాసనసభకు మెదక్ జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. ఈయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రి వర్గంలో 22.12.1990 నుండి 08.10.1992 వరకు భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేసి చక్కని పాలనాదక్షుడుగా పేరు పొందాడు. [5]

సభాపతిగా మార్చు

ఇతను స్పీకరుగా శాసనసభ కార్యకలాపాలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించాడు. శాసనసభ స్వయం ప్రతిపత్తి, సభ్యుల విశేషాధికారాల గురించి విశేషంగా కృషి చేశాడు. ఈ విషయంలో ఇతను అత్యంత కీలకమైన రూలింగులను ఇచ్చాడు.

మూలాలు మార్చు

  1. Andhrabhoomi (30 April 2018). "రామచంద్రారెడ్డి కన్నుమూత". Archived from the original on 1 May 2018. Retrieved 11 November 2021.
  2. ఆంధ్రప్రదేశ్ పూర్వ శాసనసభాపతుల జాబితా
  3. ఆంధ్రప్రదేశ్ శాసనసభ జాలస్థలంలో రామచంద్రారెడ్డి పరిచయం
  4. Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  5. Sakshi (18 November 2018). "కాంగ్రెస్‌ కంచుకోట సంగారెడ్డి". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.