జి. నారాయణరావు

జి. నారాయణరావు, ఎనిమిదవ శాసనసభ (1985-1989) స్పీకరుగా 1985వ సంవత్సరం మార్చి 12వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1989వ సంవత్సరం సెప్టెంబరు 26వ వరకు ఆ పదవిని నిర్వహించాడు.[1][2]

జి. నారాయణరావు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి
In office
అంతకు ముందు వారునిశ్శంకరరావు వెంకటరత్నం
తరువాత వారుపి. రామచంద్రారెడ్డి
వ్యక్తిగత వివరాలు
జననం
తిమ్మాపూర్, జగిత్యాల మండలం
జాతీయతభారత దేశం

జననం, విద్యసవరించు

ఇతను 1931వ సంవత్సరం జూన్ 24వ తేదీన కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా, తిమ్మాపూర్ గ్రామంలో జన్మించాడు.1959లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తరువాత. ఉస్మానియా యూనివర్సిటీ నుండి లా డిగ్రీ పూర్తి చేశాడు.

వృత్తిసవరించు

నారాయణరావు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కు మూడుసార్లు వైస్ ఛైర్మన్ గా, సిటీ సివిల్ కోర్ట్ ల బార్ అసోసియేషన్ ఛైర్మన్గా పనిచేశాడు.

రాజకీయ జీవితంసవరించు

1985వ సంవత్సరం ఎనిమిదవ శాసనసభకు రాజధానిలోని మహరాజ్ గంజ్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. 1985వ సంవత్సరంలో కెనడాలో జరిగిన కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో పాల్గొన్నాడు.

శాసనసభాపతిగాసవరించు

శాసనసభ హక్కుల విషయంలో నారాయణరావు నిక్కచ్చిగా వ్యవహరించే వాడు. సభామర్యాద ఉల్లంఘన విషయంలో రాజీపడేవాడు కాదు. భారత రాజ్యాంగం శాసనసభకు, న్యాయవ్యవస్థకు సంబంధించి స్పష్టమైన అధికార విభజన చేసిందని, ఒకరి అధికార పరిధిలోనికి ఇంకొకరు ప్రవేశించడం ఇరువురికి మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బ తీసుకోవడమే అవుతుందని, చట్టసభల గౌరవ ప్రతిష్ఠలకు భంగం వాటిల్లినప్పుడు వాటిని ఏ విధంగా పరిరక్షించుకోవాలనేది చట్టసభల పరిధిలోని అంశం అని, ఈ విషయంలో ఏ న్యాయస్థానం జోక్యం చేసుకునే వీలు లేదని స్పష్టం చేస్తూ 1989 వ సంవత్సరం సెప్టెంబరు 14వ తేదీన రూలింగు ఇచ్చి శాసనసభ గౌరవ ప్రతిష్ఠలను ఇనుమడింప జేశాడు.

మూలాలుసవరించు