పి. వాసు అని పిలవబడే వాసుదేవన్ పీతాంబరన్ ఒక సినీ దర్శకుడు, రచయిత. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాలు రూపొందించాడు. సినీ పరిశ్రమలో 30 ఏళ్ళకుపైగా అనుభవం కలిగిన ఈయన సుమారు 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించాడు.[2]

పి. వాసు
P.Vasu at Aayirathil Oruvan (1965) Audio Launch.jpg
2014 లో వాసు
జననం
వాసుదేవన్ పీతాంబరన్

(1955-09-15) 1955 సెప్టెంబరు 15 (వయస్సు 66)[1]
వృత్తిదర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు
క్రియాశీల సంవత్సరాలు1981 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిశాంతి
పిల్లలుశక్తి వాసుదేవన్
తల్లిదండ్రులు
  • పీతాంబరన్ (తండ్రి)
  • కమల (తల్లి)

వ్యక్తిగత జీవితంసవరించు

వాసు తండ్రి పీతాంబరన్ నాయర్ ఎం. జి. ఆర్. ఎన్. టి. ఆర్ లాంటి ప్రముఖ నటులకు మేకప్ మాన్ గా పనిచేసేవాడు.[3] తల్లి కమల. తండ్రి 30 ఏళ్ళపాటు తమిళనాడు మేకప్ కళాకారుల సంఘానికి అధ్యక్షుడుగా పనిచేశాడు. తర్వాత నిర్మాతగా మారాడు. తమిళ, తెలుగు భాషల్లో సుమారు 25 కి చిత్రాలకి పైగా నిర్మించి అప్పట్లో దక్షిణాదిలో అత్యధిక చిత్రాలు నిర్మించిన వారిలో ఒకడిగా నిలిచాడు. తన సోదరుడు సినిమాటోగ్రాఫర్ అయిన ఎం. సి. శేఖర్ తో కలిసి సినిమాలు నిర్మించేవాడు. ఎం. సి శేఖర్ సుమారు 150 చిత్రాలకు పైగా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించాడు. తండ్రి పీతాంబరన్ 2011, ఫిబ్రవరి 21 న మరణించాడు.[4]

వాసు చెన్నైలో వెస్లీ స్కూల్ లో చదువుకున్నాడు. వాసు భార్య పేరు శాంతి. వీరికి శక్తి అనే కుమారుడు, అభిరామి అనే కుమార్తె ఉన్నారు. శక్తి నటుడు. ఈయనకు విద్యాసాగర్, విమల్ అనే సోదరులు, విజయలక్ష్మి, వసంత, వనజ అనే సోదరీమణులున్నారు.[5]


మూలాలుసవరించు

  1. P Vasu – Man with a Midas touch. IndiaGlitz (2006-09-16). Retrieved on 2012-04-20.
  2. Half-century not out . IndiaGlitz (2005-04-13). Retrieved on 2012-04-20.
  3. "In the right direction". The Hindu. Chennai, India. 9 September 2006. Archived from the original on 28 డిసెంబర్ 2013. Retrieved 22 డిసెంబర్ 2017. Check date values in: |access-date= and |archive-date= (help)
  4. P. Vasu's Father Peethambaram Passes Away. Behindwoods.com (2011-02-21). Retrieved on 2012-04-20.
  5. P Vasu's father Peethambaram passes away Entertainment.oneindia.in (2011-02-22). Retrieved on 2012-04-20.

బాహ్య లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పి._వాసు&oldid=3319923" నుండి వెలికితీశారు