పీచుమిఠాయి అనేది చక్కరతో చేసే దూది లాంటి తీపి పదార్థం. దీనికి పాపిడీ (సోన్ పాపిడీలో ఉన్నది ఇదే) అన్న పేరు కూడా ఉంది.[1] దీనిలో ఆహార రంగులు వేయడం వల్ల ఆ ప్రత్యేకమైన రంగు వస్తుంది. తఱుచుగా లేత గులాబీ రంగులో లేదా తెలుపులో దొరికే ఈ మిఠాయి నోటిలో పెట్టుకోగానే కరిగిపోతుంది. సన్నగా దూదిలా ఉండే పీచు మిఠాయిని మెలమెల్లగా చప్పరించడం ఓ సరదా అందరికీ! పుల్లకు చుట్టుకుని, ఎర్రగా… నిగనిగ లాడుతూ, లావున కనిపిస్తుంది. గట్టిగా అదిమితే గాలి పోయిన బెలూన్‌లాగా తుస్సుమని ముడుచుకుపోతుంది. దీంట్లో చాలా శాతం వరకు గాలి ఉండడం వల్ల దూదిలా ఉబ్బినందుకు అలా కనిపిస్తుంది.

Spinning cotton candy at a funfair.
పత్తి మిఠాయి యంత్రం

దీనిని పంచదారతో తయారు చేస్తారు. ఒక పుల్లకు దీనిని చుట్టి అందిస్తారు. కొన్ని సార్లు పాలిథీన్ సంచులలో పెట్టి అమ్ముతారు. తాజాగా చేసినవే పిల్లలు ఇష్టపడడం వలన అమ్మేవారు వీధుల్లో గంట కొట్టుకుంటూ తిరుగుతూ పిల్లల ఇంటిముందే తయారుచేసి ఇస్తారు. అయితే వీటి అమ్మకాలు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లోనే దొరుకుతుంది. అంటే... ఎగ్జిబిషన్లు, తీర్థాలు, పార్కులు, థియేటర్లు, సర్కస్, జాతర వంటిచోట మాత్రమే లభిస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, కొద్ది పెద్దవాళ్ల వరకూ అందరూ తింటారు దీన్ని.[2]

కరిగించిన చక్కరని చిన్న బొక్కల నుండి బయటకు దారపు పోగుల్లా వస్తూ ఆపై దూదితెరల్లా పీచుమిఠాయి పైకి లేస్తుంది. దాన్ని పుల్లకు చుట్టడం గుండా ఇది ఓ దూది బంతిలా వస్తుంది. ఈ తయారు చేయుటకు ఒక చిన్న గుండ్రటి యంత్రమును వాడుతుంటారు. వీటికి స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ , నిమ్మకాయ, ద్రాక్ష, నారింజ, పుచ్చకాయ, అనాస, మామిడి లాంటి అనేక రుచులు ఉంటాయి.

చరిత్రసవరించు

 
Maple-flavored candy floss at the cabane à sucre (sugar shack), Pakenham, Canada

యంత్రాల ద్వారా పీచు మిఠాయిని తయారుచేయడాన్ని 1897 సంవత్సరంలో అమెరికాలోని నాష్విల్ నగరంలో డెంటిస్ట్ విలియమ్ మోరిసన్ (William Morrison), జాన్ సి. వార్టన్ (John C. Wharton) మొదటిసారిగా కనిపెట్టి 1904 ప్రపంచ సంత (World's Fair) లో "Fairy Floss" పేరుతో ప్రవేశపెట్టారు.[3] మిఠాయిని చిన్న చిన్న చెక్క పెట్టెల్లో ప్యాక్ చేసి ప్రపంచానికి పరిచయం చేశారు. ఆనాళ్ళే అది 68,655 పెట్టెలు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఆ కాలంలోనే ఒక్కొక్కటి 25¢ చొప్పున అత్యధిక రేటు పలికింది. కానీ అప్పటికి ఈ మిఠాయికి కాటన్క్యాండీ అని పేరు పెట్టలేదు. ఈ పీచు మిఠాయి యంత్రంలో 1921లో జోసెఫ్ లాక్సోక్స్ అనే ఓ డెంటిస్ట్ మరికొన్ని మార్పులు చేశాడు. Fairy floss పేరు 1920 ప్రాంతంలో "cotton candy"గా మార్చబడింది. అప్పటి నుంచి ‘కాటన్ క్యాండీ ‘ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.[4]

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జాతీయ పీచు మిఠాయి దినోత్సవం (National Cotton Candy Day) డిసెంబరు 7 తేదీన జరుపుకుంటారు.[4]

రకాలుసవరించు

వీటిలో మూడు రకాలు. మొదటిది అందరికీ తెలిసిన నిగనిగలాడుతున్న గులాబీ రంగులో ఉండే మిఠాయి. ఇది సున్నితంగా, సుతిమెత్తగా ఉంటుంది. దీనిని కర్రల మీద వేసుకొని అమ్ముతుంటారు. రెండోది వెంట్రుకలను పోలి కొద్దిగా గరుకుగా ఉంటుంది. దీనినే ఉభయ గోదారి జిల్లాల్లో పాపిడీ అంటారు. మృదువుగా, వెన్నలాగా, పొరలు కనిపిస్తూ, ఏలకుల పలుకులతో మీగడ రంగులో దీన్ని గాజు మూత ఉన్న పెట్టలల్లో అమ్ముతుంటారు. మూడవ రకం చాలా గట్టి రకమైన పీచుమిఠాయి. దీని చివరన ఎప్పుడు ఇసక ఇసకగా ఉంటుంది. ఎందుకంటే దీనిని చక్కర లేదా బెల్లంలా మిగిలిన చెత్తతో వీటిని తయారు చేస్తారు గనుక.[5]

వేరే భాషల్లో పేర్ల అర్థాలుసవరించు

ప్రపంచవ్యాప్తంగా దీని తయారీ, అమ్మకం జరుగుతుంది .దీనిని అమెరికా ఆంగ్లంలో కాటన్ క్యాండీ, బ్రిటన్ ఆంగ్లం క్యాండీ ఫ్లాస్, ఆస్ట్రేలియా ఆంగ్లంలో ఫెయిరీ ఫ్లాస్, ఫిన్నిష్లో చిన్న మబ్బుగా, డచ్ భాషలో చక్కెర బూజుగా, జర్మనలో చక్కర ఉన్నిగా, ఫ్రెంచిలో నాన్న గడ్డం అని, ఇటాలియన్లో చుట్టిన చక్కెర అని, టునిసియన్లో తాత గడ్డంగా, జార్జియన్లో పత్తి ఐస్క్రీమ్గా, స్లోవేనియన్ లో చక్కర నురుగుగా ఆఫ్రికాన్స్ లో భూతం శ్వాసగా, అరబ్బు దేశాలలలో అమ్మాయి జుట్టుగా, హిందీ ఇంకా గ్రీక్లో ముసలమ్మ జుట్టుగా, బెంగాలీలో గాలి లాంటి తీపికం అని, తమిళ, మలయాళం, కన్నడం ఇంకా కొన్ని తెలుగు ప్రాంతాలలో బొంబాయ్ మిఠాయిగా, ఇంకొన్ని తమిళ, మలయాళ ప్రాంతాలలో పత్తి మిఠాయిగా

తయారీ విధానంసవరించు

పీచు మిఠాయి తయారీ చూసేందుకు తమాషాగా కనిపిస్తుంది. పొరలు పొరలుగా దాదాపు సాలీడు గూడులానే సన్నని దారాలతో ఉంటుంది. గుండ్రటి వెడల్పు ఇత్తడి పాత్రలో కొద్దిగా పంచదార, మిఠాయి రంగు వేస్తారు. అంచుల వైపు ఉండే హీటర్, పాత్ర కిందటి స్టౌ వలన చక్కెర కరిగి, అది తిరుగుతున్నప్పుడు సన్నని రంధ్రాల గుండా బూజు బూజులా బయటికి వస్తుంది. వాతావరణంలోని గాలిలో అది ఒక సాలె గూడులాగా డ్రమ్ గోడల చుట్టూ తయారౌతుంది. వేడి మీద పుల్లతో లేదా పొడవాటి కాడతో దానినుండి కావలసినంత పరిమాణంలో చేతిని గుండ్రంగా తిప్పుతూ ఒక బంతి లాగా తయారుచేస్తారు. ఒకసారి చక్కెర కొన్ని సార్లు సరిపోతుంది. పరిమాణాన్ని బట్టి అయిపోయాక మరికొంత చక్కెర వేస్తాడు.

 
పీచుమిఠాయి తయారీ యంత్రము

పోషక విలవలుసవరించు

చాలా ఆహార పదార్థాలకన్నా రంగు లేని పీచు మిఠాయే ఆరోగ్యకరమైనది. ఎందుకంటే కేవలం చక్కెర, గాలి సాయంతోనే ఈ మిఠాయి తయారవుతుంది మరి. చక్కరతో మాత్రమే చేసినందుకు ఆరోగ్యానికి పీచు మిఠాయి బొత్తిగా మంచిది కాదని అనిపియొచ్చు కానీ సాధారణ కొలమానంతటి పీచు మిఠాయిలో కేవలం 30 గ్రాముల చక్కరనే ఉంటుంది. పైగా పీచు మిఠాయిలలో కొవ్వు గానీ, ప్రిజర్వేటివులు గానీ, సోడియం లేదా పొటాషియం గానీ ఉండవు. పైగా ఒకసారికి కేవలం 115 క్యాలరీలే ఇస్తాయి. మంచి చిరుతిండి కాకపోయినా వీటి కంటే కూడా చెడు చిరుతిండ్లు చాలానే ఉన్నాయి.[6]

ఆరోగ్య సమస్యలుసవరించు

దీని తయారీలో రంగులు వాడనవసరం లేదు. అప్పుడు తెల్లగా ఉంటాయి ఈ మిఠాయలు. కనుక, ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఈ నడుమ కృత్రిమ రంగులను వాడుతున్నారు తయారీదారలు. కానీ ఇది ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఈ రంగుల్లో కర్క రోగం(క్యాన్సర్) తెప్పియ గలిగే రోడో మిన్‌-బి రంగు వాడుతారు.

అందుకుగాను కేరళలో రంగుగల పీచు మిఠాయి (కాటన్ మిఠాయి) అమ్మకాలను ఆహార భద్రతా కమిషనర్ నిషేధించారు. తిరువనంతపురంలోని శంఖుమ్ముగం వద్ద చేపట్టిన తనిఖీల్లో పీచుమిఠాయిలలో హానికరమైన రోడో మిన్‌-బి కలర్‌ కలిపినట్లు గుర్తించారు.

డాక్యుమెంటరీ ఫొటోస్

మరింత అవగాహన రావాల్సిన ఈ వాస్తవికతకు ఇంకాస్త ఆందోళన కలిగించే అంశాన్ని తీసుకురావడానికి, లండన్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ జోన్ ఎనోచ్ ముంబైలోని పీచు మిఠాయి అమ్మకదారుల ఫోటోలు కలిగి ఉన్న ఒక సిరీస్‌ను రూపొందించారు.

"ది కాండీ మెన్" అనే పేరుగల ఈ విడ్డూరమైన పోర్ట్రెయిట్‌ల కలిమి, అమ్మకదారులు ఏయే వింత తీరులలో తమ వస్తువులపై దృష్టి తీసుకెళ్తారో, ప్రదర్శించుతారో అనే దాని గురించి. కళ్లను కట్టే, మెరుస్తున్న గులాబీ రంగుగల పీచు మిఠాయిని సృష్టించాలనే కోరిక వల్ల హానికరమైన రంగులను కలపడం నేటి కాలపు రుగ్మతలకు సరైన రూపకం అని అతను భావించాడు.[7]

గ్యాలరీసవరించు

మూలాలుసవరించు

  1. "తృష్ణ..." trishnaventa.blogspot.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-01.
  2. "Bitter reality hits cotton candy vendors". The Hindu (in Indian English). 2014-11-18. ISSN 0971-751X. Retrieved 2022-10-01.
  3. "Cotton Candy". The Straight Dope. 2000-02-07. Archived from the original on 2013-08-23. Retrieved 2011-11-30.
  4. 4.0 4.1 "Cotton Candy Fun Facts". Archived from the original on 2011-07-08. Retrieved 2010-10-24.
  5. "COTTON CANDY (BUDDDHI - KA-BAAL / AJJAN GADDA) AND PANJU MTTAI / BOMBAY MUTTAI". Kolar Gold Fields - NOSTALGIA. Retrieved 2022-10-04.
  6. Today, Telangana (2020-10-23). "Is cotton candy unhealthy?". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-10-01.
  7. Asto, Joy Celine (2022-07-26). "Candy Men of Mumbai: Peddling pink yet perilous treats". Photofocus (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-10-01.

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.