సాలెపురుగు

ఒక కీటకం
(సాలీడు నుండి దారిమార్పు చెందింది)

మాంసభక్షణ అనివార్యమైన జంతువులలో సాలెపురుగు (ఆంగ్లం Spider) ఒకటి. చిన్నచిన్నపురుగులు కీటకాలు దీనికి ఆహారం. ఆహారం కోసం ఇది చక్కగా వల అల్లి దీనిలో చిక్కిన పురుగులను తిని జీవిస్తుంది. దీని శరీరం రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. తలభాగం ఛాతీ భాగంతో కలసి ఉంటుంది. సాలెపురుగుకు ఎనిమిది (8) కాళ్ళు ఉంటాయి. శరీరపు వెనక భాగం కింది వైపు పట్టుదారం తయారు చేసే గ్రంధులు ఉంటాయి. గ్రంథుల నుండి స్రవించే చిక్కటి ద్రవపదార్ధం గాలికి చల్లబడి దారంగా మారుతుంది. ఈ పద్ధతిలో మనం సోన్ పాపిడి తయారు చేస్తాము. సాలెపురుగు కాటులో స్వల్పమైన విషం ఉంటుంది. కానీ దాని గాఢత తక్కువ కనుక చాలా హానికరం కాదు. విషం ఆహారపు కీటకాన్ని నిర్వీర్యం చేయడానికి పనికి వస్తుంది. సాలెపురుగు ఆహారాన్ని నిర్వీర్యంచేసి నిదానంగా తింటుంది. సాలెపురుగుకి నమిలే అవయవాలు ఉండవు. నోటిలో స్రవించే విషం ఆహారన్ని జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పాములుకు కూడా విషం ఈ విధంగా ఉపయోగపడుతుంది.

సాలెపురుగు
Crab spider Xysticus sp.
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Araneae

Clerck, 1757
Suborders

Mesothelae
Mygalomorphae
Araneomorphae
 See table of families

Diversity
111 families, 40,000 species

హిందూ పురాణాలు

మార్చు
 
సాలెపురుగు, అన్ని ఇళ్ళలో ఉండేది
 
ఆకుపచ్చ సాలెపురుగు
(Peucetia viridans) Green lynx spider
విశాఖపట్నంలో తీసిన చిత్రం

సువర్ణముఖీ నదీ తీరమున ప్రసిద్ధిచెందిన శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ' అని అంటారు.

ఇక్కడి శివున్ని శ్రీకాళహస్తీశ్వరుడిగా కొలుస్తారు. అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.

హాలీవుడ్ సినిమాలు

మార్చు
ఫిల్మీ డోమ్ స్పైడర్ సంభోగం ప్రవర్తన

ఒకే పేరు గల పాత్రతో ఊహాజనితమైన కామిక్స్ ఆధారంగా నిర్మించిన సూపర్ హీరో చిత్రాలే స్పైడర్ మాన్ సినిమాలుగా తీయబడ్డాయి. ఈ చలన చిత్రాన్ని నిర్మించే హక్కులు మొదట 1985 లో కొనుగోలు చేయబడి, అనేక నిర్మాణ సంస్థలు, స్టూడియోల చుట్టూ తిరిగి చివరికి సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ వాటిని స్వాధీనం చేసుకునే ముందు ఒకసారి జేమ్స్ కామెరాన్ చే దర్శకత్వం కూడా వహించబడింది.

హాస్య పుస్తకాల అభిమాని అయిన సాంరైమిను మొదటి మూడు సినిమాలకు దర్శకత్వం వహించేందుకు సోనీ నియమించుకుంది. ఈ సినిమాల ద్వారా పీటర్ పార్కర్ టోబే మాగుఇర్ తాను ఉన్నత పాఠశాలలో అభిమానించిన మేరీ జాన్ వాట్సన్ కిర్స్టన్ దాంట్ తో సంబంధాలను పెంచుకున్నారు.

మొదటి మూడు సినిమాలు మొత్తం 597 మిలియన్ అమెరికన్ డాలర్ల ఖర్చుతో నిర్మించబడి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2.5 బిలియన్ డాలర్లను వసూలు చేయడం జరిగింది. ప్రతి సినిమా ఎన్నో బాక్స్ ఆఫీసు రికార్డు లను కొల్లగొట్టటమే కాక ఈ మూడు సినిమాలు కూడా దేశీయ సినిమాలలో అత్యధిక వసూళ్ళు సాధించిన 20 సినిమాలలోను, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు సాధించిన 25 సినిమాల జాబితాలోనూ చోటు సంపాదించాయి.

ఇవి కూడా చూడండి

మార్చు
  • డొలొమెడెస్‌ బ్రియాన్‌ గ్రీనె - ఒకరకమైన సాలె పురుగు. ఆస్టేలియా దేశంలో కనుగొనబడినది. అరచేయంత పరిమాణంలో ఉండే ఈ సాలెపురుగు నీటి ఉపరితలంపై, అలలపై స్వారీ చేస్తుంటుంది. తన మధ్య కాళ్ల జతతో ఈదుతూ పరుగులు తీస్తుంది. ఇలా చేస్తూ చేపల్ని, కప్పల్ని, కీటకాల్ని పట్టుకొని ఆహారంగా తీసుకుంటుంది.

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు