పునర్జన్మ (ఆంగ్లం : rebirth లేదా reincarnation) అంటే మనిషి తనువు చాలించిన తరువాత, తిరిగి భూమిపై మనిషిగా (శిశువుగా) జన్మించి, తిరిగి ఇంకో జీవితం గడపడం.[1][2] ఇది విశ్వాసం కోవలోకి వస్తుంది. పునర్జన్మ అనే పదం వినగానే, మనిషికి తన ప్రస్తుత జీవితం మొదటిది అనే భావన స్ఫురిస్తుంది, ఈ జీవనం చాలించిన తరువాత రాబోయే కాలంలోనో, లేక యుగంలోనో మరో జన్మ వుండడం తథ్యం అనే విశ్వాసమే, ఈ పునర్జన్మ అనే భావనకు మూలం. అలాగే జీవితంలో అనేక మలుపులు మార్పులు రావడాన్నికూడా మరోజన్మతో పోలుస్తారు. ఉదాహరణకు ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై, తిరిగి కోలుకోవడం లేదా చావునుండి బయటపడటం.

పునర్జన్మ కళారూపంలో

హిందూ విశ్వాసాల్లో పునర్జన్మ మార్చు

మనిషి పాతచొక్కా విడిచి కొత్త చొక్కా వేసుకున్నట్లు ఆత్మ శరీరము నాశనమైన తరువాత కూడా మరొక పుట్టుకతో మరొక శరీరముతో పునర్జన్మ పొందుతుందని హిందువులు నమ్ముతారు. జన్మ జన్మకూ నశించని ఈ ఆత్మ, శరీరమనే పనిముట్టుతో ప్రతి జన్మలో మంచిపనులు చేస్తూ చివరకు భగవంతుని చేరాలని (మోక్షం పొందాలని) అనుకుంటారు. పునర్జన్మ కలుగకుండా మంచి పనులు చేయడమే కాక తపస్సు చేయడం, తీర్థయాత్రలు చేయడం (ముఖ్యంగా కాశీ యాత్ర) చేస్తారు. కాశీకి వెళ్ళి అక్కడే మరణించినా పునర్జన్మ ఉండదని నమ్ముతారు. ద్విజుడు అంటే రెండు జన్మలెత్తిన వాడు. యజ్ఞోపవీతం ధరించడం (ఉపనయనము జరగడం) రెండో జన్మతో సమానమని కొందరి అభిప్రాయం. అలాగే ప్రసవించడం స్త్రీకి పునర్జన్మ వంటిదని నమ్ముతారు.

క్రైస్తవ విశ్వాసాలలో పునర్జన్మ మార్చు

క్రైస్తవులు పశ్చాత్తాపపడినప్పుడు మారిన మనస్సుతో తిరిగి జన్మించినట్లయ్యి కొత్తజన్మ కలుగుతుందంటారు. అలా తిరిగి జన్మించిన శిశువులా ఐనవారే దేవునిరాజ్యంలో ప్రవేశిస్తారు అని ఏసుక్రీస్తు బోధన. అర్థం ఈ జీవితంలోనే పశ్చాత్తాప్పడి, తిరిగి స్వచ్ఛమైన వారు. ఈ ప్రకారం, క్రైస్తవంలో 'ఈ జీవితంలో తనువు చాలించిన తరువాత ఇంకో జన్మ లేదు'.

ఇస్లాం విశ్వాసాలలో పునర్జన్మ మార్చు

ఇస్లాం పునర్జన్మను తిరస్కరిస్తుంది. యౌమల్ ఖియామ (ప్రళయ దినం) న మానవులందరికీ తిరిగి జీవితం ఒసంగబడుతుంది. ఆ తరువాత అంతంలేని జీవితం ప్రసాదింపబడుతుంది. ఈ విషయాన్ని పునర్జన్మగా భావింపరాదనే విశ్వాసం ఇస్లాం బోధిస్తుంది.

ముస్లిముల్లో కూడా తనాసికియా అనే తెగ వాళ్ళు ఆత్మ పునర్జన్మ ఎత్తుతుంది అని నమ్ముతారు.

మూలాలు మార్చు

ఆధార గ్రంథాలు మార్చు