పునుగు పిల్లి
పునుగు పిల్లి (ఆంగ్లం Civet) ( (Paradoxurus hermaphroditus) ) ఒక రకమైన జంతువు. Viverridae కుటుంబానికి చెందిన దీన్ని ఆంగ్లంలో Civet Cat అని, Toddy Cat అని అంటారు. పునుగు పిల్లులలో 38 జాతులు ఉన్నాయి. అయితే ఆసియా రకానికి విశిష్టత ఉంది. దీని గ్రంథుల నుండి జవాది లేదా పునుగు అనే సుగంధ ద్రవ్యము లభిస్తుంది.
పునుగు పిల్లి | |
---|---|
African Civet, Civettictis civetta | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | in part
|
ప్రజాతులు | |
పునుగు పిల్లి భారత్, శ్రీలంక, మియాన్మార్, భూటాన్, థాయ్ లాండ్, సింగపూర్, కంబోడియా, మలేషియా, జపాన్ వగైరా దేశాల్లో కనిపిస్తుంది.
పునుగు పిల్లుల పెంపకానికి అనుమతి
మార్చుఆంధ్ర ప్రదేశ్లోని తిరుపతి వెంకన్నకు ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత కాస్తంత పునుగు తైలాన్ని విగ్రహానికి పులుముతారు.1972లో కేంద్ర ప్రభుత్వం వన్య ప్రాణ సంరక్షణా చట్టం తెచ్చింది. టీటీడీ అధికారులు గోశాలలో పిల్లులను పెంచుకుంటూ వాటి నుంచి తైలాన్ని సేకరించేవారు. వన్య ప్రాణి అయిన పునుగు పిల్లిని పెంచుకోవడం చట్ట ప్రకారం తప్పు అంటూ జీవకారుణ్య పర్యావరణ సంరక్షణా సంఘాలు గోశాలలో పునుగు పిల్లుల పెంపకంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. దైవ కార్యక్రమాలకు వన్య ప్రాణుల సేవలను వినియోగించుకోవచ్చుననే క్లాజును ఆసరాగా చేసుకుని పునుగుపిల్లుల పెంపకానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి కేంద్ర జూ అధారిటీ అనుమతి ఇచ్చింది.
పునుగు తైలం
మార్చుపునుగు తైలం తీసే విధానంలో ప్రత్యేకత ఉంది. ఇనుప జల్లెడలోని గదిలో పిల్లిని ఉంచుతారు. ఇనుప జల్లెడ గది పైభాగంలో రంధ్రం ఏర్పాటు చేస్తారు. రంధ్రం ద్వారా చందనపు కర్రను గదిలోకి నిలబెడతారు. రెండు సంవత్సరాల వయస్సు అనంతరం ప్రతి పది రోజులకు ఒకసారి హావభావాలను ప్రదర్శిస్తూ చందనపు కర్రకు చర్మాన్ని పిల్లి రుద్దుతుంది. ఆ సమయంలో చర్మంద్వారా వెలువడే పదార్థమే పునుగుతైలం.
- పునుగు పిల్లి ఎర్రచందనం, గంధపు చెక్కలకు తన నుండి వచ్చే ద్రవ్యాన్ని అంటిస్తుంది. ఈ తైలం ఒళ్ళు నొప్పులను తగ్గించడంలో ఎంతో ఉపకరిస్తుంది. అయితే అంతర్జాలంలో ఈ తైలం చాలా ఖరీదు పలుకుచున్నది.
- పునుగు పిల్లి కాఫీ కాయలను తిని గింజలను విసర్జిస్తుంది. ఈ గింజలతో తయారు చేసిన కాఫీ (Civet Coffee / Kopi Luwak) కి చాలా డిమాండ్ ఉంది. ఒక కప్పు కాఫీ సుమారు 5000 రూపాయల ధర పలుకుచున్నది [1][2]
క్షీణ దశ
మార్చుపునుగు పిల్లిని కొన్ని అటవీ తెగలవారు వేటాడి చంపి తింటున్నారు. ఈ కారణంగా భారత దేశంలో పునుగు పిల్లి అంతరించిపోయే దశలో ఉంది. అందువల్ల పునుగు పిల్లిని కలిగియుండటం చట్టరిత్యా నేరమని ప్రభుత్వ జి.వొ జారీ అయ్యింది. దేశంలో పునుగు పిల్లుల సంఖ్య పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
(వ్యాసము విస్తరణలో ఉన్నది)