పున్నమినాగు (1980 సినిమా)
పున్నమినాగు ఎం. రాజశేఖర్ దర్శకత్వంలో 1980లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, నరసింహ రాజు, రతి అగ్నిహోత్రి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎం. కుమరన్, ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియం కలిసి ఎవియం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
పున్నమినాగు | |
---|---|
దర్శకత్వం | యమ్.రాజశేఖర్ |
తారాగణం | చిరంజీవి, నరసింహ రాజు, రతి అగ్నిహోత్రి మేనక |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జూన్ 13, 1980 |
భాష | తెలుగు |
కథ
మార్చునాగులు ఒక పాములు ఆడించుకునే వ్యక్తి. పూర్ణిమ అనే యువతిని ప్రేమిస్తాడు. మేనక పెంపుడు అన్న రాజు నాగులు చెల్లెలు వరసైన లక్ష్మిని ప్రేమిస్తుంటాడు. నాగులు తండ్రి చిన్నప్పటి నుంచి అతనికి కొంచెం కొంచెం పాము విషం అతని తినే తిండిలో కలిపి ఇస్తుంటాడు. దీనివల్ల అతనికి పాము కరిచినా ఏమీ కాకుండా ఉంటుంది. ప్రతి పౌర్ణమికీ అతను ఒక కన్యను వెతుక్కుంటూ వెళుతూ ఉంటాడు. అతనికి కలిసిన అమ్మాయిలందరూ అతనిలో ఉన్న విషానికి బలవుతూ ఉంటారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఒక సారి పూర్ణిమ కూడా అలాగే మరణిస్తుంది. చనిపోయిన పూర్ణిమ ఒంటి మీద ఎక్కడా పాము కాటు గుర్తులు లేకపోవడంతో రాజుకు నాగులు మీద అనుమానం మొదలవుతుంది. ఒక యువతి ఆ ఊరికి టీచర్ గా వచ్చి నాగులు చేతిలో మరణిస్తుంది. రాజు ఆమె చేతిలో ఉన్న కెమెరాను చూసి నాగులు పాములా మారిపోయినట్లు గమనిస్తాడు. నాగులు తండ్రి చనిపోబోయే ముందు ఆ రహస్యాన్ని నాగులుకి వెల్లడిస్తాడు. నాగులు దానికి విరుగుడు కోసం ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే బాగా ఆలస్యం అయిపోయి ఉంటుంది. అతని చర్మం పాము కుబుసం లాగా కొంచెం కొంచెం ఊడిపోతూ ఉంటుంది. ఊరి వాళ్ళు రాకముందే అక్కడి నుంచి పారిపొమ్మని అతనికి రాజు సలహా ఇస్తాడు. కానీ నాగులు తనకు పాములాగా బతకడం కన్నా మరణమే శరణ్యమని కొండమీద నుంచి దూకి మరణిస్తాడు.
తారాగణం
మార్చు- నాగులుగా చిరంజీవి
- రాజుగా నరసింహ రాజు
- లక్ష్మిగా రతి అగ్నిహోత్రి
- పూర్ణిమగా మేనక
- ధూళిపాళ
- జయమాలిని
- పద్మనాభం
- మిక్కిలినేని
- బాలకృష్ణ
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: ఎం.రాజశేఖర్
సంగీతం:చక్రవర్తి
నిర్మాణ సంస్థ: ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ , పి సుశీల.
పాటలు
మార్చు- అద్దిరబన్నా ముద్దుల గుమ్మా ముద్దుగా ఉన్నాది (ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల) రచన వేటూరి :సుందరరామమూర్తి
- గడుసు సిన్నది గంగానమ్మ గుడిసె సిన్నది అనుకోకమ్మా (ఎస్.పి.శైలజ), రచన: వేటూరి
- జలకాలు ఆడేటి జాబిల్లి మొలక నీ సోకే కోకంటే నేకెందుకు (ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల), రచన:వేటూరి
- నీదేం పోయే నీ అమ్మ కొడుకా పొతే పోయే మాయెంట పడక (పి.సుశీల బృందం) రచన:వేటూరి
- పున్నమి రాత్రి పువ్వుల రాత్రి వెల్లువ (ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం కోరస్) రచన:వేటూరి