ఏకాదశరుద్రులు:- అజైకపాదు, హిర్భుధున్యుడు, విరూపాక్షుడు, రైవతుడు, హరుడు, బహుర్ధురూపుడు, త్రయంబకుడు, సురేశ్వరుడు, సావిత్రుడు(వైవసత్వుడు), జయంతుడు, పినాల, అపరాజితుడు. వీరిని గణేశ్వరులు అని కూడా అంటారు. త్రిశూలధరులు బ్రహ్మమానస పుత్రులు అయిన వీరికి ఎనుబది నాలుగు కుమారులు కలిగి సర్వదిశలలో వ్యాపించి జగద్రక్షణ చేస్తున్నరు. వీరి పుత్ర పౌత్రులు సురభినందు జన్మించారు.
దితి కుమారులు :- దితి కశ్యప పుత్రులు దైత్యులు (హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు). కృశాశ్వా ఋషికుమారులు, దేవప్రహర్షణులు. ఈ దేవగణాలు ప్రతి మన్వంతరము ప్రతి యుగములోను జన్మిస్తుంటారు.
బలికుమారులు :- వీరిలో ప్రధముడు బాణుడు. ఇతడు శ్రీకృష్ణుడి మనుమడైన అనిరుద్ధుని భార్య అయిన ఉషా తండ్రి. మిగిలిన వారు ధృతరాష్ట్రాదులు.
బాణుడు :- సహస్రభుజములు కలిగిన బాణుడు శివుని ప్రార్ధించి మకాలుడు అయ్యాడు. అతడి తపసుకు మెచ్చి శివుడు అతడు నివసిస్తున్న పురాన్ని త్రిశూలపాణియై రక్షించాడు.
హిరణ్యాక్ష కుమారులు :- కంధకుడు, భూతసంతాపనుడు, మహానాగుడు. ఇతడి మనుమలు, ముని మనుమలు డెబ్బది ఏడు కోట్లమంది. వీరు మహాకాయులు, తేజసంపన్నులు, వివిధరూపులు.
దనువు కుమారులు :- దనువు కశ్యపుల నూరుగురు పుత్రులలో ప్రధానుడు విప్రచిత్తి. పదహారు తలలు కలిగి శంఖము వంటి మెడ కలిగిన వాడు శకుని. అమోఘుడు, వమనుడు, సువర్వుడు మొదలైన వారు.
దనువు కశ్యపుల వంశం :- వీరిలో సుర్భానువు కుమార్తె సుప్రభ. పులోముని కుమార్తె శచీదేవి, మయుని కుమార్తె ఉపదానవి, కుహువు కుమార్తె మండోదరి, వృషపర్వుడి కుమార్తె సౌందర్యవతి అయిన శర్మిష్ఠ, చంఢ. వైశ్రానరుడి కుమార్తె ప్రలోమ కాలిక(మరీచుడి భార్యలు). వీరు బహుసంతానవతులు మహాబలాడ్యులు.
మరీచుని సంతతి :- మరీచి సంతతి అరవైవేల మంది పౌలోములు(ప్రలోమ పుత్రులు), కాలఖంజులు (కాలిక పుత్రులు). బ్రహ్మవర ప్రసాదులైన వీరిని మానవులు వధించలేరు వీరు హిరణ్య పురవాసులు. వీరిని ఇంద్రకుమారుడైన అర్జునుడు వధించాడు.
విప్రచిత్తి సంతతి :- విప్రచితి హిరణ్యకశిపుని చెల్లెలైన సింహికను వివాహం చేసుకున్నాడు. సింహికకు తొమ్మిది మంది కుమారులు వీరు హిరణ్యకశిపుని మేనల్లుళ్ళు. వారు కంసుడు, కల్పవీర్యుడు.
సంహ్లాదుడి వంశం :- నివాత కవచులు. దేవగంధర్వులకు వధింప శక్యం కాని వీరిని బలరాముని అర్జునుడు వధించాడు.
వినత సంతతి:- గరుత్మంతుడు, అరుణుడు. వీరిరువులు పక్షి రాజులు. కుమార్తె సౌదామిని. ఈమె చీకటిని చెండాడు మెరుపు తీగ.
అరుణుని కుమారులు :- సంపాతి జటాయువు. సంపాతి కుమారుడు మిక్కిలి ప్రసిద్ధుడైన భభ్రువు. ఇతడు మహా వేగవంతుడు. జటాయువు సంతతి కర్ణకారి, శతగామి. వీరి పుత్ర పౌత్రులు అసంఖ్యాకులు.
గరుత్మంతుని సంతతి :- గరుత్మంత సురసలకు వెయ్యి మంది కుమారులు కలిగారు.
కద్రువ సంతానం:- కద్రువ కశ్యపులకు సహస్ర శిరసులు కలిగిన సహస్ర సర్ప సంతతి కలిగారు. వీరిలో ప్రధానులు శేషుడు, వాసుకి, కర్కోటకుడు, శంఖుడు, ఐరావతుడు, కంబలుడు. వీరి మనుమలు ధనుంజయుడు, పతంజలి మొదలైన వారు. వీరి సంత్గతి అనంతము. సర్పగణము జనమేజయుని సర్పయాగమందు అనేహముగా నశించినది.
మహిషి సంతానం:- మహిషి కశ్యపుల సంతానం కోరలుకలిగిన జంతువులు, నక్కలు, కాకులు.
సురభి సంతానం:- సురభి, కశ్యపుల సంతానం గోవులు, గేదెలు.
ముని సంతానం :- ముని కశ్యప సంతానము మునిగణము, అప్సర గణము, కిన్నెరలు, గంధర్వులు.
ఖస సంతానం :- ఖస కశ్యపులకు రాక్షసులు, యక్షులు. వీరు కోటానుకోట్లుగా ఉన్నారు.
మరుత్తులు :- దితి కశ్యప కుమారులైన వీరు నలభైతొమ్మిది మంది. సమరకిశోరాలు అయిన వీరు దేవగణములోని వారు.