పురాతన ఈజిప్టు ఈశాన్య ఆఫ్రికాలో విలసిల్లిన ఒక ప్రాచీన నాగరికత. ఇది ఎక్కువ భాగం ప్రస్తుతం ఆధునిక ఈజిప్టు దేశపు భూభాగంలో నైలు నది దిగువ భాగాన కేంద్రీకృతమైంది. ఇది చరిత్ర పూర్వపు ఈజిప్టు తర్వాత సుమారు సా.శ.పూ 3100 లో మొదలైంది. ఆ కాలంలో ఈజిప్టు ఫారో లేదా చక్రవర్తి మేనేస్ ఆధ్వర్యంలో ఈజిప్టు ఎగువ, దిగువ భాగాలు ఏకం అయ్యాయి.

పురాతన ఈజిప్షియన్లు సాధించిన అనేక విజయాలలో రాళ్ళ తవ్వకం, సర్వేక్షణ, నిర్మాణ సాంకేతికతలు ఉన్నాయి. ఇవి స్మారక పిరమిడ్‌లు, దేవాలయాలు, ఒబెలిస్క్‌ల (సన్నని ఎత్తైన) నిర్మాణాలకు సహాయపడ్డాయి. గణిత శాస్త్ర వ్యవస్థ, ఔషధాలు, నీటిపారుదల వ్యవస్థలు, వ్యవసాయ ఉత్పాదక సాంకేతికతలకు సంబంధించిన ఆచరణాత్మక ప్రభావవంతమైన వ్యవస్థ, మొట్టమొదటిగా తెలిసిన ప్లాంక్డ్ బోట్లు,[1] ఈజిప్షియన్ గాజు సాంకేతికత, కొత్త సాహిత్య రూపాలు వీరి నాగరికతలో ఇమిడి ఉన్నాయి.

చరిత్ర

మార్చు

నైలు నది మానవ చరిత్రలో చాలా వరకు ఈ ప్రాంతానికి జీవనాడి.[2] నైలు నది సారవంతమైన వరద మైదానం మానవులకు స్థిరమైన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను, మరింత అధునాతనమైన, కేంద్రీకృత సమాజాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఇది మానవ నాగరికత చరిత్రలో మూలస్తంభంగా మారింది.[3]

గమనికలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Ward (2001).
  2. Shaw (2003), pp. 17, 67–69.
  3. Shaw (2003), p. 17.

ఆధార గ్రంథాలు

మార్చు
  • Ward, Cheryl (May 2001). "World's Oldest Planked Boats". Archaeology. 54 (3).
  • Shaw, Ian, ed. (2003). The Oxford History of Ancient Egypt. Oxford: Oxford University Press. ISBN 978-0-19-280458-7.