పురుహూతికా క్షేత్రం
పురుహుతికా క్షేత్రం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉంది. దక్షిణ కాశీగా ఈ క్షేత్రం పిలవబడుతోంది. అష్టాదశ శక్తిపీఠాల్లోని దశమ శక్తిపీఠం ఇక్కడే కొలువుదీరింది. స్వయంభూ దత్తాత్రేయుడి జన్మస్థలం.[1]
పురుహుతికా క్షేత్రం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | కాకినాడ జిల్లా |
ప్రదేశం: | పిఠాపురం |
ఆలయ వివరాలు | |
పుష్కరిణి: | పురుహుతికా అమ్మవారు |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | హిందూ |
చరిత్ర
మార్చుదక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞంలో తన భర్త అయిన శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేని సతీదేవీ ఆ యజ్ఞవాటికలోనే ఆత్మాహుతి చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన శంకరుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు. భార్యపై ఉన్న అనురాగంతో ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకుని విలయ తాండవం చేశాడు మహేశ్వరుడు. లయకారకుడైన శివుడు తన కార్యాన్ని నెరవేర్చకపోవడంతో భూభారం పెరిగిపోవడమే కాకుండా రాక్షసుల తాకిడి కూడా ఎక్కువయింది. దీన్ని గమనించిన ఆది పరాశక్తి సతీదేవి మృతదేహాన్ని ఖండించమని శ్రీమహావిష్ణువుని ఆజ్ఞాపించింది. అమ్మ ఆనతి మేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీ మృతదేహాన్ని విచ్ఛిన్నం చేయగా, అవి ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో పడ్డాయనీ, ఇలా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే ఈ యుగంలో శక్తిపీఠాలుగా పూజలందుకుంటున్నాయనీ పురాణాలు తెలియజేస్తున్నాయి. వీటిలో పిరుదుల భాగం పడిన ప్రాంతం పిఠాపురం. మిక్కిలి ప్రసిద్ధిచెందిన అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది పదవది. పురూహుతికా దేవిగా అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటోంది.
ప్రత్యేక ఉత్సవాలు, పండుగలు
మార్చుపురుహుతికా శక్తిపీఠంలో ప్రతి శుక్రవారం రోజూ, పర్వదినాల్లోనూ కుంకుమార్చనలను విశిష్టంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల్లో అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రోజూ శత చండీయాగాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే వేదపారాయణం కూడా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీంతోపాటు పిఠాపురం పట్టణంలో వేణుగోపాలస్వామి, గుడివీధిలో శ్రీపాదవల్లభుడి ఆలయం కొలువుతీరాయి.
ప్రదేశం
మార్చుఅన్నవరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సామర్లకోటకు 11 కి.మీ., రాజమహేంద్రవరానికి 70 కి.మీ. దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి రైలు, రోడ్డుమార్గాలు ఉన్నాయి. హైదరాబాదు నుంచి వచ్చేవారు సామర్లకోట రైల్వే స్టేషన్‌కు వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు రైలు సౌకర్యం ఉంది.
మూలాలు
మార్చు- ↑ పురూహుతికా క్షేత్రం. "మహా శక్తిపీఠం... పురూహుతికా క్షేత్రం". ఈనాడు. Archived from the original on 18 సెప్టెంబరు 2017. Retrieved 17 September 2017.