పిఠాపురం
పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, పిఠాపురం మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. ఇక్కడ గల కుక్కుటేశ్వర ఆలయం, పురుహూతికా దేవి ఆలయం ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.
పట్టణం | |
![]() | |
నిర్దేశాంకాలు: 17°07′N 82°16′E / 17.12°N 82.27°ECoordinates: 17°07′N 82°16′E / 17.12°N 82.27°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
మండలం | పిఠాపురం మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 22.71 km2 (8.77 sq mi) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 54,859 |
• సాంద్రత | 2,400/km2 (6,300/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1020 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 8869 ![]() |
పిన్(PIN) | 533450 ![]() |
జాలస్థలి |
పేరు వ్యుత్పత్తిసవరించు
పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపతి పీఠాంబ.ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో అమృతం పాత్ర, వేరొక చేత బాగుగా పండిన మాదీఫల కాయ, మూడవ చేత డాలు, నాల్గవ చేత లోహ లోహదండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో స్వామి ఆలయంలో ఉంది.
భౌగోళికంసవరించు
జిల్లా కేంద్రమైన కాకినాడ కు ఉత్తరంగా 15 కి.మీ దూరంలో వుంది.
జనగణన గణాంకాలుసవరించు
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పట్టణ పరిధిలోని జనాభా- మొత్తం 1,29,282 - పురుషులు 64,906 - స్త్రీలు 64,376
పరిపాలనసవరించు
పిఠాపురం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణ సౌకర్యాలుసవరించు
జాతీయ రహదారి 216 పైనుంది. ఈ పట్టణం మద్రాసు-హౌరా రైలు మార్గంలో ఉంది.
విద్యా సౌకర్యాలుసవరించు
- సూర్యరాయ డిగ్రీ కాలేజి
పర్యాటక ఆకర్షణలుసవరించు
పురుహూతికా దేవి ఆలయంసవరించు
కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషనుకి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్థాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు.
ఇతర ఆలయాలుసవరించు
- కుంతి మాధవస్వామి ఆలయం (పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి)
- నూకాలమ్మ గుడి
ఇతర విశేషాలుసవరించు
- సా. శ. 1830 దశకంలో పిఠాపురంలో జరిగిన "ట్రంకు మర్డర్ కేసు" దర్యాప్తూ, విచారణా రామేశ్వరంలో జరిగాయి. ఈ కేసులో పిఠాపురం రాజా వారు ఇరుక్కున్నారు. అందుకని ఆ రోజులలో ఇది బాగా పేరు పడ్డ కేసు. ఎవ్వరో ఎవరినో (మాంసం వ్యాపారి అని తర్వాత తెలిసింది) ఖూనీ చేసేసి, ముక్కలు ముక్కలుగా కోసేసి, సూట్ కేసులో పెట్టేసి ఆ పెట్టెని చెన్నై పేసెంజరు లోనోక్కించేసేరు. దరిమిలా రైలు రామేశ్వరం చేరుకునేసరికి ఆ పెట్టె కంపు కొట్టడం, పోలీసులు దానిని అక్కడ దించడం జరిగింది. శవం రామేశ్వరంలో పట్టుబడింది కనుక కేసు అక్కడ నమోదయింది.
- పిఠాపురంలో వీణల తయారీ జరుగుతోంది. దత్త క్షేత్రానికి దగ్గరలో వీణలు తయారు చేస్తారు.
పిఠాపుర సంస్థాన విశేషాలుసవరించు
పిఠాపురం సంస్థానాన్ని వెలమ రాజులు పాలించే వారు. వీరిలో సూర్యారావు బహదూర్ ప్రముఖుడు. ఈయన సాహిత్యాన్ని బాగా పోషించాడు.
చిత్రమాలికసవరించు
ఇవీ చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018