పులిట్జర్ బహుమానం

పులిట్జర్ బహుమతి అమెరికాలో వార్తాపత్రిక, పత్రిక, ఆన్లైన్ జర్నలిజం, సాహిత్యం, సంగీత కూర్పు లలో ప్రతిభ కనబరచిన వారికి ఇచ్చే పురస్కారం. వార్తాపత్రిక ప్రచురణకర్త జోసెఫ్ పులిట్జర్ వీలునామాలో రాసిన దాని ప్రకారం ఈ బహుమతిని 1917 లో స్థాపించారు. దీనిని కొలంబియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. [1] సంవత్సరానికి ఇరవై ఒక్క విభాగాలలో బహుమతులు ప్రదానం చేస్తారు. ఇరవై విభాగాలలో, విజేతకు ఒక సర్టిఫికెట్టును, US $ 15,000 నగదు పురస్కారాన్ని ఇస్తారు. [2] ప్రజా సేవా విభాగంలో విజేతకు బంగారు పతకం ఇస్తారు. [3] [4]

పులిట్జర్ బహుమానం
Gen pulitzer.jpg
వివరణవార్తాపత్రికరచన, సాహిత్యసేవ, సంగీతస్వర రచన విశేష సేవలకు
దేశంఅమెరికా
అందజేసినవారుకొలంబియా విశ్వవిద్యాలయం
మొదటి బహుమతి1917
వెబ్‌సైట్http://www.pulitzer.org/

ప్రవేశం, పరిశీలనసవరించు

పులిట్జర్ బహుమతి మీడియాలో వర్తించే అన్ని రచనలను దానంతటదే పరిగణించదు. ప్రత్యేకంగా ఈ బహుమతి కొరకు నమోదు చేసుకున్నవాటిని మాత్రమే పరిశిలిస్తుంది. [5] (ప్రతి ఎంట్రీకి $ 75 ప్రవేశ రుసుము ఉంటుంది) ఎంట్రీలు నిర్దిష్ట బహుమతి వర్గాలలో కనీసం ఒకదానికి సరిపోయేలా ఉండాలి. [5] రచనలు గరిష్ఠంగా రెండు వర్గాలలో మాత్రమే నమోదు చేయవచ్చు.

ప్రతి సంవత్సరం, 21 అవార్డు విభాగాలకు గాను 20 వేర్వేరు జ్యూరీలలో పనిచేయడానికి 102 మంది న్యాయమూర్తులను పులిట్జర్ ప్రైజ్ బోర్డు ఎంపిక చేస్తుంది. ఒక జ్యూరీ ఫోటోగ్రఫీ అవార్డులకు సిఫారసు చేస్తుంది. చాలా జ్యూరీలలో ఐదుగురు సభ్యులు ఉంటారు. పబ్లిక్ సర్వీస్, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్, ఎక్స్ప్లనేటరీ రిపోర్టింగ్, ఫీచర్ రైటింగ్, కామెంటరీ వర్గాలకు మాత్రం ఏడుగురు సభ్యులు ఉంటారు. అయితే, పుస్తక జ్యూరీలలో కనీసం ముగ్గురు సభ్యులు ఉండాలి. [6] ప్రతి అవార్డు విభాగానికి, జ్యూరీ మూడు నామినేషన్లు చేస్తుంది. బోర్డు నామినేషన్ల నుండి మెజారిటీ ఓటు ద్వారా విజేతను ఎన్నుకుంటుంది లేదా నామినేషన్లను పక్కన పెట్టి 75 శాతం మెజారిటీ ఓటుతో వేరే ఎంట్రీని ఎంచుకుంటుంది. అసలు అవార్డు ఇవ్వకుండా కూడా బోర్డు ఓటు వేయవచ్చు. బోర్డు, జర్నలిజం న్యాయమూర్తులకు డబ్బు ఇవ్వరు. అయితే, ఉత్తరాలు, సంగీతం, నాటకంలోని న్యాయమూర్తులు సంవత్సరానికి $ 2,000 గౌరవ వేతనం అందుకుంటారు. ప్రతి జ్యూరీ చైర్మనుకు $2,500 లభిస్తుంది. [6]

ప్రవేశం పొందినవాటికి, నామినేటెడ్ ఫైనలిస్టులకూ మధ్య వ్యత్యాసంసవరించు

ఎవరైనా తమ పనిని సమర్పిస్తే వారిని ఎంట్రంట్ అంటారు. జ్యూరీ ప్రతి వర్గానికి విజేతతో కలిసి నామినేటెడ్ ఫైనలిస్టుల సమూహాన్ని ఎన్నుకుని, వారిని ప్రకటిస్తుంది. అయితే, కొంతమంది జర్నలిస్టులు, రచయితలూ తాము ఫైనలిస్టులుగా ఎంపిక కానప్పటికీ, తమ పనిని వారికి సమర్పించాం కాబట్టి, తమను తాము పులిట్జర్ నామినీలుగా ప్రచారం చేసుకుంటూంటారు. అలా చేసుకోకూడదని పులిట్జర్ బోర్డు చెబుతుంది.  

చరిత్రసవరించు

వార్తాపత్రిక ప్రచురణకర్త జోసెఫ్ పులిట్జర్ తన వీలునామాలో కొలంబియా విశ్వవిద్యాలయం కొంత డబ్బు ఇస్తూ, ఒక జర్నలిజం స్కూలును ప్రారంభించమని, ఒక బహుమతిని ఏర్పాటు చెయ్యమనీ కోరాడు. ఈ బహుమతికి, స్కాలర్‌షిప్‌లకూ కలిపి $2,50,000 కేటాయించాడు. [7] అతను "జర్నలిజంలో నాలుగు అవార్డులు, సాహిత్యం, నాటకంలో నాలుగు, విద్యలో ఒకటి, నాలుగు ప్రయాణ స్కాలర్‌షిప్‌లను" పేర్కొన్నాడు. [8] 1911 అక్టోబరు 29 న ఆయన మరణించిన తరువాత, మొదటి పులిట్జర్ బహుమతులు 1917 జూన్ 4 న ఇచ్చారు (ఇప్పుడు వాటిని ఏప్రిల్‌లో ప్రకటిస్తున్నారు). కల్నల్ రాబర్ట్ ఆర్. మెక్‌కార్మిక్ నియంత్రణలో ఉన్న చికాగో ట్రిబ్యూన్ పులిట్జర్ బహుమతి 'పరస్పరం భుజాలు తట్టుకోవడం' తప్ప మరొకటి కాదని, దాన్నంత పట్టించుకోవాల్సిన పని లేదనీ భావించింది. 1961 వరకు మెక్‌కార్మిక్ నేతృత్వంలో ఉన్నంతవరకూ ఆ పత్రిక బహుమతి కోసం పోటీ చేయడానికి నిరాకరించింది. [9]

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. "History of The Pulitzer Prizes". Columbia University. Updated 2013 by Sig Gissler.
  2. "Pulitzer Board raises prize award to $15,000". Columbia University.
  3. "Administration". Columbia University. Updated 2013 by Sig Gissler.
  4. "The Medal". Pulitzer Prizes.
  5. 5.0 5.1 Entry Form For a Pulitzer Prize in Journalism Pulitzer.org
  6. 6.0 6.1 "History of The Pulitzer Prizes". Columbia University. Updated 2013 by Sig Gissler.
  7. Morris, James McGrath (2010). Pulitzer: A Life in Politics, Print, and Power. New York, NY: HarperCollins. p. 461. ISBN 978-0-06-079870-3. Retrieved Sep 12, 2011.
  8. "History of The Pulitzer Prizes". Columbia University. Updated 2013 by Sig Gissler.
  9. Reardon, Patrick T (June 8, 1997). "A Parade of Pulitzers". Chicago Tribune. Retrieved April 27, 2013. for more than two decades [...] the Tribune refused to compete for the awards.