పుష్కర్ సింగ్ ధామీ
పుష్కర్ సింగ్ ధామీ(జననం 1975 సెప్టెంబర్ 16)భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా పరిపాలన నిర్వహిస్తున్నాడు.ధామీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉద్దంసింగ్ నగర్ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ నుండి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యాడు.45 ఏళ్ళ వయసులో ఉత్తరాఖండ్‌లో అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి అయ్యాడు.[1]
పుష్కర్ సింగ్ ధామీ | |||
పుష్కర్ సింగ్ ధామీ | |||
10వ ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్
| |||
---|---|---|---|
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 జులై 4 | |||
గవర్నరు | బేబీ రాణి మౌర్య | ||
ముందు | తీరత్ సింగ్ రావత్ | ||
ఉత్తరాఖండ్ అసెంబ్లీ సభ్యడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2012 | |||
నియోజకవర్గం | ఖతిమా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పితోరాగఢ్, ఉత్తరాఖండ్, భారతదేశం (ఒకప్పటి ఉత్తర్ ప్రదేశ్) | 1975 సెప్టెంబరు 16||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | గీత ధామీ | ||
సంతానం | 2 కుమారులు | ||
నివాసం | ఖతిమా, ఉద్దంసింగ్ నగర్ | ||
పూర్వ విద్యార్థి | లక్నో విశ్వవిద్యాలయం |
వ్యక్తిగత జీవితం
మార్చుధామీ పూర్వీకులు ఉత్తరాఖండ్లోని పితోర్గర్హ్ జిల్లా హర్ఖోల గ్రామానికి చెందిన వారు.ఇతను ఖతిమా పట్టణంలో జన్మించాడు.ఇతని తండ్రి ఆర్మీలో సుబేదారుగా సేవలందించి పదవీవిరమణ చేసాడు.
రాజకీయ జీవితం
మార్చుధామీ 1990లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషద్తో తన రాజకీయ జీవితం ప్రారంభించాడు.ఆ తరువాత 2008 వరకు భారతీయ జనతా యువ మోర్ఛాకి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసాడు.అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వివిధ శాఖలలో స్థానిక యువకులకు 70 శాతం వరకు అవకాశాలు అందేలా చూసాడు.
ఆ రాష్ట్ర బీజేపీలో అసమ్మతి సెగల కారణంగా ఇంతకు మునుపు ముఖ్యమంత్రిగా ఉన్న తీరత్ సింగ్ రావత్ తన పదవికి 2021 జులై 2న రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర నేతలు ధామీ ని ముఖ్యమంత్రి పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.[2][3]
పుష్కర్ సింగ్ ధామి 2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలల్లో ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భువన్ కప్రీ చేతిలో 6,951 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4] ఈ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ బీజేపీ హైకమాండ్ ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడంతో పుష్కర్ సింగ్ ధామీ 23 మార్చి 2022న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[5]
పుష్కర్ సింగ్ ధామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంపావత్ ఎమ్మెల్యేగా గెలిచిన కైలాష్ చంద్ర గహ్టోరి తన స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పుష్కర్ సింగ్ ధామి 55,025 ఓట్ల భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ DelhiJuly 3, Himanshu Mishra Dehradun | New; July 3, 2021UPDATED:; Ist, 2021 23:13. "BJP MLA Pushkar Singh Dhami to take oath as 11th chief minister of Uttarakhand tomorrow". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-07-04.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Breaking News :Pushkar Singh Dhami elected as new Uttarakhand chief minister | ABN Telugu". andhrajyothy. Retrieved 2021-07-04.
- ↑ "tv9 తెలుగు న్యూస్". tv9.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Sakshi (10 March 2022). "ఎన్నికల రిజల్ట్.. బీజేపీకి బిగ్ షాక్.. ఆందోళనలో కాషాయ నేతలు". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
- ↑ Prabha News (23 March 2022). "ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ ప్రమాణ స్వీకారం.. ఎమ్మెల్యేగా ఓడినా అధికారం". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
- ↑ The Indian Express (3 June 2022). "Pushkar Singh Dhami wins Champawat bypolls by 55,000 votes, retains CM post" (in ఇంగ్లీష్). Archived from the original on 20 January 2024. Retrieved 20 January 2024.