పూజా ప్రియాంక (జననం 1991 మే 23) ఫిజియన్-ఇండియన్ నటి, మోడల్, డాన్సర్, వ్యవస్థాపకురాలు, అందాల పోటీ టైటిల్ హోల్డర్.[2] ఆమె మిస్ వరల్డ్ ఫిజీ 2016 పోటీ టైటిల్ [3] [4] గెలుపొందింది. ఆమె ధర్మేంద్రతో కలిసి "ది డ్రీమ్ క్యాచర్" అనే షార్ట్ ఫిల్మ్‌లో పాత్రను పోషించడం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.[5] [6]

పూజా ప్రియాంక
జననం (1991-05-23) 1991 మే 23 (వయసు 33)
లౌటోకా, ఫిజీ[1]
జాతీయతఫిజియన్-భారతీయురాలు
పౌరసత్వం
  • ఫిజీ
  • ఆస్ట్రేలియా
వృత్తి
  • అందాల పోటీ టైటిల్ హోల్డర్
  • ఫ్యాషన్ మోడల్
  • నటి
  • డాన్సర్
సంస్థమిస్ వరల్డ్ ఆర్గనైజేషన్

కెరీర్

మార్చు

ప్రియాంక తన 18వ యేట స్థానిక అందాల పోటీలకు పోటీ చేయడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించి, అనేక టైటిళ్లను గెలుచుకుంది. 2016లో, పూజ మరో తొమ్మిది మంది అభ్యర్థుల మధ్య మిస్ వరల్డ్ ఫిజీ టైటిల్‌ను దక్కించుకుంది.[7] [8] ఈ విజయం వాషింగ్టన్, డి.సి.లో జరిగిన 66వ మిస్ వరల్డ్ పోటీలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించేలా చేసింది, అక్కడ ఆమె టాప్ 20 ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచింది.[9] [10]

ప్రియాంక తన ఐదేళ్ల వయసు నుంచే భారతీయ సంప్రదాయ నృత్య రూపాల్లో శిక్షణ తీసుకుంది. ఆమె ఆస్ట్రేలియాలో ఉన్న బాలీవుడ్ డ్యాన్స్ కంపెనీ విదేశి గర్ల్స్ సహ వ్యవస్థాపకురాలు, సృష్టికర్త. [11] ఆమె తన సొంత ఫ్యాషన్ లేబుల్ విదేశి (ViDesi) అలాగే ఆభరణాల బ్రాండ్ పేపర్ పియానిస్(PaperPeonies) సహ వ్యవస్థాపకురాలు.[12] 2016లో పూజా ప్రియాంక ఫిజీ ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది.[13]

మిస్ వరల్డ్ 2016

మార్చు

ప్రియాంక 2016 మే 7న సువాలోని గ్రాండ్ పసిఫిక్ హోటల్‌ బాల్‌రూమ్‌లో మిస్ వరల్డ్ ఫిజీ 2016 కిరీటాన్ని పొందింది, 2016 డిసెంబరు 18న వాషింగ్టన్, డి.సి., యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2016 లో పోటీ పడింది.[14] [15] [16]

మిస్ వరల్డ్ ఫిజీ 2016

మార్చు

ప్రియాంక మిస్ వరల్డ్ 2016 లో ఫిజీకి ప్రాతినిధ్యం వహించింది. బ్యూటీ టాలెంట్ లో టాప్ 20లో నిలిచింది.

మూలాలు

మార్చు
  1. "Let's Go Local: Yasawas and Taveuni On Pooja's Bucketlist". Fiji Sun. Retrieved 14 October 2021.
  2. "Pooja Priyanka". IMDb. Retrieved 14 October 2021.
  3. "Pooja Makes Miss World Talent Semi Finals". Fiji Sun. Retrieved 14 October 2021.
  4. "Pooja Priyanka winner of Miss Fiji World 2016". India Times (in ఇంగ్లీష్). 7 May 2016. Archived from the original on 24 అక్టోబర్ 2021. Retrieved 14 October 2021. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  5. "Dharmendra promotes his first international project Dream Catcher, says he is 'just a boy from Punjab, a sweet boy'. See photos". The Indian Express (in ఇంగ్లీష్). 3 June 2017. Retrieved 14 October 2021.
  6. "Pooja Involved In Indian-Aussie Short Film". Fiji Sun. Retrieved 14 October 2021.
  7. "Pooja Priyanka is Miss World Fiji". Fiji Broadcasting Corporation. Archived from the original on 28 అక్టోబర్ 2021. Retrieved 14 October 2021. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  8. "Sydneysider to represent Fiji at Miss World 2016 pageant". SBS News (in ఇంగ్లీష్). Retrieved 14 October 2021.
  9. "Priyanka Hard At Work For Miss World 2016". Fiji Sun. Retrieved 14 October 2021.
  10. "Pooja Excited With New York Visit". Fiji Sun. Retrieved 14 October 2021.
  11. "Fiji-born Indian model to represent Australia in Miss Universal Peace and Humanity". www.thehansindia.com (in ఇంగ్లీష్). 22 July 2015. Retrieved 14 October 2021.
  12. "Paper Peonies". Paper Peonies (in ఇంగ్లీష్). Archived from the original on 27 అక్టోబర్ 2021. Retrieved 14 October 2021. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  13. "FBC, Priyanka Sign Up". Fiji Sun. Retrieved 14 October 2021.
  14. "Pooja Priyanka winner of Miss Fiji World 2016 - Beauty Pageants - Indiatimes". Femina Miss India. Archived from the original on 24 అక్టోబర్ 2021. Retrieved 14 October 2021. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  15. "Pooja Priyanka wins Miss World Fiji 2016". The Great Pageant Community. 7 May 2016. Retrieved 14 October 2021.
  16. "Pooja Ready For Miss World Pageant". Fiji Sun. Retrieved 14 October 2021.